Site icon HashtagU Telugu

Varahi Declaration Book: తిరుమలలో పవన్ కళ్యాణ్ చేతిలో ఎర్ర బుక్, ఆ పుస్తకంలో ఏముంది?

Varahi Declaration Book

Varahi Declaration Book

Varahi Declaration Book: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) 11 రోజుల దీక్షను ఈ రోజు విరమించారు. కూతుర్లతో కలిసి తిరుమలకు వెళ్లిన ఆయన శ్రీవారి సమక్షంలో తాను చేపట్టిన విరమించారు. అయితే అంతకుముందు వేంకటేశ్వరుని దర్శనం కోసం తిరుమలకు వెళ్లేందుకు పాలినా అంజనీ కొణిదెల అనుమతి పొందారు. ఎందుకంటే ఆమె క్రిస్టియన్ కావడంతో ముందస్తుగా అనుమతి కోరడం జరిగింది.

తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పేపర్లపై కళ్యాణ్ సంతకం చేశారు. పాలినా ఆంజనేయులు మైనర్ కావడంతో ఆమె తరపున డిప్యూటీ సీఎం కూడా పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. “ఇది కేవలం లడ్డూ కల్తీ గురించి కాదు. ప్రాయశ్చిత్త దీక్ష అనేది సనాతన ధర్మ రక్షణను ముందుకు తీసుకువెళ్లడానికి చాలా అవసరం అన్నారు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉండగా తిరుపతిలో తలెత్తిన సమస్యలకు శాశ్వత పరిష్కార యంత్రాంగాన్ని కోరుతూ, దానికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను బుధవారం ఆవిష్కరించబోతున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. గురువారం సాయంత్రం తిరుమల నుంచి విజయవాడకు తిరిగి రానున్నారు.

గురువారం జరిగే వారాహి సభలో పవన్ వారాహి డిక్లరేషన్ పుస్తకం(Varahi Declaration Book) లోని అంశాలను ప్రజలకు తెలియజేయనున్నట్లు సమాచారం. పవన్ చేతిలో ఉన్న రెడ్‌ కలర్‌లో ఉన్న ఆ బుక్‌ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ బుక్ కవర్ పేజీపైన !! ధర్మో రక్షతి రక్షితః !!’ అని రాసి ఉంది. దాని కింద వారాహి అమ్మవారి చిత్రం కూడా ఉంది . అమ్మవారి చిత్రం కింద వారాహి డిక్లరేషన్‌ అని రాసి ఉంది. తిరుపతి 03-10-2024 అని కూడా ఉండటం విశేషం. అయితే ఆ బుక్ లో ఏముందని చర్చించుకుంటున్నారు. రేపు గురువారం తిరుపతిలోని ఎస్వీయూ క్యాంప్‌ స్కూల్‌లో వారాహి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇక్కడే ఆ పుస్తకంలోని అంశాలను పవన్ స్వయంగా వెల్లడిస్తారు.

Also Read: Virat Kohli: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ విడుద‌ల‌.. టాప్‌-10లో విరాట్ కోహ్లీ!