Site icon HashtagU Telugu

Mahashivratri : తెలుగు రాష్ట్రాల్లో శివనామ స్మరణతో మార్మోగుతున్న శైవ‌క్షేత్రాలు

Mahashivratri 2025

Mahashivratri 2025

రెండు తెలుగు రాష్ట్రాల్లోని శైవ‌క్షేత్రాలు భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. శివ‌నామ‌స్మ‌ర‌ణ‌తో శైవ‌క్షేత్రాలు మార్మోగుతున్నాయి. శివాలయాల్లో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు మొదలయ్యాయి. శివయ్యకు రుద్రాభిషేకం, బిల్వార్చనలు జరుగుతున్నాయి ఇటు ఏపీలోని శ్రీశైలం, శ్రీకాళ‌హ‌స్తి ఆల‌యాల్లో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతుంది. ఆలయానికి భక్త జనం పోటెత్తింది. ఆలయ క్యూలైన్లు భక్తులతో కిక్కిరిశాయి. 13 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. స్వామివారి దర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. శ్రీశైలం ఆలయం శివనామ స్మరణతో మార్మోగిపోతోంది. పాతాళగంగలో భక్తులు పుణ్య స్నానాలచరిస్తున్నారు.

నేడు శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. సాయంత్రం స్వామి అమ్మవార్లకు నంది వాహన సేవ అందించనున్నారు. నంది వాహనంపై స్వామి అమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అర్ధరాత్రి పాగాలంకరణ, కళ్యాణోత్సవం నిర్వహించనున్నారు. నేడు శ్రీశైలానికి 2లక్షల మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా వేస్తున్నారు. 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు తెలంగాణ‌లోని వేములవాడ రాజన్న, కీసర, హన్మకొండలోని వేయిస్తంభాల ఆల‌యాల్లో ప్రత్యేక శోభ నెలకొంది. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.