గౌతమ్ అదానీ, జ‌గ‌న్ ర‌హ‌స్య భేటీ? 9వేల మెగావాట్ల సోలార్ ప‌వ‌ర్ మ‌త‌ల‌బు

ఏదైనా కాంట్రాక్ట్ లేదా ప్రాజెక్టుల ఒప్పందాల‌ను ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేస్తాయి. ఒప్పందాలు చేసుకున్న వెంట‌నే అందుకు సంబంధించిన ఉపాథి అవ‌కాశాలు, ప్ర‌భుత్వానికి వ‌చ్చే బెనిఫిట్స్ త‌దిత‌రాల‌ను వివ‌రించాలి.

  • Written By:
  • Updated On - September 24, 2021 / 10:55 AM IST

ఏదైనా కాంట్రాక్ట్ లేదా ప్రాజెక్టుల ఒప్పందాల‌ను ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేస్తాయి. ఒప్పందాలు చేసుకున్న వెంట‌నే అందుకు సంబంధించిన ఉపాథి అవ‌కాశాలు, ప్ర‌భుత్వానికి వ‌చ్చే బెనిఫిట్స్ త‌దిత‌రాల‌ను వివ‌రించాలి. అదేమీ లేకుండా అత్యంత ర‌హ‌స్యంగా అదానీ గ్రూప్ చైర్మ‌న్ గౌత‌మ్ అదానీ, ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కలిశారు. ఒప్పందాలు ఏమి జ‌రిగాయో బ‌య‌ట పెట్ట‌డంలేదు. విశ్వ‌స‌నీయంగా తెలిసిన స‌మాచారం మేర‌కు 9వేల మెగా వాట్ల సోలార్ పవ‌ర్ అనుమ‌తుల‌ను జ‌గ‌న్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. ఆ విష‌యాన్ని సీపీఐ ఏపీ కార్య‌ద‌ర్శి రామ‌క్రిష్ణ వెల్ల‌డించారు.
అదానీ గ్రూప్ కు క్రిష్ణ‌ప‌ట్నం పోర్ట్ ను అప్ప‌గించారు. గ‌న్న‌వ‌రం పోర్డ్ ను ఏపీ స‌ర్కార్ అప్ప‌గించింది. మ‌చిలీప‌ట్నం పోర్ట్ ను కూడా అప్ప‌గించ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం రెడీ అయింది. రాష్ట్రంలోని ఓడ‌రేవులు, విమానాశ్ర‌యాల‌ను అదానీ గ్రూప్ కు ఎందుకు అప్ప‌గిస్తున్నార‌ని విప‌క్షాలు ప్ర‌శ్నిస్తున్నాయి. కానీ, జ‌గ‌న్ మాత్రం మౌనంగా ఉన్నారు.
ఏపీ, తెలంగాణ‌కు చెందిన అనేక మంది పేరుమోసిన కాంట్రాక్ట‌ర్లు, పారిశ్రామిక‌వేత్తులు ఉన్నారు. వాళ్ల‌ను కాద‌ని గుజ‌రాత్ కు చెందిన అదానీ గ్రూప్ కు హోల్ సేల్ గా ఏపీ ప్రాజెక్టుల‌ను ఎందుకు అప్ప‌గిస్తున్నారో..తెలియ‌చేయాల‌ని కామ్రేడ్లు నిల‌దీస్తున్నారు. సాధారణంగా గ్లోబ‌ల్ టెండ‌ర్ల‌ను పిల‌వ‌డం ద్వారా ప‌వ‌ర్ ప్రాజెక్టుల‌ను అప్ప‌గిస్తారు. రాష్ట్రంలో 9వేల మెగా వాట్ల సోలార్ ప‌వ‌ర్ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ కాకుండా మ‌రో న‌లుగురు అప్రోచ్ అయ్యార‌ని తెలుస్తోంది.
ఆ నాలుగు కంపెనీల‌ను కాద‌ని కేవ‌లం అదానీ గ్రూప్ కు మాత్రం ఆ ప్రాజెక్టుల‌ను అప్ప‌గించ‌డం వెనుక రహ‌స్యాల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని విప‌క్ష నేత‌లు డిమాండ్ చేస్తున్నారు. ర‌హ‌స్యంగా గౌత‌మ్ అదానీతో జ‌గ‌న్ ఎందుకు క‌లిశారో నిగ్గుతేల్చాల‌ని నిల‌దీస్తున్నారు. ప్ర‌భుత్వం వైపు నుంచి అదానీ తో భేటీపై స్పష్ట‌త రావ‌డంలేదు. గ‌తంలో ఏ ప్ర‌భుత్వమూ ఇంత ర‌హ‌స్యంగా ఒప్పందాలు చేసుకోలేదు. పైగా ఒప్పందాలు జ‌రిగితే వాటి గురించి వివ‌రాల‌ను తెల‌య‌చేసే వాళ్లు. ఇప్పుడు జ‌గ‌న్ కొత్త పంథాను ఎంచుకున్నారు. ర‌హ‌స్య భేటీల‌తో పారిశ్రామిక‌వేత్త‌ల‌కు రాష్ట్ర సంప‌ద‌ను ధార‌ద‌త్తం చేస్తున్నాడ‌ని ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. వీటికి జ‌గ‌న్ ఉంచే స‌మాధానం ఏంటో చూద్దాం.