TTD : తిరుమ‌ల‌లో కొన‌సాగుతున్న భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీవారి ద‌ర్శ‌నానికి..?

తిరుమ‌ల శ్రీవెంక‌టేశ్వ‌ర‌రావు స్వామి ద‌ర్శ‌నానికి భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో బారులు తీరారు. ఆదివారం కావ‌డంతో పెద్ద సంఖ్య‌లో

  • Written By:
  • Publish Date - July 16, 2023 / 01:53 PM IST

తిరుమ‌ల శ్రీవెంక‌టేశ్వ‌ర‌రావు స్వామి ద‌ర్శ‌నానికి భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో బారులు తీరారు. ఆదివారం కావ‌డంతో పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు తరలివచ్చారు. ఆలయ సర్వదర్శనం కోసం క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి భక్తులకు దాదాపు 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. శనివారం నాడు మొత్తం 87,171 మంది భక్తులు శ్రీవారిని ద‌ర్శించుకోగా.. 38,273 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి వ‌చ్చిన కానుకులు.. హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లు అని టీటీడీ ప్ర‌క‌టించింది. అక్టోబరు నెలలో ఆర్జిత సేవా టిక్కెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లను జూలై 18 ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. భక్తులు తిరుమల ఆలయంలో కానీ, టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో టిక్కెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. అక్టోబరు నెలకు సంబంధించిన కళ్యాణం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ వంటి సేవలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కెట్ల కోటాను జూలై 21న విడుదల చేస్తామని, ఆ తర్వాత అక్టోబరు నెలకు సంబంధించిన అంగప్రసాక్షిణ టోకెన్లను జూలై 24న విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది.