ఏపీలో పోలీసులు (AP Police) వ్యవహరిస్తున్న తీరు పట్ల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు. మొన్నటి మొన్న పిఠాపురం పర్యటనలో రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు , నిర్లక్ష్యం పై ప్రజల ముందే ఆగ్రహం వ్యక్తం చేసారు.
రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు , నేరాల పట్ల పోలీస్ శాఖ కు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. శాంతిభద్రతలు అదుపులో లేకుంటే, అవసరమైతే హోంమంత్రి పదవి (Home మినిస్టర్ Post)ని కూడా తాను తీసుకోవడానికి వెనుకాడనని స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో ఉన్నట్టుగా ప్రస్తుతం అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆయన విమర్శించారు. అయితే, తాను హోంమంత్రి అయితే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుందని పవన్ పేర్కొన్నారు. అలాగే వైసీపీ నేతలతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పై కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇప్పటికే పలువుర్ని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయినప్పటికీ వారిలో మార్పు రావడం లేదు.
తాజాగా రోడ్డు ప్రమాదాల్లో పోలీసుల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాకినాడలో జరిగిన ప్రమాదంలోని మృతుల కుటుంబాలను శనివారం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ ప్రమాదంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధిత కుటుంబాలు పవన్ దగ్గర కన్నీళ్ళు పెట్టుకున్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలని పవన్ అన్నారు. పోలీసులు చేసే తప్పులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయన్నారు. పోలీసుల తరఫున బాధితులకు క్షమాపణలు చెప్పి, తన ట్రస్టు ద్వారా రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం అందించారు.
రోడ్డు ప్రమాదాల సమయంలో పోలీసులు బాధ్యతగా వ్యవహరించండి
•కాకినాడ జిల్లా రోడ్డు ప్రమాద ఘటనలో ఇద్దరు విద్యార్థులు చనిపోతే పోలీసుల తీరు బాధితులకు మనస్తాపం కలిగించింది
•ఇంతటి బాధలోనూ రేవంత్ తల్లిదండ్రులు అవయవదానం చేయడం కదిలించింది
ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు•మృతుల… pic.twitter.com/TVZrMPbT6F
— JanaSena Party (@JanaSenaParty) November 9, 2024
Read Also : Yuzvendra Chahal: ముంబై ఇండియన్స్‌లోకి చాహల్?