Fisherman Woes: స‌ముద్ర‌జాలాల నుంచి అదృశ్య‌మ‌వుతున్న చేప‌లు ఎక్క‌డో తెలుసా…?

గత రెండు దశాబ్దాలలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా తీరప్రాంత జలాల నుండి 20 రకాల చేపలు అదృశ్యమయ్యాయి. దీంతో వేలాది మంది మ‌త్య్స‌కారులు జీవ‌నోపాధిని కోల్పోయి వ‌ల‌స కూలీలుగా మారిపోతున్నారు. స‌ముద్ర జ‌లాల్లో చేప‌ల ర‌కాల త‌గ్గుద‌ల సాంప్ర‌దాయ ప‌డ‌వ‌ల‌ను ఉప‌యోగించే మ‌త్య్స‌కారుల‌ను ఎక్కువ ప్ర‌భావితం చేసింది.

  • Written By:
  • Updated On - November 10, 2021 / 09:59 PM IST

గత రెండు దశాబ్దాలలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా తీరప్రాంత జలాల నుండి 20 రకాల చేపలు అదృశ్యమయ్యాయి. దీంతో వేలాది మంది మ‌త్య్స‌కారులు జీవ‌నోపాధిని కోల్పోయి వ‌ల‌స కూలీలుగా మారిపోతున్నారు. స‌ముద్ర జ‌లాల్లో చేప‌ల ర‌కాల త‌గ్గుద‌ల సాంప్ర‌దాయ ప‌డ‌వ‌ల‌ను ఉప‌యోగించే మ‌త్య్స‌కారుల‌ను ఎక్కువ ప్ర‌భావితం చేసింది. ఇటీవలి కాలంలో దాదాపు 5,000 మంది మ‌త్య్స‌కారులు వలస వెళ్లాల్సి వ‌చ్చింది. స్థానిక మార్కెట్‌లో అధిక ధర పలికే చేప రకాలు ఇప్పుడు తీర ప్రాంత సమీపంలో క‌నిపించ‌డంలేదు. సాంప్రదాయ మత్స్యకారులు సముద్రంలోకి ఐదు నాటికల్ మైళ్లకు మించి వెళ్లారు. కాబ‌ట్టి స‌ముద్ర ఉష్ణోగ్రతలో మార్పు కారణంగా అనేక రకాల చేపలు సాపేక్షంగా చల్లని ప్రాంతాలకు వలసపోతున్నాయని మత్స్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రకాశం తీరప్రాంతంలో కాలుష్యం కూడా చేపలు దూరం కావడానికి మరో కారణమని భావిస్తున్నారు.

Also Read : పశ్చిమ కనుమలను కాపాడుతున్న వీరవనితలు

తీరప్రాంత జలాల్లో ఇప్పుడు కనిపించని చేపల్లో ఈల్, మిల్క్ ఫిష్, స్పాటెడ్ స్నేక్‌హెడ్, క్యాట్‌ఫిష్, ఫ్లాట్‌హెడ్, గ్రుంటర్, ఇండియన్ షాడ్ మరియు ఇండియన్ కార్ప్ ఉన్నాయని సీనియర్ మత్స్యకార శాస్త్రవేత్త అనంత నాగేష్ బాబు చెప్పారు. “పులస (హిల్సా) ధర మార్కెట్లో మ‌అంతకంతకూ పెరుగుతోంది, ఎందుకంటే దాని లభ్యత తగ్గిందని ఆయ‌న తెలిపారు. మరో సాధారణ చేప ముర్రెల్ ఇప్పుడు ఇది అరుదైన జాతిగా మారింది. తాము ఐదు సంవత్సరాల క్రితం ముర్రెల్‌ను కిలో 100 రూపాయలకు విక్రయించామ‌ని…. ఇప్పుడు దాని ధర రూ 600కు చేరింద‌ని మ‌త్య్స‌కారుడు శ్రీనివాస‌రావు తెలిపారు. కాక‌పోతే ఇప్పుడు ఈ ర‌కం చేప త‌గినంత దొర‌క‌డం లేద‌ని… మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా సముద్ర కాలుష్యం వంటి మానవజన్య కార్యకలాపాల కారణంగా ఈ చేపలు కనుమరుగవుతుండం, తీరప్రాంత జలాల నుండి సురక్షితమైన ప్రదేశాలకు వలసపోతున్నాయని అధికారులు,మ‌త్య్స‌కారులు తెలిపారు.