Andhra Politics: నన్ను బలిపశువుని చేసిన పార్టీ ఏదో అందరికీ తెలుసు

సీఎం జగన్ నిన్న శుక్రవారం విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. అవినాష్ కుటుంబ సభ్యులతో సీఎం జగన్ మాట్లాడారు.

Published By: HashtagU Telugu Desk
Andhra Politics

New Web Story Copy (41)

Andhra Politics: సీఎం జగన్ నిన్న శుక్రవారం విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. అవినాష్ కుటుంబ సభ్యులతో సీఎం జగన్ మాట్లాడారు. ఇంట్లో పిల్లలతో సరదాగా గడిపారు. ఇదిలా ఉంటే సీఎం జగన్ అవినాష్ ఇంటికి వెళ్లడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని టీడీపీ ఆరోపించింది.

టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. సీఎం జగన్ దేవినేని అవినాష్ ను బలిపశువుగా మార్చారని విమర్శించారు. లోకేష్ యువగలం పాదయాత్రకు ప్రజల నుంచి అద్భుతంగా మద్దతు లభిస్తుందని, అందుకే యువగలం పాదయాత్రను అడ్డుకునే నేపథ్యంలో సీఎం జగన్ అవినాష్ ఇంటికి వెళ్లినట్లు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై దేవినేని అవినాష్ స్పందించారు.

నారా లోకేష్ యువగలం పాదయాత్ర ఓ అట్టర్ ప్లాప్ షోగా మారిందన్నారు. నేను ఏ పార్టీలో బలిపశువుని అయ్యానో ప్రతి ఒక్కరికి తెలుసని అన్నారు. కొంతమంది టీడీపీ నాయకులు మాట్లాడే మాటలను ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరని అన్నారు. సీఎం జగన్ తనకు అండగా నిలిచారని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు.

Also Read: Jailer Box Office: కేరళలో రజనీ హవా, విక్రమ్ రికార్డులను బద్దలుకొట్టిన జైలర్,

  Last Updated: 19 Aug 2023, 05:45 PM IST