Devineni Avinash : దుబాయ్ వెళ్లాలని ట్రై చేసిన దేవినేని అవినాష్‌కు పోలీసులు షాక్..

మంగళగిరి పోలీసులు ఆయనకు దుబాయ్ వెళ్లేందుకు అనుమతి లేదని ..ఎయిర్ పోర్ట్ పోలీసులకు తెలుపడం తో దేవినేని అవినాష్‌ ను దుబాయ్ కి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు

Published By: HashtagU Telugu Desk
Devineni Avinash Police

Devineni Avinash Police

వైసీపీ నేత దేవినేని అవినాష్‌ (Devineni Avinash) కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు (Shamshabad Airport Police) భారీ షాక్ ఇచ్చారు. దుబాయ్ వెళ్లేందుకు వచ్చిన ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ప్రస్తుతం దేవినేని అవినాష్‌..టీడీపీ ఆఫీస్ కూల్చివేత కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన దేశం వదిలి వెళుతున్న క్రమంలో మంగళగిరి పోలీసులు ఆయనకు దుబాయ్ (DUbai) వెళ్లేందుకు అనుమతి లేదని ..ఎయిర్ పోర్ట్ పోలీసులకు తెలుపడం తో దేవినేని అవినాష్‌ ను దుబాయ్ కి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఎయిర్‌పోర్టు నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.

We’re now on WhatsApp. Click to Join.

2021 అక్టోబర్ 19న మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలో ఫర్మిచర్ ధ్వంసం చేసి.. అక్కడ పనిచేసే సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటన అప్పట్లో ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపింది. తాము ఫిర్యాదు చేసినా అప్పటి పోలీసులు.. ఈ ఘటనను పట్టించుకోలేదని.. టీడీపీ నాయకులు ఆరోపిస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసారు. అప్పటి సీసీటీవీ ఫుటేజ్‌, ఇతర ఆధారాలతో దాడికి పాల్పడినవారిలో పలువురుని గుర్తించి.. అరెస్ట్ చేశారు. టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడితో పాటు టీడీపీ నాయకుడు పట్టాభి ఇంటిపై జరిగి దాడి ఘటనల్లో దేవినేని అవినాష్‌పై కేసులు నమోదయ్యాయి. మంగళగిరి రూరల్‌ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అవినాష్‌ నిందితుడిగా ఉన్నారు.

Read Also : MLC : ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరామ్, అలీఖాన్

  Last Updated: 16 Aug 2024, 01:35 PM IST