prayashchit deeksha: తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 22న ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నంబూరులోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ దీక్ష చేపట్టిన పవన్.. 11 రోజుల తర్వాత తిరుమలలో దీక్షను విరమించారు.
తిరుమల – మహద్వారం గుండా ఇద్దరు కూతుర్లతో వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. #TirumalaTirupatiDevasthanam #TTD #PawanKalyan #HashtagU pic.twitter.com/XYjqi4UYJS
— Hashtag U (@HashtaguIn) October 2, 2024
నిన్న సాయంత్రం రేణిగుంట ఎయిర్ పోర్ట్ నుంచి తిరుమలకు చేరుకున్న పవన్ కల్యాణ్.. కాలినడకన మెట్లమార్గంలో కొండపైకి వెళ్లారు. తన కుమార్తెలు ఆద్య, పొలెనా అంజన, డైరెక్టర్ త్రివిక్రమ్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు పవన్ కల్యాణ్. అనంతరం గొల్లమండపంలో పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేశారు. టీటీడీ అధికారులు పవన్ కు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం తరిగొండ వెంగమాంబ సత్రానికి వెళ్లిన ఆయన.. అక్కడ అన్నదాన ఏర్పాట్లను, ఆహార నాణ్యతను పరిశీలించారు. కాగా.. పవన్ ఎక్కడికి వెళ్లినా ఆయన వెంటే త్రివిక్రమ్ ఉంటారన్న విషయం తెలిసిందే. ఆయన తిరుమలకు వెళ్లింది మొదలు.. ఇప్పటి వరకూ ఎక్కడా త్రివిక్రమ్ కెమెరాకు కనిపించలేదు. కానీ.. పవన్ తో కలిసి స్వామివారిని దర్శనం చేసుకున్నారని తెలుస్తోంది.
Read Also: Ponguleti Srinivas Reddy : ఈడీ మౌనం వెనుక కారణం ఏంటి..? – కేటీఆర్
దీక్ష విరమణకు ముందు పవన్ కల్యాణ్ టీటీడీ సాంప్రదాయాల ప్రకారం తన కుమార్తె పలీనా అంజనీతో టీటీడీ అధికారులకుడిక్లరేషన్ ఇప్పించారు. అయితే పవన్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి స్వామి వారి దర‌్శనానికి వచ్చారు. ఆద్య, అంజనీలతో కలిసి స్వామి దర్శనానికి వెళ్లే ముందు టీటీడీ సాంప్రదాయాల ప్రకారం ఆయన కుమార్తె పలీనా అంజనీ క్రిస్టియన్ కావడంతో డిక్లరేషన్ ఇప్పించారు. అంజనీ మైనర్ కావడంతో ఆమె తరపున పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఫాంలో సంతకాలు చేశారు. అనంతరం స్వామి వారి దర్శనానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు.