ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కీలకమైన పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) తాజాగా మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు నిర్లక్ష్యంగా కొనసాగిన కారణంగా భారీ నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా కాఫర్ డ్యాం(Coffer Dam)లు సకాలంలో నిర్మించకపోవడంతో రూ. 440 కోట్ల విలువైన డయాఫ్రమ్ వాల్ (Diaphragm wall) కొట్టుకుపోయిందని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
KTR : కేంద్రం తీరుపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారు : కేటీఆర్
కొత్త డయాఫ్రమ్ వాల్‌ను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా చంద్రబాబు పెట్టుకున్నారు. దీంతో పాటు ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన ఇతర అంశాలపైనా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. ECRF గ్యాప్-1 నిర్మాణాన్ని 2026 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలని, ECRF గ్యాప్-2 ను 2027 జూన్ నాటికి పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తి అయితే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల భూభాగానికి సాగునీరు అందుతుందని ఆయన అన్నారు.
పోలవరం ప్రాజెక్టు పూర్తవడం ద్వారా రాష్ట్ర ప్రజలకు అమితమైన ప్రయోజనం కలుగనుంది. సాగునీటి సమస్యతో పాటు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయుక్తంగా మారనుంది. ప్రభుత్వం పనులను వేగంగా పూర్తి చేసేందుకు నిర్దేశించిన గడువుల్లోనే పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే, అది రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.