Site icon HashtagU Telugu

Pawan Lokesh Yatra : పవన్ , లోకేష్ యాత్రల సస్పెన్స్

Jagan Order

Lokesh Pawan

యువగళం, వారాహి యాత్రలు ఏపీ పోలీస్ , హై కోర్ట్ అనుమతుల మీద ఆధార పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం 26 వారాహి (Varahi) , 27న యువగళం (Yuvagalam) యాత్రలను పవన్ , లోకేష్ (Pawan Kalyan and Nara Lokesh) ప్రారంభించాలి. తెలంగాణ రాష్ట్రంలో రిజిస్టర్ చేసిన వారాహి బస్ కు ఏపీ ఆర్టీయే అనుమతులు కావాలి. అది ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనం. దానికి ప్రత్యేక అనుమతులు ఉండాలి. ఇప్పటి వరకు ఏపీ ఆర్టీయే నుంచి అనుమతి పొందలేదు. దానికి సంబంధించి ప్రాసెస్ నడుస్తుంది. ఇక జనవరి 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర మొదలవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు పోలీస్ అనుమతి రాలేదు. పార్టీ చేసిన ధరఖాస్తూ ఏమైందో తెలియదు. కుప్పంలో మొదలుకానున్న లోకేష్ పాదయాత్ర 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు కొనసాగనుంది. అయితే నారా లోకేష్ పాదయాత్ర సజావుగా సాగుతుందా? పోలీసులు పర్మిషన్ ఇస్తారా? అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. ఇటీవల జీవో నెం1 తీసుకొచ్చి రోడ్లపై ర్యాలీలు, సభలు పెట్టకూడదని వైసీపీ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో పోలీసులు పలు ఆంక్షలు పెడుతున్నారు.

అయితే ఆ జీవో వైసీపీ (YSRCP Leaders)  నేతలకు వర్తింపచేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఈ జీవోపై హైకోర్టుకు వెళ్లారు..ప్రస్తుతం ఆ జీవో కథ హైకోర్టులోనే  (AP HighCourt)ఉంది. ఇక ఈలోపు పాదయాత్రకు సంబంధించి అనుమతి తీసుకునేందుకు టీడీపీ నేత వర్ల రామయ్య డి‌జి‌పికి లేఖ రాశారు. అటు చిత్తూరు ఎస్పీకి , పోలీసుల అధికారులకు కూడా లేఖ రాశారు. కానీ పోలీసుల నుంచి ఇంతవరకు ఎలాంటి రిప్లై రాలేదని వర్ల చెబుతున్నారు.లోకేశ్ పాదయాత్రపై రాష్ట్ర డీజీపీకి వర్ల రామయ్య రిమైండర్ లేఖ పంపారు. లోకేశ్ యువగళం పాదయాత్ర అనుమతులకు సంబంధించి నేటి వరకు పోలీసు విభాగం నుంచి ఎలాంటి స్పందన రాలేదంటూ వర్ల రామయ్య తన లేఖలో పేర్కొన్నారు. అయితే పాదయాత్ర అనుకున్న సమయానికి అనుకున్న విధంగా మొదలవుతుందని, అలాగే కుప్పంలో సభ కూడా ఉంటుందని చెప్పుకొచ్చారు. లోకేష్ పాదయాత్రని అడ్డుకోవాలని వైసీపీ శ్రేణులకు మెసేజ్‌లు వస్తున్నాయని, అయినా సరే వారికి ధీటుగా పాదయాత్ర ఉంటుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్తితుల్లో లోకేష్ పాదయాత్రపై సస్పెన్స్ కొనసాగుతుంది..పాదయాత్ర సజావుగా సాగుతుందా? ఏమైనా అడ్డంకులు వస్తాయా? అనేది చూడాలి.

Exit mobile version