Pithapuram : 4,5 తేదీలో పిఠాపురంలో పర్యటించన్ను డిప్యూటీ సీఎం

Pithapuram సోమవారం (నవంబర్ 4) ఉదయం రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి రోడ్డుమార్గంలో 11.30 గంటలకు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు జిల్లా పరిషత్ హై స్కూల్ కు పవన్ కళ్యాణ్‌ చేరుకుంటారు. అక్కడ సైన్స్ ల్యాబ్ ను ప్రారంభిస్తారు.

Published By: HashtagU Telugu Desk
Pawan Kalyan Tweet

Pawan Kalyan Tweet

Deputy CM Pawan Kalyan : ఈ నెల 4,5 తేదీల్లో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తన సొంత నియోజకవర్గమైన కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని.. వాటిని ప్రారంభిస్తారు. అనంతరం జనసేనపార్టీ నేతలతో సమావేశమై పవన్‌ కళ్యాణ్‌ కీలక అంశాలపై చర్చించనున్నారు. కాగా.. నియోజకవర్గంలో పవన్ పర్యటన ఉండటంతో.. అభిమానులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ షామ్ మోహన సగిలి బందోబస్త్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

కాగా, సోమవారం (నవంబర్ 4) ఉదయం రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి రోడ్డుమార్గంలో 11.30 గంటలకు పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు జిల్లా పరిషత్ హై స్కూల్ కు పవన్ కళ్యాణ్‌ చేరుకుంటారు. అక్కడ సైన్స్ ల్యాబ్ ను ప్రారంభిస్తారు. అనంతరం గొల్లప్రోలు హౌసింగ్ కాలనీకి, సూరంపేట హ్యాబిటేషన్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం గొల్లప్రోలు జిల్లా పరిషత్ హై స్కూల్ ను ప్రారంభించి.. తహశీల్దార్ కార్యాలయంలో పనులకు శ్రీకారం చుడతారు.

ఇకపోతే..మధ్యాహ్నం 1 గంటకు చేబ్రోలులో తన నివాసానికి చేరుకుని పవన్‌ కళ్యాణ్‌ విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు చేబ్రోలు నుంచి బయల్దేరి పిఠాపురంలోని టీటీడీ కల్యాణమండపానికి చేరుకుని ఆర్ఆర్ బీహెచ్ఆర్ డిగ్రీ కాలేజీని ప్రారంభిస్తారు, అలాగే కల్యాణమండపం మరమ్మతు పనులు, ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మరమ్మతు పనుల్ని ప్రారంభిస్తారు. పిఠాపురంలోని బాదం మాధవ జిల్లా పరిషత్ హైస్కూల్ ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి కాకినాడ రూరల్ లోని పీ.వెంకటాపురం గెస్ట్ హౌస్ కు చేరుకుని, చేబ్రోలులోని తన నివాసానికి వెళ్తారు. రాత్రికి అక్కడే బసచేస్తారు.

ఇంక మంగళవారం ఉదయం డిప్యూటీ సీఎం తన నివాసం నుంచి కొత్తపల్లి పీహెచ్ సీకి చేరుకుని.. పీహెచ్ఎస్ ఔట్ పేషెంట్ విభాగానికి, యు.కొత్తపల్లి మండలంలోని పలు స్కూళ్లకు శంకుస్థాపనలు చేస్తారు. 1 గంటకు చేబ్రోలు నివాసానికి చేరుకుని, 3 గంటలకు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు వెళ్తారు. అక్కడి నుంచి విజయవాడకు వెళ్తారు.

Read Also: Union Minister : కేంద్ర మంత్రిపై కేసు.. జాతరకు అంబులెన్సులో వెళ్లినందుకు ప్రొసీడింగ్స్

 

 

 

  Last Updated: 03 Nov 2024, 03:38 PM IST