Site icon HashtagU Telugu

CBN : చంద్రుడు రావాలి వెలుగు తేవాలి.. చంద్ర‌బాబు మ‌ద్ద‌తుగా కాంతితో క్రాంతి కార్య‌క్ర‌మంలో దర్శకేంద్రుడు

Raghavendra rao

Raghavendra rao

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అక్ర‌మ అరెస్ట్‌ను నిర‌సిస్తూ తెలుగుదేశం పార్టీ వివిధ రూపాల్లో నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. రిలే నిరాహార దీక్ష‌ల‌తో పాటు చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా మోత మోగిద్ధాం, కాంతితో క్రాంతి అనే కార్య‌క్ర‌మాలకు టీడీపీ పిలుపునిచ్చింది. గ‌త వారం మోత‌మోగిద్దాం పేరుతో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ రోజు కాంతితో క్రాంతి పేరుతో టీడీపీ మ‌రో కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించింది. గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దాం” అంటూ టీడీపీ శ్రేణులు నిర‌స‌న తెలిపారు. ఇళ్లలో లైట్లు ఆపి కొవ్వొత్తులు, సెల్ ఫోన్ లైట్లతో నిరసన తెలిపారు. రోడ్డు మీద బైక్ లైట్లు బ్లింక్ చేసి నిర‌స‌న తెలిపారు. ఇటు తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి కూడా ప‌లువురు చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా నిలిచారు. ఆంధ్ర రాష్ట్రం అందకారం లో ఉంది.. చంద్రుడు రావాలి వెలుగు తేవాలి అంటూ దర్శకేంద్రుడు కె రాఘవేందర్ రావు చంద్ర‌బాబు అక్ర‌మ అరెస్ట్ నిర‌స‌న‌గా లైట్లు వెలిగించి నిర‌సన‌లో పాల్గొన్నారు.

Also Read:  Talasani Babu Tho Nenu : ‘బాబుతో నేను’ దీక్షకు సంఘీభావం తెలిపిన బిఆర్ఎస్ మంత్రి తలసాని