Delhi Secret : చంద్ర‌బాబుకు NDA ఆహ్వానం లేక‌పోవ‌డం వెనుక కార‌ణ‌మిదే.!

ఎన్డీయే స‌మావేశానికి పాతమిత్రుల‌ను ఆహ్వానించిన బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు (Delhi Secret)చంద్ర‌బాబును ఎందుకు ఆహ్వానించ‌లేదు?

  • Written By:
  • Updated On - July 19, 2023 / 03:49 PM IST

ఎన్డీయే స‌మావేశానికి పాతమిత్రుల‌ను ఆహ్వానించిన బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు (Delhi Secret)చంద్ర‌బాబును ఎందుకు ఆహ్వానించ‌లేదు? ఆయ‌న దూరంగా ఉన్నారా? అంటే కాదు. స‌మీప భ‌విష్య‌త్ లో ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో ఉన్న అవ‌స‌రం కార‌ణంగా తాత్కాలికంగా చంద్ర‌బాబును బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు దూరంగా పెట్టార‌ని తెలుస్తోంది. పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల్లో ప్ర‌వేశ పెట్టే ఉమ్మ‌డి పౌర‌స్మృతి బిల్లుకు మ‌ద్ధ‌తు వైసీపీ నుంచి కావాలి. ఎన్డీయే స‌మావేశానికి చంద్ర‌బాబును ఆహ్వానిస్తే, రాజ్య‌స‌భ వేదిక‌గా వైసీపీ ఎంపీల‌తో బిల్లుకు అనుకూలంగా ఓటేయాల‌ని ఒత్తిడి తేవ‌డానికి అవ‌కాశం ఉండ‌దు. అందుకే, ప్ర‌స్తుతానికి చంద్ర‌బాబును ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు వ్యూహాత్మ‌కంగా ఆహ్వానించ‌లేద‌ని తెలుస్తోంది.

బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు (Delhi Secret)చంద్ర‌బాబు ఎందుకు ఆహ్వానించ‌లేదు?

రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో టీడీపీ మ‌ద్ధ‌తును బీజేపీ తీసుకుంది. ఇటీవ‌ల జ‌రిగిన ఆజాదీకా అమృత్ మ‌హోత్స‌వంకు చంద్ర‌బాబును ఆహ్వానించారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ, చంద్ర‌బాబు చేయి క‌లిపారు. ఢిల్లీకి త‌ర‌చూ రావాల‌ని చంద్ర‌బాబుకు ప్ర‌ధాని మోడీ సూచించిన విష‌యం విదిత‌మే. ఆ త‌రువాత జీ 20దేశాల స‌ద‌స్సుకు ఎజెండాను ఫిక్స్ చేసే క్ర‌మంలో దేశంలోని ప్ర‌ధాన పార్టీల అధిప‌తుల‌ను అభిప్రాయాల‌ను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ తీసుకున్నారు. ఆ సంద‌ర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్ర‌ధాని స‌మావేశానికి (Delhi Secret)  చంద్ర‌బాబు హాజ‌ర‌య్యారు. విలువైన సూచ‌న‌ల‌ను చేయ‌గా, వాటిని జీ 20 స‌ద‌స్సు ఎజెండాలో పెట్టారు.

జ‌న‌సేన‌-బీజేపీకి డిపాజిట్లు కూడా రావని గ‌త ఎన్నిక‌ల చ‌రిత్ర

తెలంగాణ‌లో కింగ్‌, ఏపీలో కింగ్ మేక‌ర్ కావాల‌ని బీజేపీ ల‌క్ష్యం. ఈసారి ఎన్నిక‌ల్లో దాన్ని చేరాల‌ని భావిస్తున్నారు. కానీ, ఆ దిశ‌గా బీజేపీ విజ‌యం సాధించ‌లేద‌ని తెలంగాణ స‌ర్వేల్లో తేలుతోంది. ఇటీవ‌ల బాగా తెలంగాణ స‌మాజానికి దూర‌మైన బీజేపీ గ్రాఫ్ దారుణంగా ప‌డిపోయింది. ఎమ్మెల్సీ క‌విత‌ను ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ లో అరెస్ట్ చేయ‌క‌పోవ‌డం, బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ ను మార్చ‌డం పార్టీకి పెద్ద న‌ష్టంగా భావిస్తున్నారు. దాన్ని భ‌ర్తీ చేసుకోవ‌డానికి తెలంగాణ వ్యాప్తంగా టీడీపీ అవ‌స‌రం బీజేపీకి (Delhi Secret) బాగా ఉంది. అందుకోసం పొత్తు అనివార్య‌మ‌ని బీజేపీకి తెలుసు. ఇక ఏపీలో కింగ్ మేక‌ర్ కావాలంటే టీడీపీ అవ‌స‌రం. లేదంటే, జ‌న‌సేన‌-బీజేపీకి డిపాజిట్లు కూడా రావని గ‌త ఎన్నిక‌ల చ‌రిత్ర చెబుతోంది.

ఎన్డీయే బ‌లంగా ఉంద‌ని చెప్ప‌డానికి 38 పార్టీల‌తో మీటింగ్

ఎన్నిక‌ల నాటికి టీడీపీతో పొత్తుకు బీజేపీ అనివార్యంగా రానుంది. అంతేకాదు, కొంద‌రు వ‌ద్ద‌నుకుంటున్న‌ప్ప‌టికీ బ‌ల‌మైన బీజేపీ లీడ‌ర్లు మాత్రం టీడీపీ మ‌ద్ధ‌తు ఉండాల‌ని కోరుకుంటున్నారు. పైగా ఇండియాగా రూపాంత‌రం చెందిన UPA టీమ్ బ‌ల‌ప‌డుతోంది. అదే స‌మ‌యంలో ఎన్డీయేను బ‌లోపేతం చేసుకోవ‌డానికి మోడీ ముంద‌డుగు వేశారు. ఎన్డీయే బ‌లంగా ఉంద‌ని చెప్ప‌డానికి 38 పార్టీల‌తో మీటింగ్ పెట్టారు. కానీ, వాటిలో రిజిస్ట‌ర్ పార్టీలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు ఖ‌ర్గే విమ‌ర్శిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి రిజిస్ట్ర‌ర్ పార్టీగా ఉన్న జ‌న‌సేన మిన‌హా ఏ ఒక్క బ‌ల‌మైన పార్టీ ఎన్డీయే మీటింగ్ లో  (Delhi Secret)క‌నిపించ‌లేదు.

Also Read : Pawan & Modi : మోడీ పక్కన పవన్.. జనసేన కు రానున్నవన్నీ మంచి రోజులైనా..?

యూపీఏ స‌మావేశానికి 26 పార్టీలు హాజ‌రు అయ్యాయి. వాటిలో చాలా వ‌ర‌కు బ‌ల‌మైన పార్టీలు. అంతేకాదు, దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు హాజ‌రు కావ‌డాన్ని గ‌మ‌నించాలి. అంటే, ఎన్డీయే, ఇండియా(యూపీఏ) స‌మావేశాల‌ను గ‌మ‌నిస్తే వ్య‌త్యాసం క‌నిపిస్తోంది. గుర్తింపులేని పార్టీలు ఎన్డీయే స‌మావేశానికి అనేకం. వ‌చ్చాయి. అదే ఇండియా స‌మావేశానికి గుర్తింపు ఉన్న పార్టీలు ఎక్కువ‌. ఇలాంటి పరిణామాన్ని తీసుకుంటే చంద్ర‌బాబునాయుడును ఎన్డీయే వ‌దులుకునే సాహ‌సం చేయ‌దు. ఎలాగూ వైసీపీ భ‌విష్య‌త్ లోనూ ఎన్డీయేలో చేర‌డానికి ముందుకు రాదు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీయేలోకి రావ‌డానికి రెడీగా ఉన్న ఏకైక పార్టీ టీడీపీ. అయితే, ఉమ్మ‌డి పౌర‌స్మృతి బిల్లు ఆమోదం కోసం మాత్ర‌మే బీజేపీ పెద్ద‌లు టీడీపీని దూరంగా పెట్టాయ‌ని తెలుస్తోంది. అంటే, అస‌లు గేమ్ ముందుంద‌న్న‌మాట‌.

Also Read : Janasena Strategy : BJP గేమ్ లో ఆట‌గాడు