AP Elections 2024: మహిళల విషయంలో చంద్రబాబు vs జగన్..

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. గెలుపే లక్యంగా రాజకీయ పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలతో రెచ్చిపోతున్నాయి. ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో మహిళల ప్రస్తావన ఎక్కువైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప నుంచి ఎంపీగా బరిలోకి దిగుతున్నారు.

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. గెలుపే లక్యంగా రాజకీయ పార్టీలు విమర్శలు, ప్రతి విమర్శలతో రెచ్చిపోతున్నాయి. ప్రధానంగా ఏపీ రాజకీయాల్లో మహిళల ప్రస్తావన ఎక్కువైంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కడప నుంచి ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. అదే ప్రాంతం నుంచి వైఎస్ కుటుంబీకుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు. దీంతో కడప రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అయితే ఎన్నికల ప్రచారంలో వైఎస్ వివేకా హత్య కేసు కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. సొంత బాబాయ్ ని హత్య చేసిన వ్యక్తిని అంటే అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు అంటూ సీఎం జగన్ పై సోదరి షర్మిల ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు వివేకా కుమార్తె వైఎస్ సునీత సీఎం జగన్ పై సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పటికీ జగన్ మహిళలపై వ్యాఖ్యలు చేయడాన్ని పలువురు తప్పు పడుతున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సోదరి షర్మిలపై విరుచుకుపడ్డారు. అయితే జగన్ వ్యాఖ్యల వెనుక ఆందోళన చెందుతున్నట్లుగా రాజకీయ విమర్శకులు చెప్తున్నారు. షర్మిల, సునీతలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓట్లను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని, వైఎస్సార్‌సీపీ కంచుకోట అయిన కడపలో తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటున్నారని జగన్‌ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో జగన్ చెల్లెలు షర్మిల చీర రంగుపై కామెంట్స్ చేయడం విమర్శలకు దారి తీసింది.

We’re now on WhatsAppClick to Join

కొన్నేళ్లుగా పురందేశ్వరి, లక్ష్మీపార్వతి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా ఉండేవారు. ఎన్టీఆర్ మరణానంతరం పురందేశ్వరి కాంగ్రెస్‌లో చేరి చేరారు. పురందేశ్వరి తన భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి చంద్రబాబుపై పలు ఆరోపణలు చేశారు. చంద్రబాబుపై దగ్గుబాటి పుస్తకాలు కూడా రాశారు. కానీ పురందేశ్వరిపై చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. లక్ష్మీపార్వతి ఎప్పుడూ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉండేవారు. ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలో పలుమార్లు చంద్రబాబుని పర్సనల్ గా కూడా టార్గెట్ చేశారు. కానీ చంద్రబాబు ఒక్కసారి కూడా లక్ష్మీపార్వతి పేరును ఉచ్చరించలేదు. మహిళలకు చంద్రబాబు ఎప్పుడూ ఇచ్చే గౌరవం అది. మరోవైపు తన సొంత మామ హత్యకేసులో నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడుకోవడం కోసమే జగన్ తన సొంత చెల్లెలిపై హాట్ కామెంట్స్ చేయడాన్ని సహించలేకపోతున్నారు. మరోవైపు పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న తన తల్లిని బలవంతంగా రాజీనామా చేయించడం కూడా జగన్ కు మహిళలపై ఏ విధమైన గౌరవం ఉందొ అర్ధం చేసుకోవాలని టీడీపీ జగన్ తీరుని ప్రశ్నిస్తుంది. నిజానికి షర్మిల, సునీతల వల్ల జగన్ ఎదుర్కొంటున్న దానితో పోలిస్తే గతంలో చంద్రబాబు పురందేశ్వరి, లక్ష్మీపార్వతి వల్ల దారుణమైన విమర్శలను చవిచూశారు.

Also Read: KKR vs PBKS: ఐపీఎల్‌లో నేడు కేకేఆర్ వ‌ర్సెస్ పంజాబ్ కింగ్స్‌.. మరో హైస్కోరింగ్ మ్యాచ్ చూడొచ్చా..?