Site icon HashtagU Telugu

Tirumala : నేడు తిరుమలకి వెళ్లనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

KA Paul- Pawan Kalyan

KA Paul- Pawan Kalyan

Deputy CM Pawan Kalyan : తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఈరోజు తిరుమల తిరుపతికి వెళ్లనున్నారు.  ఈ రోజు (మంగళవారం) సాయంత్రం 5 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరనున్న జనసేన అధినేత మొదట రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి తిరుపతి చేరుకొని.. రాత్రికి తిరుమలకు ప్రయాణం అవుతారు. రేపు ఉదయాన్నే నడకమార్గంలో ప్రయాణించి శ్రీవారిని దర్శించుకుంటారు. ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం పర్యటన నేపథ్యంలో నడకమార్గంలో 3-లేయర్ సెక్యూరిటీని ఏర్పాటు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. 200 మీటర్ల పరిధి వరకు రోప్‌ పార్టీలతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్‌తో పాటు నడిచే ప్రయత్నం చేయవద్దని పార్టీ సూచించింది.

Read Also: KTR : కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకున్న కాంగ్రెస్ నేతలు..!

కాగా, తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా సీరియస్ గా తీసుకున్న విషయం తెలిసిందే. హిందూ మతానికి సంబంధించిన సనాతనధర్మం గురించి ఆయన ప్రస్తావిస్తున్నారు. సనాతనధర్మాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన కోరుతున్నారు. మరోవైపు, తిరుమల కల్తీ లడ్డూ వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వంపై పవన్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మ పరిరక్షణ కోసం సనాతనధర్మ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన చెపుతున్నారు. పవన్ సూచన పట్ల హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ పరిణామాల నేపథ్యంలో, ఆయన ఈరోజు తిరుమలకు వెళుతున్నారు. ప్రస్తుతం ప్రాయశ్చిత్త దీక్షలో ఉన్న పవన్ మధ్యాహ్నం గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి తిరుపతికి బయల్దేరుతారు. మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్డేరి సాయంత్రం 4 గంటలకు అలిపిరి పాదాల మంటపానికి చేరుకుని… అక్కడి నుంచి కాలి నడకన తిరుమలకు బయల్దేరుతారు. రాత్రికి తిరుమలకు చేరుకుంటారు.

Read Also: Religious Structures : రోడ్లను ఆక్రమించి నిర్మించిన మత కట్టడాలను తొలగించాలి : సుప్రీంకోర్టు