Site icon HashtagU Telugu

YS Jagan : `జ‌గ‌న్, కేసీఆర్` కుంభ‌కోణాల‌పై బీజేపీ క‌న్నెర్ర‌

Jagan mohan reddy

Jagan mohan reddy

తెలుగు రాష్ట్రాల్లో స్కామ్ ల‌ను బీజేపీ బ‌య‌ట‌కు తీస్తోంది. భారీ భూ కుంభ‌కోణం ఏపీలో జ‌రిగింద‌ని లేపాక్షి భూముల వ్య‌వ‌హారాన్ని ఎంపీ జీవీఎల్ ప్ర‌శ్నించారు. సుమారు రూ. 10వేల కోట్ల విలువైను భూముల‌ను కేవ‌లం రూ. 500కోట్ల‌కు ప్రైవేటు సంస్థ‌కు ఎలా అప్ప‌గిస్తార‌ని నిల‌దీశారు. అంతేకాదు, లిక్క‌ర్ స్కామ్ లో ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు ఉన్నార‌ని బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. వీటిని మీద విచార‌ణ జ‌ర‌గాల‌ని డిమాండ్ చేశారు.
ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ మద్యం స్కాంపై ఢిల్లీలో డొంక కదులుతుంటే ఆంధ్రా, తెలంగాణలో మూలాలు వెలుగు చూస్తున్నాయన్నారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన రెండు రాష్ట్రాల్లోనూ అధికార పార్టీ మధ్య సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై రెండు ప్రభుత్వాలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మద్యం కుంభకోణంలో నిబంధనలను ఉల్లంఘించబోమని ఢిల్లీ చీఫ్ విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ ధృవీకరించిందని జీవీఎల్ అన్నారు.
విలువైన లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములు కేవలం రూ. 500 కోట్లకు ఓ ప్రైవేట్ సంస్థ టేకోవర్ చేయడం ఎంత దారుణమని జీవీఎల్ అన్నారు. జగన్ సర్కార్ (జగన్ ప్రభుత్వం) స్పందించందా అంటూ నిల‌దీశారు. ఏ ప్రయోజనం కోసం భూములు ఇచ్చారు? భూ ఒప్పందంపై ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. సదరు సంస్థలో ఓ ఎమ్మెల్యే కుమారుడు డైరెక్టర్‌గా ఉన్నారని, వారి ఆసక్తి ఏమిటో ఏపీ ప్రభుత్వం వివరించాలన్నారు. విశాఖపట్నంలో పెద్దఎత్తున ఓటర్లను రద్దు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, 50 వేల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించ‌డాన్ని ప్రధాన ఎన్నికల సంఘానికి లేఖ రాశామని జీవీఎల్ తెలిపారు.
ఒకప్పుడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై తిరగ‌బ‌డ్డ జీవీఎల్ ఇప్పుడు జ‌గ‌న్, కేసీఆర్ స‌ర్కార్ల‌ను నిల‌దీస్తున్నారు. ఆ ప్ర‌భుత్వాలు చేస్తోన్న స్కామ్ ల‌ను బ‌య‌ట‌కు లాగుతున్నారు. లిక్క‌ర్, భూ స్కామ్ లపై ధ్వ‌జ‌మెత్తారు. కేంద్రంలోని బీజేపీ చూస్తూ ఇలాంటి స్కామ్ ను వ‌దిలేయ‌ద‌ని వెల్ల‌డించారు.