Tirumala : తిరుమ‌ల‌లో పెరిగిన భ‌క్తుల ర‌ద్దీ.. శ్రీవారి ద‌ర్శ‌నానికి..?

తిరుమలలో శ్రీవారి ద‌ర్శ‌నం కోసం భ‌క్తుల ర‌ద్దీ పెరిగింది. దర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి...

  • Written By:
  • Updated On - November 2, 2022 / 02:42 PM IST

తిరుమలలో శ్రీవారి ద‌ర్శ‌నం కోసం భ‌క్తుల ర‌ద్దీ పెరిగింది. దర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. మంగళవారం నాడు 72,176 మంది భక్తులు తిరుమలను దర్శించుకోగా, 25,549 మంది భక్తులు తలనీలాలు స‌మ‌ర్పించారు. భక్తులు సమర్పించే కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.12 కోట్లు కాగా.. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం టైమ్‌లాట్ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టింది. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాస కాంప్లెక్స్, గోవిందరాజస్వామి సత్రాల్లో మంగళవారం అర్ధరాత్రి నుంచి సర్వదర్శనం టైమ్‌స్లాట్ టోకెన్ల జారీ ప్రక్రియను పునఃప్రారంభించారు. శని, ఆది, సోమవారాల్లో 25 వేల టోకెన్లు, మిగతా రోజుల్లో రోజుకు 15 వేల టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. టోకెన్‌ అందుకున్న భక్తుడికి అదే రోజు దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. మూడు ప్రాంతాల్లో 30 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తామని, నిర్దేశిత కోటా పూర్తికాగానే కౌంటర్లను మూసివేస్తామని వివరించారు.