స్వర్గీయ ఏఎన్నార్, ఎన్టీఆర్ ఇద్దరూ గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో జన్మించారు. ఆ నియోజకవర్గం మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉంది. అందుకే ఇప్పుడు కొత్తగా ఏర్పడే మచిలీపట్నం జిల్లాకు అక్కినేని నాగేశ్వరావు పేరు పెట్టాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఆ మేరకు ఏఎన్నార్ అభిమానులు ఏపీ ప్రభుత్వానికి రాత పూర్వక వినతిని అంద చేశారు. పైగా తొలి నుంచి అక్కినేని, వై ఎస్ కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉంది.
హీరో నాగార్జున, జగన్ నడుమ మంచి సంబంధాలు ఉన్నాయి. రాజకీయంగా కూడా అక్కినేని కుటుంబం వైసీపీ కి దగ్గరగా ఉంటుంది. ఒకానొక సమయంలో 2019 ఎన్నికలప్పుడు అమల విజయవాడ ఎంపీ అభ్యర్థి అనుకున్నారు. ఆ తరువాత అక్కినేని ఫ్యామిలీ రాజకీయాలకు దూరం అని చెప్పి ఆ ప్రచారానికి తెర వేశారు. సో..ఇప్పటికీ జగన్ , హీరో నాగార్జున మధ్య రిలేషన్స్ బాగా ఉన్నాయి. కాబట్టి మచిలీపట్నం జిల్లాకు ఏఎన్నార్ పేరు పెట్టించాలి అని నాగార్జున మీద అభిమానులు ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తుంది.
కొన్ని జిల్లాల ఏర్పాటుపై పలు డిమాండ్లు తెరమీదకు వస్తున్నాయి. జిల్లాల పునర్విభజనతో పాటు జిల్లాల పేర్ల విషయంలొనూ అభ్యంతరాలు వినిపిస్తున్నాయి. అనూహ్యంగా టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పేరు తెరమీదకు వచ్చింది.. మా జిల్లాకు ఏఎన్నార్ పేరు పెట్టమని ఏపీ సర్కారుకు అక్కినేని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.
జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పడనున్న కొత్త జిల్లా మచలీపట్నం. అయితే ఈ జిల్లాకు దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టాలని అక్కినేని అభిమానులు అభ్యర్ధన చేస్తున్నారు. ఏపీ సర్కార్ తమ కోరికను దృష్టిలో పెట్టుకోవాలని ఆలిండియా అక్కినేని అభిమాన సంఘం అధ్యక్షుడు సర్వేశ్వరరావు కోరుతున్నారు. గుడివాడ రామపురంలో జన్మించిన అక్కినేని నాగేశ్వరరావు విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు ప్రయాణం అతి సుదీర్ఘకాలం..
అయన సినీ రంగంలో చేసిన సేవకు దాదాఫాల్కే అవార్డు వంటి అనేక అవార్డులు అందుకున్నారు. విద్యా, సామాజిక సేవల్లోను ఎంతో తోడ్పాటు అందించారు అంటూ ఏఎన్నార్ ను గుర్తు చేశారు. అంతేకాదు ఏఎన్నార్ ఎక్కడో మద్రాస్ లో ఉన్న సినీ ప్రపంచాన్ని ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చారు..తెలుగు వారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చిన మహావ్యక్తి అని సర్వేశ్వరరావు చెప్పారు. ఏఎన్నార్ కళారంగానికి చేసిన సేవలకు గాను ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు చేయాలనీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒక వేళ జగన్ మనసులో ఏఎన్నార్ పేరు పెట్టాలి అని ఉన్నప్పటికి వంగవీటి రంగ పేరు తో జిల్లా పెట్టాలని డిమాండ్ ఉన్న క్రమంలో సాధ్యమా? అనేది వస్తుంది. గోదావరి జిల్లాలో ఏదో ఒక దానికి రంగా పేరు పెట్టి మచిలీపట్నం జిల్లాకు ఏఎన్నార్ పేరు పెడితే రాజకీయ మైలేజ్ వైసీపీకి పెరుగుతుందని కొందరు సామాజిక కోణంలో భావిస్తున్నారు. సో.జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో..చూడాలి.