Delhi to AP : స‌త్య‌మేవ జ‌య‌తే..! లూథ్రా ట్వీట్  ట్విస్ట్! 

Delhi to AP :  `స‌త్య‌మేవ‌ జ‌య‌తే..` అనేది మ‌హాత్మాగాంధీ కొటేష‌న్‌.అందుకే, అహింసా మార్గం ద్వారా స్వాతంత్ర్యాన్ని సాధించ‌గ‌లిగారు.

  • Written By:
  • Publish Date - October 2, 2023 / 12:59 PM IST

Delhi to AP :  `స‌త్య‌మేవ‌ జ‌య‌తే..` అనేది మ‌హాత్మాగాంధీ కొటేష‌న్‌. దాన్నే ఆయ‌న న‌మ్ముతారు. అందుకే, అహింసా మార్గం ద్వారా స్వాతంత్ర్యాన్ని సాధించ‌గ‌లిగారు. ఆయ‌న స్పూర్తితో స‌త్యాగ్ర‌హ దీక్ష‌ను తెలుగుదేశం పార్టీ ప్ర‌పంచ వ్యాప్తంగా చేప‌ట్టింది. నిరాధార ఆరోప‌ణ‌ల‌తో చంద్ర‌బాబును జైలుకు పంపించ‌డాన్ని నిర‌సిస్తూ ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌ర‌కు స‌త్యాగ్ర‌హ‌దీక్ష‌ల‌ను చేప‌ట్టింది.

జైలులో చంద్ర‌బాబునాయుడు దీక్ష‌ (Delhi to AP)

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ ఢిల్లీ వేదిక‌గా స‌త్యాగ్ర‌హ‌దీక్ష‌కు దిగారు. ఆయ‌న‌కు మ‌ద్ధ‌తుగా ఆ పార్టీ ఎంపీలు దీక్ష‌లో కూర్చుకున్నారు. న్యాయం గెల‌వాల‌ని డిమాండ్ చేస్తున్నారు. న్యాయ‌స్థానాల్లో స‌త్యం గెలుస్తుంద‌ని న‌మ్ముతున్నారు. ఇక జైలులో చంద్ర‌బాబునాయుడు దీక్ష‌కు దిగారు. ఆయ‌న ఉన్న రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులోని స్నేహ బ్లాక్ లోనే స‌త్యాగ్ర‌హ దీక్ష‌కు పూనుకున్నారు. ఆయ‌న కోసం రాజ‌మండ్రిలోనే ఉంటోన్న భ‌వ‌నేశ్వ‌రి స‌త్యాగ్ర‌హ దీక్ష‌కు  దిగారు. ఆమెకు మ‌ద్ధ‌తుగా వేలాది మంది మ‌హిళ‌లు దీక్షా శిబిరం వ‌ద్ద‌కు వచ్చారు. ఆమెకు సంఘీభావం తెలిపారు. రాజ‌మండ్రిలో భువ‌నేశ్వ‌రి చేస్తోన్న స‌త్యాగ్ర‌హం దీక్ష‌కు భారీ సంఖ్య‌లో మ‌హిళ‌లు హాజరు కావ‌డం గ‌మ‌నార్హం.(Delhi to AP)

ఢిల్లీ నుంచి ఏపీలోని గ‌ల్లీ వ‌ర‌కు స‌త్యాగ్ర‌హ‌దీక్ష‌

కేవ‌లం ఢిల్లీ నుంచి ఏపీలోని గ‌ల్లీ వ‌ర‌కు మాత్ర‌మే కాదు, ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు స‌త్యాగ్ర‌హ‌దీక్ష‌కు (Delhi to AP) సంఘీభావం ప్ర‌క‌టించారు. కొన్ని చోట్ల స‌త్యాగ్ర‌హందీక్షల‌ను చేప‌ట్టారు. చంద్ర‌బాబు జైలులో చేస్తోన్న దీక్ష‌కు స‌మాంత‌రంగా దీక్ష‌లు చేప‌ట్టేందుకు క్యాడ‌ర్ పెద్ద సంఖ్య‌లో ముందుకురావ‌డం టీడీపీకి ఉన్న బ‌లాన్ని సూచిస్తోంది. న్యాయం గెల‌వాల‌ని కోరుకుంటున్నారు. న్యాయానికి సంకెళ్లు అంటూ ప్ల కార్డుల‌ను ప్ర‌ద‌ర్శిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. అందుకోసం గాంధీయ‌మార్గంలో స‌త్యాగ్ర‌హ‌దీక్ష ద్వారా న్యాయ‌స్థానాల‌ను టీడీపీ ప్ర‌శ్నిస్తోంది.

అక్టోబ‌ర్ 3వ తేదీన క్వాష్ పిటిష‌న్ సుప్రీం కోర్టులో 

వాస్తవంగా అక్టోబ‌ర్ 3వ తేదీన చంద్ర‌బాబు వేసి క్వాష్ పిటిష‌న్ సుప్రీం కోర్టులో విచార‌ణ‌కు రానుంది. హైకోర్టు తిర‌స్క‌రించిన క్వాష్ ను స‌వాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు ప‌రిచారు. దానిపై విచార‌ణ జ‌ర‌గాల్సి ఉంది. గ‌త వారం సంజ‌య్, భ‌ట్ బెంచ్ ఆ పిటిష‌న్ ను నాట్ బిఫోర్ కింద ప‌క్క‌కు నెట్టారు. దీంతో చీఫ్ జ‌స్టిస్ చంద్ర‌చూడ్ అక్టోబ‌ర్ 3వ తేదీన విచార‌ణ‌కు అంగీక‌రించార‌ని చంద్ర‌బాబు న్యాయ‌వాదులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం జ‌డ్జి అనిరుద్ బెంచ్ లో విచార‌ణకు పిటిష‌న్ వ‌చ్చింది. మ‌రో 24 గంటల్లో సుప్రీం తీర్పు చెబుతుంద‌ని (Delhi to AP)ఆస‌క్తిగా చూస్తున్నారు.

Also Read : Nara Bhuvaneswari : “స‌త్య‌మేవ‌ జ‌య‌తే”.. రాజ‌మండ్రిలో దీక్ష చేప‌ట్టిన నారా భువ‌నేశ్వ‌రి

ప్ర‌ముఖ అడ్వ‌కేట్‌, చంద్ర‌బాబు త‌ర‌పున వాదిస్తోన్న లూథ్రా ట్వీట్ టీడీపీ శ్రేణుల‌ను నిరాశ‌ప‌రుస్తోంది. ఆయ‌న తొలుత ఏసీబీ కోర్టులో తీర్పు వ‌చ్చిన త‌రువాత `న్యాయం కంటిచూపు మేర‌లో లేన‌ప్పుడు క‌త్తిప‌ట్టుకోవ‌డ‌మే మార్గం..` అంటూ ట్వీట్ చేసి సంచ‌ల‌నం క‌లిగించారు. ఆ త‌రువాత ఏసీబీ కోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ హైకోర్టులో పిటిష‌న్ వేసి వాదించారు. అక్క‌డ కూడా క్వాష్ పిటిష‌న్ ను తిర‌స్క‌రిస్తూ తీర్పు వెలువ‌డింది. దీంతో ఆయ‌న సుప్రీం కోర్టులో పిటిష‌న్ వేయ‌డానికి ముందుగా `రాత్రి త‌రువాత ప‌గ‌లు రావ‌డం, చీక‌టి త‌రువాత వెలుగు విస్త‌రించ‌డం స‌ర్వ‌సాధార‌ణం..` అంటూ ట్వీట్ చేశారు. దీంతో సుప్రీం కోర్టులో న్యాయం జ‌రుగుతుంద‌ని టీడీపీ క్యాడ‌ర్ ఆశ‌గా ఎదురుచూసింది.

Also Read : CBN Jail Effect In Telangana : చంద్ర‌బాబు జైలుపై ఒకే పంథాలో రేవంత్ , కేటీఆర్

కానీ, నాట్ బిఫోర్ కింద పిటిష‌న్ మ‌రో బెంచ్ కు వెళ్లింది. అక్టోబ‌ర్ 3న విచార‌ణ‌కు వ‌స్తున్న క్ర‌మంలో `సుప్రీం కోర్టు ఆదేశం ప్ర‌కారం తీర్పును వెంట‌నే ఇవ్వాలి. కానీ, ఒక హైకోర్టు జ‌డ్జి విచార‌ణ‌లు ముగిసిన తరువాత రెండేళ్ల పాటు తీర్పును వాయిదా వేసిన విష‌యాన్ని ట్వీట్ రూపంలో ఉంచారు. అంటే, సుప్రీం కోర్టులోనూ వాయిదాల ప‌ర్వం కొన‌సాగుతుందా? అనేది ఇప్పుడు టీడీపీని వేధిస్తోన్న ప్ర‌శ్న‌. క‌నీసం ఏడాది పాటు చంద్ర‌బాబును జైలులో పెట్ట‌డానికి టార్గెట్ చేశార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఆ మేర‌కు ఉప్పుందుకున్న త‌రువాత లూథ్రా తాజా ట్వీట్ చేశారా? అనేది టీడీపీలోని అనుమానం. మ‌రో 24 గంట‌ల్లో సుప్రీం ఏమి చెబుతుందో చూద్దాం.!