Delhi : ఢిల్లీకి బయలుదేరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Delhi : కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా భేటీ తరువాత పవన్ కల్యాణ్ ఢిల్లీలోని ఏపీ భవన్ కు చేరుకుంటారు. కొద్దిసేపు అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం ఢిల్లీలో విమానాశ్రయానికి చేరుకొని విమానం ద్వారా రాత్రి 10.40గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు పవన్ చేరుకోనున్నారు.

Published By: HashtagU Telugu Desk
Deputy CM Pawan Kalyan left for Delhi

Deputy CM Pawan Kalyan left for Delhi

Deputy CM Pawan Kalyan : రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి బయలుదేరారు. ఢిల్లీలో ఆయన ఈరోజు సాయంత్రం కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను కలువనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులను పవన్.. అమిత్ షాకు వివరించనున్నారు. ఏపీకి రావాల్సిన కేంద్ర నిధులపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. హోంమంత్రి అనితపై పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ ఢిల్లీ టూర్ ఆసక్తికరంగా మారింది.

కాగా, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా భేటీ తరువాత పవన్ కల్యాణ్ ఢిల్లీలోని ఏపీ భవన్ కు చేరుకుంటారు. కొద్దిసేపు అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం ఢిల్లీలో విమానాశ్రయానికి చేరుకొని విమానం ద్వారా రాత్రి 10.40గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు పవన్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయానికి పవన్ కల్యాణ్ చేరుకుంటారు.

ఇకపోతే..తాజాగా పవన్ కల్యాణ్ రాష్ట్రంలో పోలీసు అధికారుల పనితీరుపై కాస్త అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు మంగళవారం మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కుటుంబానికి చెందిన సరస్వతి పవర్ ప్రాజెక్టు భూములను పరిశీలించారు. అయితే, అమిత్ షాతో భేటీలో పవన్ ఈ రెండు అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Read Also : Ajit Pawar : మహారాష్ట్ర ఎన్నికలు.. ఎన్సీపీ పార్టీ మేనిఫెస్టో విడుదల

 

 

  Last Updated: 06 Nov 2024, 03:51 PM IST