Delhi Tour for favour : `కృష్ణా`లో జ‌గ‌న్ .! వాటా గోవిందా.?

Delhi Tour for favour : నీళ్లు, నిధులు, నియామ‌కాల డిమాండ్ తో ఏర్ప‌డిన తెలంగాణ ఆ దిశ‌గా అడుగులు వేస్తోంది. కృష్ణా జ‌లాల‌పై ప‌ట్టు సాధించింది.

  • Written By:
  • Updated On - October 4, 2023 / 05:14 PM IST

Delhi Tour for favour : నీళ్లు, నిధులు, నియామ‌కాల డిమాండ్ తో ఏర్ప‌డిన తెలంగాణ ఆ దిశ‌గా అడుగులు వేస్తోంది. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత వ‌రుసగా రెండుసార్లు సీఎం పీఠం ఎక్కిన కేసీఆర్ రాష్ట్రాన్ని సుభిక్షం చేసిన‌ట్టు చెబుతున్నారు. కానీ, 2014 నుంచి 2019 వ‌ర‌కు ఏపీతో పోటీప‌డ‌లేక తెలంగాణ సీఎం కేసీఆర్ త‌డ‌బ‌డ్డారు. కానీ, 2019 నుంచి 2023 వ‌ర‌కు రాష్ట్రాభివృద్ధిని ప‌రుగుపెట్టించారు. దానికి కార‌ణంగా ఆయ‌న ఏమి చెప్పిన‌ప్ప‌టికీ త‌లాడించే ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తెలంగాణ కోసం త్యాగం చేయ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని టీడీపీ ఆరోపించ‌డాన్ని కాద‌న‌లేం.

కేసీఆర్ డిమాండ్ కు అనుగుణంగా కేంద్ర క్యాబినెట్ నిర్ణ‌యం (Delhi Tour for favour)

ఏపీ సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత తొలి భేటీలోనే కేసీఆర్ కు హైద‌రాబాద్ లోని ఏపీ స‌చివాల‌యాన్ని అప్ప‌గించారు. ఆ త‌రువాత కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ గోదావరి జ‌లాల్ని తోడేసుకునేందుకు ప‌రోక్షంగా అంగీకారం తెలిపారు. అందుకు నిద‌ర్శ‌నంగా ఆయ‌న ప్రారంభోత్స‌వంలో  (Delhi Tour for favour) పాల్గొన్నారు. విభ‌జ‌న చ‌ట్టంలోని 9, 10 షెడ్యూల్ ప్ర‌కారం తెలంగాణ‌లో సుమారు 6 లక్ష‌ల కోట్ల విలువైన ఏపీ ఆస్తులు ఉన్నాయి. వాటిని ఇప్ప‌టి వ‌ర‌కు తీసుకోలేని దుస్థితిలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్నారు. అంతేకాదు, విద్యుత్ బ‌కాయిలు రూ. 6వేల కోట్ల‌ను తెలంగాణ నుంచి రాబ‌ట్ట‌లేక కేసీఆర్ కు మోకారిల్లుతున్నార‌ని టీడీపీ చెబుతోంది. ఇప్పుడు మిష‌న్ తెలంగాణ పేరుతో కృష్ణా జ‌లాల పంపిణీ మీద ట్రైబ్యున‌ల్ కు అధికారాల‌ను ఇస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణ‌యం తీసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్ప‌టి నుంచో చేస్తోన్న డిమాండ్ కు అనుగుణంగా కేంద్ర క్యాబినెట్ నిర్ణ‌యం ఉంద‌న‌డంలో సందేహం లేదు.

కృష్ణా జలాల వాటా ఏపీకి 66శాతం, తెలంగాణ‌కు 34 శాతం

విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం కృష్ణా జలాల వాటా ఏపీకి 66శాతం, తెలంగాణ‌కు 34 శాతం మాత్ర‌మే ఉండాలి. కానీ, కేసీఆర్ స‌గం వాటా కావాల‌ని డిమాండ్ చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఎంతో కొంత వాటా పెంచ‌డానికి అవ‌కాశం ఉండేలా ట్రైబ్యున‌ల్ అధికారం ఇస్తూ మోడీ స‌ర్కార్ తీర్మానం చేసింది. వాస్త‌వంగా కేసీఆర్ చేస్తోన్న 50శాతం వాటా మీద జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి జాతీయ వేదిక‌ల‌పై వాద‌న వినిపించాలి. ఉన్న‌త న్యాయ‌స్థానాల్లో పోరాడాలి. కానీ, తెలంగాణ సీఎం చేసిన న్యాయ‌, రాజ‌కీయ పోరాటానికి ధీటుగా నిల‌వ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ధైర్యం (Delhi Tour for favour) చేయ‌లేక‌పోయారు. దాని ఫ‌లితంగా కృష్ణా వాటా పెంచుకోవ‌డానికి అనువుగా కేసీఆర్ డిమాండ్ చేసిన‌ట్టు ట్రైబ్యున‌ల్ కు ప‌వ‌ర్ ఇస్తూ మోడీ స‌ర్కార్ తీర్మానం చేయ‌డం రాయ‌ల‌సీమ‌ను శాశ్వ‌తంగా ఎడారిగా మార్చే ప్ర‌మాదం లేక‌పోలేదు.

Also Read : CM Jagan: ప్రాజెక్టుల ఏర్పాటుతో 6, 705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి: సీఎం జగన్

కృష్ణా పైభాగాన పాల‌మూరు-రంగారెడ్డితో పాటు ప‌లు ప్రాజెక్టుల‌ను కేసీఆర్ వేగంగా నిర్మిస్తున్నారు. అడ్డుకోవాల్సిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క‌నీస ప్ర‌య‌త్నం చేయ‌కుండా ప‌రోక్షంగా స‌హ‌కారం అందిస్తున్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఆయ‌న మీద ఉన్న కేసులు, హైద‌రాబాద్ లోని ఆయ‌న ఆస్తుల‌ను కాపాడుకోవ‌డం కోసం ఏపీ నీళ్ల వాటాను కూడా తాక‌ట్టు పెట్టార‌ని విప‌క్షాల తొలి నుంచి చేస్తోన్న ఆరోప‌ణ‌. రాష్ట్ర విడిపోయిన త‌రువాత 2014-2019 మ‌ధ్య చంద్ర‌బాబు సీఎంగా ఉండ‌గా న్యాయ‌స్థానాల్లో ధీటుగా కేసులు వేసి ఏపీ కోసం పోరాటం చేసిన దాఖ‌లాలు అనేకం. ఆ త‌రువాత 2019-2023 మ‌ధ్య కాలంలో కృష్ణా పైభాగాన నాలుగు ప్రాజెక్టుల‌ను కేసీఆర్ నిర్మిస్తున్న‌ప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏ మాత్రం ఫైట్ చేయ‌లేద‌ని నీటిరంగ నిపుణులు(Delhi Tour for favour) సైతం విమ‌ర్శిస్తున్నారు.

Also Read : Krishna Water Share : కేసీఆర్, జ‌గ‌న్ `మిలాక‌త్` కు కృష్ణా వాటాతో కేంద్రం చెక్

ఢిల్లీ వెళుతోన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా ను క‌ల‌వబోతున్నారు. ఆ మేర‌కు అపాయిట్మెంట్ లు దొరికిన‌ట్టు సీఎంవో చెబుతోంది. ఆయ‌న ఢిల్లీ ప‌ర్య‌ట‌న స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం కాకుండా క‌నీసం ఈసారైనా కృష్ణా నీటి వాటా మీద ఫైట్ ప్ర‌ధాని మోడీతో ఫైట్ చేయాల‌ని విప‌క్షాలు కోరుతున్నారు. కానీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఉన్న పరిస్థితుల్లో కేవ‌లం అభ్య‌ర్థించ‌డం మిన‌హా డిమాండ్ చేసే సీన్ లేదు. పైగా క్విడ్ ప్రో కో పాల‌సీతో తెలుగు రాష్ట్రాల సీఎంలు ఉన్నారు. సామాజికంగా , రాజ‌కీయంగా, ఆర్థికంగా మాత్ర‌మే కాదు, అన్ని ర‌కాలుగా కేసీఆర్, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఏకాభిప్రాయంతో ఉన్నారు. ఆ క్ర‌మంలో ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను కేసీఆర్ వ‌ద్ద జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి తాక‌ట్టు పెడుతున్నార‌ని విప‌క్షాల అభిప్రాయం. అంతేకాదు, జాతీయ స్థాయిలో అందాల్సిన బెనిఫిట్స్ ను కూడా ఢిల్లీ నేత‌ల వ‌ద్ద వ‌దిలేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు కోకొల్ల‌లు.