ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు (Atchannaidu), పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలపై స్పందించారు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల్లో పోలీసుల కట్టుదిట్టమైన భద్రత కారణంగా వైఎస్సార్సీపీ నాయకుల దొంగ ఓట్లు, జిమ్మిక్కులు పనిచేయలేదని ఆయన అన్నారు. ఈ ఫలితాలు ప్రజలు కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటించారని రుజువు చేస్తున్నాయని, ఇది ప్రజా విజయం అని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
జగన్‌కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదు
జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదని అచ్చెన్నాయుడు విమర్శించారు. గత ఐదేళ్ల పాలనలో వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని, ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. 2024 ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్సీపీని కేవలం 11 స్థానాలకే పరిమితం చేసినా, జగన్‌లో ఇంకా మార్పు రాలేదని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజల తీర్పు స్పష్టం
పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పును స్పష్టం చేస్తున్నాయని అచ్చెన్నాయుడు అన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయడానికి అవకాశం కల్పించినప్పుడే, నిజమైన ఫలితాలు వెలువడతాయని ఈ ఎన్నికలు నిరూపించాయని ఆయన పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ అరాచక పాలనను ప్రజలు తిరస్కరించారని, రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజాస్వామ్య పాలన కోరుకుంటున్నారని ఈ ఫలితాలు చాటిచెబుతున్నాయని ఆయన అన్నారు.
Kishtwar Cloudburst: జమ్మూ కశ్మీర్‌లో పెను విషాదం నింపిన క్లౌడ్ బరస్ట్.. 46 మంది మృతి!