Site icon HashtagU Telugu

RGV : సీఎం జగన్‌తో మరోసారి ఆర్జీవీ భేటీ.. ఆ సినిమా కోసమేనా?

Director RGV Meets CM Jagan regarding Vyuham Movie

Director RGV Meets CM Jagan regarding Vyuham Movie

ఆర్జీవీ(RGV) గత ఎన్నికల సమయంలో లక్ష్మిస్ ఎన్టీఆర్(Lakshmi’s NTR) అనే సినిమాని తీసి సంచలనం సృష్టించారు. TDPకి వ్యతిరేకంగా జగన్ కి సపోర్ట్ గా ఆ సినిమా చేశారు. ఆ సినిమా ఎఫెక్ట్ ఎలక్షన్స్ లో ఎంతో కొంత చూపించింది. దీంతో ఈ సారి కూడా ఆర్జీవీతో సినిమా తీయించే పని పెట్టుకున్నారు జగన్. గతంలో ఆల్రెడీ ఓ సారి జగన్(CM Jagan) తో మీట్ అయ్యారు ఆర్జీవీ.

ఆ మీటింగ్ అనంతరం వ్యూహం(Vyuham) పార్ట్ 1, పార్ట్ 2 రెండు సినిమాలు తీస్తానని, మొదటి దాంట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించాక జగన్ ఎలాంటి కష్టాలు పడ్డారు, ఆ తర్వాత ఎలా సీఎం అయ్యారు అని చూపిస్తానని తెలిపారు. ఇక రెండో పార్ట్ లో సీఎం అయ్యాక జగన్ ఏం చేశాడో చూపిస్తానని ప్రకటించారు. ఈ సినిమాలపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినా ఎప్పటిలాగే ఆర్జీవీ తన పని తాను చేసుకుపోతున్నాడు. ఇప్పటికే సగం షూటింగ్ కూడా అయిపొయింది.

తాజాగా నేడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో ఆర్జీవీ భేటీ అయ్యారు. ఇవాళ సాయంత్రం ఈ భేటీ జరిగింది. గంటకు పైగా సీఎం జగన్ తో జరిగిన RGV సమావేశం అయ్యారు. వ్యూహం సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు సీఎం జగన్ కు ఆర్జీవీ చూపించినట్టు సమాచారం. ఈ సినిమా ఎక్కడిదాకా వచ్చింది, ఎలా వచ్చిందో తెలుసుకోవడానికే జగన్ ఈ మీటింగ్ ఆరెంజ్ చేసినట్టు తెలుస్తుంది. ఈసారి కూడా ఆర్జీవీ సినిమాలతో ఎలక్షన్స్ టైంలో ఎంతో కొంత సపోర్ట్ పొందాలని అనుకుంటున్నారు సీఎం జగన్. మరి ఈ వ్యూహం సినిమాలు ఎలా ఉంటాయి చూడాలి. ఇక మరోవైపు డైరెక్టర్ మహి వి రాఘవ్ తో యాత్ర 2 సినిమాని కూడా తెరకెక్కిస్తున్నారు YCP నాయకులు.