గత కొద్దీ రోజులుగా వరుస రైలు ప్రమాదాలు (Train Accident) ప్రయాణికులను కలవరపెడుతున్నాయి. రైలు ప్రయాణం అంటేనే భయపడిపోతున్నారు. ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో ..? ఏ రైలు వచ్చి ఢీ కొడుతుందో..? ఎప్పుడు ఏ భోగిలో పొగలు వస్తాయో..? ఇలా అనేక అనుమానాలు ప్రయాణికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ ఆందోళనలకు మరింత ఆద్యం పోస్తూ వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో రైలు ప్రమాదం జరిగింది. విజయవాడకు బయలుదేరిన ధర్మవరం (Dharmavaram) రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం తో ప్రయాణికులు పరుగులుపెట్టారు.
కడప జిల్లాలోని ప్రొద్దుటూరు లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మంటలు బోగీ కింది భాగం నుండి వ్యాపించినట్టు సమాచారం. ట్రైన్ ప్రొద్దుటూరు ప్లాట్ ఫాం చేరుకోగానే అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు మంటలను గమనించి, రైలు లో ఉన్న ప్రయాణీకులను అప్రమత్తం చేశారు. దీంతో ప్రయాణీకులు వెంటనే రైలు నుండి బయటకు దూకేయడంతో ప్రమాదం తప్పింది. తర్వాత రైల్వే సిబ్బంది తేరుకొని మంటలను ఆర్పడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదం ఫై అధికారులు అరా తీస్తున్నారు.
Read Also : Bhuvneshwar Kumar: భువనేశ్వర్ కు లైన్ క్లియర్ అయినట్టేనా ?