Palle Pandaga Program : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘పల్లెపండుగ-పంచాయతీ వారోత్సవాల’ను ప్రారంభించారు. ఏపీలో ‘పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాలు’ పేరిట గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ఈ పనులు ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి ఈనెల 20 వరకు అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లెపండుగ-పంచాయతీ వారోత్సవాల్లో భాగంగా అన్ని రకాల అభివృద్ధి పనులకు భూమిపూజ చేయనున్నారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా కంకిపాడు నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు.
Read Also: Assassination Attempt : ట్రంప్‌పై మూడోసారి హత్యాయత్నం.. దుండగుడు ఏం చేశాడంటే..?
ఈ మిషన్ ద్వారా రూ.4,500 కోట్లు నిధులతో 30వేల పనులు చేపట్టనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు, రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ క్రమంలోనే గత ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా 13 వేల 326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆనాడు తీసుకున్న నిర్ణయాల మేరకు పల్లె సీమల్లో పనులు చేపడుతున్నారు. ఈ ఆర్థిక ఏడాదిలో 3వేల కి.మీ.సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 65వేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు, 25వేల నీటి కుంటలు, 22వేల 525 గోకులాలను నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..ఆగస్టు 23న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభల్లో తీర్మానాలు చేసుకున్నా.. పనులకు ఈరోజు శంకుస్థాపన చేస్తున్నామని తెలిపారు. ఈ పనులను సంక్రాంతి లోపు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీలను అభివృద్ధి చేసేందుకు 15వ ఆర్థిక సంఘం 2024 25 సంబంధించిన నిధులను సమయానుకూలంగా విడుదల చేసి పంచాయతీల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు. సీఎం చంద్రబాబు అపార అనుభవం రాష్ట్ర అభివృద్ధికి కీలకం. ఆయన నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అన్ని రంగాల్లో ముందుకు వెళుతుంది. చంద్రబాబు నాయకత్వంలో ఈ కీలక నిధులు గ్రామీణ అభివృద్ధిని సాధించేందుకు, పంచాయతీల అభివృద్ధి ద్వారా, గ్రామ స్వరాజ్యాన్ని సాధించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను..అని అన్నారు.
Read Also: Vijay Devarakonda : విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి .. మరో K.G.F..!
ఈరోజు నుంచి వారం రోజులపాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీలలో పల్లె పండుగ పేరుతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు వారోత్సవాలు జరపనున్న విషయాన్ని తెలియజేయడానికి ఎంతో గర్విస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా దాదాపు రూ.4500 కోట్ల వ్యయంతో 30 వేలకు పైగా పనులు చేపట్టి, దాదాపు 8 లక్షల మందికి జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించనున్నాము. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎల్లవేళలా అన్ని విధాలుగా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలకు రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’ అని వెల్లడించారు.