Site icon HashtagU Telugu

Pothina Mahesh : పోతిని మహేష్ ను వదులుకొని పవన్ తప్పుచేసాడా..?

Mahesh Joins Ycp

Mahesh Joins Ycp

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పొత్తు కారణంగా తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని తీసుకొస్తుంది. పదేళ్లుగా జనసేన జెండాలు మోసిన వారికే టికెట్ ఇవ్వకుండా టీడీపీ (TDP) నుండి నిన్న , మొన్న చేరిన నేతలకు టికెట్ ఇవ్వడం ఫై ప్రతి ఒక్కరు విమర్శలు చేస్తున్నారు. జగన్ (Jagan) ను ఓడించాలంటే పొత్తే శరణ్యమా..? సొంత పార్టీ నేతలను మోసం చేయడం ఎంత వరకు న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. పొత్తు పెట్టుకున్నప్పటికీ సొంత పార్టీ నేతలకు టికెట్ ఇచ్చి ఉంటె బాగుండు..అంతే కానీ సొంతవారిని పక్కన పెట్టి పక్క పార్టీ నేతలను చేర్చుకొని వారికే టికెట్ ఇస్తే ఎలా అని సగటు పార్టీ శ్రేణి అంటున్నారు.

పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల పార్టీ ఫై ఉన్న నమ్మకమే కాదు పవన్ కళ్యాణ్ ఫై పెట్టుకున్న నమ్మకం కూడా పటాపంచలు అయ్యిందని వాపోతున్నారు. ఇప్పుడు పవన్ అంటే ఓ మోసగాడు..పార్టీని అమ్ముకున్న వ్యక్తి అంటూ పార్టీ నుండి బయటకు వచ్చిన నేతలు అంటున్నారు. తాజాగా జనసేన విజయవాడ వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిన మహేశ్ (Pothina Mahesh) పార్టీని వీడడం పార్టీకి తీవ్ర నష్టమే కాదు కూటమి కి కూడా పెద్ద నష్టం అని అంటున్నారు. మహేష్ ఎంతోకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్నారు..అలాంటి వ్యక్తికి కూడా టికెట్ ఇవ్వకపోతే ఎలా అని అంటున్నారు. మహేష్ పార్టీని వీడి మంచి పని చేసాడని చెపుతున్నారు. రాజకీయాల్లో రాణించాలంటే పదవి ఉండాలి..ఆ పదవి లేనప్పుడు రాజకీయాలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. గెలుపు , ఓటమి అనేది తర్వాత ముందు ఆయనకు టికెట్ ఇస్తే కదా గెలిచేది లేంది తెలిసేది మహేష్ వర్గీయులు అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇప్పుడు జనసేన పార్టీ నేతలకు కాకుండా టీడీపీ నేతలకు ఇచ్చిన స్థానాల్లో వారు గెలుస్తారని నమ్మకం ఉందా..? అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి పవన్ తీసుకున్న నిర్ణయాల వల్ల జనసేన కు భవిష్యత్ అనేది లేకుండా పోయిందని..మరోసారి పవన్ రాజకీయాలకు పనికిరాడని తేలిపోయిందని అంటున్నారు. ఇక జనసేన కు రాజీనామా చేసిన మహేష్..ఈరోజు వైసీపీ అధినేత , సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. మహేష్ తో పాటు పెద్ద ఎత్తున ఆయన వర్గీయులు వైసీపీ కండువా కప్పుకున్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా కీలక పదవి అందజేస్తామని జగన్ మహేష్ కు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. మహేష్ వైసీపీ లో చేరడం తో విజయవాడ లో వైసీపీ బలం మరింత పెరిగినట్లు అయ్యింది. ఈ ఎఫెక్ట్ ఖచ్చితంగా కూటమి అభ్యర్థి సుజనా ఫై పడబోతుందని తెలుస్తుంది.

Read Also :