Site icon HashtagU Telugu

Jagan : సీనియర్లను జగన్ దూరంగా పెట్టారా..?

Jagan Mohan Reddy

Jagan Mohan Reddy

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ (Jagan) సీనియర్లను (Seniors) దూరంగా పెట్టారా..? అంటే అవుననే తెలుస్తుంది. సీనియర్లను నమ్ముకొని తీవ్రంగా నష్టపోయానని తెలుసుకున్న జగన్…ప్రస్తుతం వారందర్ని దూరం పెట్టి ప్రజలకు దగ్గర కావాలని డిసైడ్ అయ్యాడు. 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గరైన సంగతి తెలిసిందే. ప్రజల కష్టాలను తెలుసుకున్న జగన్..ఆ కష్టాలను తీరుస్తా అని మాట ఇవ్వడం తో అప్పటి ఎన్నికల్లో జగన్ ను భారీ మెజార్టీ తో గెలిపించారు. ఇక అధికారంలోకి వచ్చిన జగన్..ప్రజలకు దూరంగా ఉంటూ వచ్చాడు. ఎంతసేపు సంక్షేమ పథకాల పేర్లు చెప్పారు తప్ప ప్రజల వద్దకు వెళ్లి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయి లో ప్రజలకు అందుతున్నాయా..? ప్రజలు ఇంకోరుకుంటున్నారు ..? అభివృద్ధి పై దృష్టి సారించడం వంటివి ఏమిచేయలేదు. అంతే కాకుండా సీనియర్లను నమ్ముకొని..పూర్తి బాధ్యతలు వారికే అప్పజెప్పడంతో వారు ఇష్టంవచ్చినట్లు నిర్ణయాలు తీసుకొని ప్రజల్లో ఇంకాస్త ఆగ్రహం నింపారు.

అందుకే ఇక సీనియర్లను దూరం పెట్టి..ప్రజల్లోకి పూర్తిగా వెళ్లాలని జగన్ డిసైడ్ అయ్యాడు. అలాగే జమ్మూకాశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాలు (Jammu and Kashmir and Haryana Election Results) చూసి కూడా జగన్ ఆలోచన తీరు మారిందని అంటున్నారు. అధికారం కోల్పోయాక బీజేపీకి దూరంగా ఉండాలని జగన్ ఆలోచన చేశారట.. కాంగ్రెస్‌కు దగ్గరయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసారు. కాంగ్రెస్ సీనియర్లతోను మంతనాలు చేసినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు జమ్మూకాశ్మీర్, హర్యానా ఎన్నికల ఫలితాల తర్వాత తన ఆలోచన తీరు మారిందని కొందరు నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ కంటే బీజేపీ వైపు మొగ్గు చూపితే బెటరనే అంచనాకు జగన్ వచ్చినట్టు చెపుతున్నారు. అంతకంటే ముందు జనాల్లోకి వెళ్లి..వారికీ దగ్గర కలవాలని , మళ్లీ ప్రజల్లో తన పై నమ్మకం పెంచుకోవాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే ఇక పై నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాడట.

Read Also : Singer Sunitha : సింగర్ సునీత కాపురంలో చిచ్చుపెట్టిన యూట్యూబర్ ..?