Site icon HashtagU Telugu

AP Pensions : రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ – మంత్రి పార్థసారధి

Disbursement Of Pensions At

Disbursement Of Pensions At

రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరిగిందని సమాచార శాఖ మంత్రి పార్థసారధి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజులో 95 శాతం మేర పెన్షన్లు పంపిణీ చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెన్షన్ రూ. 4000 వేలు చేస్తామని..ఏప్రిల్‌ నుంచే పెంచిన మొత్తాన్ని అమలు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు గాను 1,000 చొప్పున కలిపి మొత్తం 7 వేలు నేడు పంపిణీ చేశారు. అలాగే దివ్యాంగులకు, బహుళ వైకల్యం సంభవించిన వారికి ఒకేసారి 3 వేల పెంచి 6 వేల రూపాయల చొప్పున అందించారు. ఇంటివద్దకే వచ్చి పెన్షన్ అందజేస్తామని తెలిపిన కూటమి..ఈరోజు అదే పని చేసి మాట నిలబెట్టుకుంది. ఇక హామీ ఇచ్చినట్లే పెన్షన్ ఇవ్వడం…అది కూడా ఇంటివద్దకే వచ్చి ఇవ్వడం తో లబ్ధిదారుల ఆనందం మాటల్లో చెప్పలేం. పెన్షన్ తీసుకొని డాన్సులు వేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ సందర్భాంగా మంత్రి పార్థసారధి మీడియా తో మాట్లాడుతూ..రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరిగిందని , రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజులో 95 శాతం మేర పెన్షన్లు పంపిణీ చేసిందన్నారు. సాయంత్రం ఏడుగంటల సమయానికి దాదాపు 94.15 శాతం మేర పంపిణీ పూర్తి చేశాం. 61,60,825 మందికి పెన్షన్ల నగదు అందజేశాం. 4,159 కోట్ల రూపాయల పెన్షన్ మొత్తం లబ్ధిదారులకు అందాయి. 2.65 లక్షల మంది వాలంటేర్ లు ఉన్నా గతంలో ఎన్నడూ ఇంత వేగంగా జరగని పెన్షన్ పంపిణీ జరగలేదు. 1.30 లక్షల మంది సచివాలయం ఉద్యోగులతో రికార్డు స్థాయిలో 12 గంటల వ్యవధి లో పెన్షన్లు పంపిణీ చేపట్టాం. గత ప్రభుత్వ హయంలో 2.65 మంది వాలంటీర్ లు ఉన్నా ఒక్క రోజులో కేవలం 88 శాతం మాత్రమే పంపిణీ చేశారు. సమర్థ నాయకత్వం ఉంటే అధికారులు , ఉద్యోగులు ఎంత అద్భుతం గా పని చేస్తారో అంటూ నిరూపణ అయ్యిందని సీఎం చంద్రబాబు పై ప్రసంశలు కురిపించారు.

Read Also : CBN : కలుద్దాం అంటూ.. సీఎం రేవంత్ కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ..

Exit mobile version