Digital Registration System : ఇకపై ఏపీలో ఇంట్లో ఉండే భూ రిజిస్ట్రేష‌న్ చేసుకోవచ్చు..ఎలా అంటే !

Digital Registration System : గతంలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్, వివాహాలు, ఇతర లీగల్ డాక్యుమెంట్ల కోసం ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది

Published By: HashtagU Telugu Desk
Digital Registration System

Digital Registration System

ఆధునిక సాంకేతికతను వినియోగించి పాలనను ప్రజలకు మరింత దగ్గరిగా తీసుకెళ్లే దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే “వాట్సాప్ గవర్నెన్స్” (WhatsApp Governance) విజయవంతం కావడంతో ఇప్పుడు రిజిస్ట్రేషన్ వ్యవస్థ(Digital Registration System)ను డిజిటలీకరించేందుకు శ్రీకారం చుట్టారు. గతంలో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్, వివాహాలు, ఇతర లీగల్ డాక్యుమెంట్ల కోసం ప్రజలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అంతేకాదు దళారులు, మద్యవర్తుల ప్రభావం వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ నేప‌థ్యంలో రిజిస్ట్రేషన్ వ్యవస్థను పూర్తిగా డిజిటల్ మాదిరిలో రూపొందించి బుధ‌వారం నుండి 22 కార్యాల‌యాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా ప్రారంభించారు.

ఈ డిజిటల్ విధానం ద్వారా ప్రజలు ఇకపై ఇంటి నుండి రిజిస్ట్రేషన్ ప్రక్రియను మొదలుపెట్టవచ్చు. అవసరమైన పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం, రుసుములు చెల్లించడం, అవసరమైన స్లాట్‌ను బుక్ చేసుకోవడం చేసి, నిర్దిష్ట సమయానికి రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేయవచ్చు. ఈ విధానం వల్ల ప్రజలకు సమయం, శ్రమ ఆదా కావడమే కాక, లంచాల సమస్యకు పెద్ద ఎత్తున చెక్ పడనుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది ఒక బిగ్ రిలీఫ్‌గా మారనుంది.

ఈ డిజిటల్ రిజిస్ట్రేషన్ వ్యవస్థను మే నెల నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 144 కేంద్రాల్లో విస్తరించనున్నారు. ఇది దేశంలోనే తొలిసారి ఏ రాష్ట్రం డిజిటల్ విధానంలో రిజిస్ట్రేషన్లను పూర్తిగా అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. ఈ వ్యవస్థలో హెల్ప్‌డెస్క్ కూడా ఏర్పాటు చేయడం వల్ల ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు ప్రత్యక్షంగా ఆన్‌లైన్‌లోనే పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. ప్రజల జీవితాలను సులభతరం చేయడమే కాక, పారదర్శక పాలనకు ఇది కీలకంగా మారబోతోంది.

Mary Kom: మేరీ కోమ్ నిజంగానే భర్త నుండి విడిపోతున్నారా? క్రికెట‌ర్‌తో బాక్సింగ్ క్వీన్ డేటింగ్‌గా?

  Last Updated: 09 Apr 2025, 04:40 PM IST