ఏపీలో పథకాలు అందని అర్హులైన ల‌బ్ధిదారుల ఖాతాల్లోకి న‌గ‌దు.. !

ఏపీలో ప‌థ‌కాలు అంద‌ని అర్హులైన ల‌బ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నగదును పంపిణీ చేయనున్నారు. వివిధ కార‌ణాల చేత ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు అర్హులైనప్ప‌టికి ల‌బ్ధిపొంద‌ని వారికి రీ వెరిఫికేషన్‌ చేసి ఏటా జూన్‌, డిసెంబర్‌లో సంక్షేమ పథకాలు అందజేస్తామన్న‌ హామీ మేరకు డబ్బులు జమచేస్తున్నామని వైఎస్‌ జగన్‌ గతంలో ప్రకటించారు.

Published By: HashtagU Telugu Desk

ఏపీలో ప‌థ‌కాలు అంద‌ని అర్హులైన ల‌బ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం నగదును పంపిణీ చేయనున్నారు. వివిధ కార‌ణాల చేత ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు అర్హులైనప్ప‌టికి ల‌బ్ధిపొంద‌ని వారికి రీ వెరిఫికేషన్‌ చేసి ఏటా జూన్‌, డిసెంబర్‌లో సంక్షేమ పథకాలు అందజేస్తామన్న‌ హామీ మేరకు డబ్బులు జమచేస్తున్నామని వైఎస్‌ జగన్‌ గతంలో ప్రకటించారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,30,809 మంది లబ్ధిదారులకు రూ.703 కోట్లు జమకానున్నాయి. 3,44,497 మంది పింఛను కార్డుదారులు, 3,07,599 మంది బియ్యం కార్డుదారులు, 1,10,880 మంది ఆరోగ్యశ్రీ కార్డులు, 90 రోజుల నిరాశ్రయులైన లబ్ధిదారులు సహా మొత్తం 18,47,996 మంది లబ్ధి పొందనున్నారు. వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ జీరో వడ్డీ (మహిళలు), వైఎస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, పెన్షన్ కార్డులు, సంఖ్య ఈ పథకాల కింద నేడు లబ్ది పొందుతున్న వారు 18,47,996. పథకానికి అర్హులై లబ్ధి పొందని వారు సంక్షేమ పథకం అందించిన నెల రోజుల్లోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటారు మరియు అర్హులైన లబ్ధిదారులు డిసెంబర్ నుండి మే వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలకు సంబంధించి జూన్‌లో పథకాలను పొందవచ్చు. ఇదిలా ఉండగా జూన్‌ నుంచి నవంబర్‌ వరకు అమలవుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు డబ్బులు అందజేయనున్నారు.

  Last Updated: 28 Dec 2021, 10:56 AM IST