Pawan Kalyan: ప‌వ‌న్ పై ఢిల్లీ పోస్ట్ మార్టం!

`పార్టీని విలీనం చేయ‌మ‌ని ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు ఒత్తిడి తెస్తున్నారు. 30ఏళ్ల పార్టీని న‌డ‌పాల‌ని నిర్ణ‌యించుకున్నాను. అధికారంలేక‌పోయిన‌ప్ప‌టికీ

  • Written By:
  • Updated On - October 19, 2022 / 12:45 PM IST

`పార్టీని విలీనం చేయ‌మ‌ని ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు ఒత్తిడి తెస్తున్నారు. 30ఏళ్ల పార్టీని న‌డ‌పాల‌ని నిర్ణ‌యించుకున్నాను. అధికారంలేక‌పోయిన‌ప్ప‌టికీ ప్ర‌శ్నించ‌డానికి ఉంటాను. కులం, ప్రాంతం, మ‌తం ప్ర‌స్తావ‌న లేకుండా రాజ‌కీయాలు చేద్దాం. మార్పు కోసం ఎంత వ‌ర‌కైనా వెళ‌దాం.` ఇవీ జ‌న‌సేనాని ప‌వ‌న్ బీజేపీతో పొత్తు పెట్టుకున్న త‌రువాత ఆనాడు కార్య‌క‌ర్త‌ల మీటింగ్ లో చెప్పిన మాట‌లు. అప్ప‌టి నుంచి అమిత్ షా, మోడీ అపాయిట్మెంట్ ఆయ‌న‌కు ల‌భించ‌లేదు. కేవ‌లం బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా మాత్ర‌మే ప‌వ‌న్ కు క‌లిసేందుకు అవ‌కాశం ఇస్తున్నారు. విలీనం ఓకే అంటే అమిత్ షా అపాయిట్మెంట్ ఉండేదని ఢిల్లీ వ‌ర్గాల్లోని టాక్‌.

2019 ఎన్నిక‌లు ముగిసిన త‌రువాత లెప్ట్ భావ‌జాలం నుంచి రైట్ భాజాలానికి ప‌వ‌న్ వెళ్లారు. క‌మ్యూనిస్ట్ లు, బీఎస్పీని వ‌దిలేసి బీజేపీ పంచ‌న చేరారు. ఎన్డీయే-2 రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఆయ‌న త‌న పంథా మార్చేసుకున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన‌, బీజేపీ ఎక్క‌డా పెద్ద‌గా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడి దాఖ‌లాలు లేవు. తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీని బీజేపీ ఎప్పుడో దూరంగా పెట్టింది. తిరుప‌తి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన క‌లిసి అభ్య‌ర్థిని నిలిపిన‌ప్ప‌టికీ డిపాజిట్లు రాలేదు. బ‌ద్వేల్‌, ఆత్మ‌కూరు ఎన్నిక‌ల్లో బీజేపీ, జ‌న‌సేన వేర్వేరుగా వ్య‌వ‌హ‌రించాయి. పైకి ఆ రెండు పార్టీలు పొత్తు అంటున్న‌ప్ప‌టికీ ఎక్క‌డా క్షేత్ర‌స్థాయిలో కల‌వ‌డంలేదు. అదే విష‌యాన్ని మంగ‌ళ‌గిరి కేంద్రంగా జ‌రిగిన స‌మావేశంలో చెబుతూ బీజేపీ రోడ్ మ్యాప్ గురించి ప్ర‌స్తావించారు. స‌కాలం రోడ్ మ్యాప్ రానందున టైమ్ మించిపోతుంద‌ని ప‌రోక్షంగా బ్రేక‌ప్ సంకేతాలు ఇచ్చారు.

ఏపీలోని తాజా ప‌రిణామాల‌పై చ‌ర్చించ‌డానికి బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు ఢిల్లీ వెళ్లారు. అక్క‌డి పెద్ద‌ల‌తో చ‌ర్చించిన త‌రువాత బీజేపీ వైఖ‌రి ఏమిటో బ‌య‌ట‌కు రానుంది. ప్ర‌స్తుతం బీజేపీ ప‌రోక్షంగా వైసీపీకి మ‌ద్ధ‌తుగా ఉంది. ఆ రెండు పార్టీలు ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటూ వెళుతున్నాయి. అదే స్నేహాన్ని కంటిన్యూ చేయాల‌ని బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు భావిస్తున్నారు. అదే టైమ్ లో టీడీపీకి దూరంగా ఉండాల‌న్న లాజిక్ ను బీజేపీ తీస్తుంద‌ని తెలుస్తోంది. ఆ క్ర‌మంలో ప‌వ‌న్ వాల‌కంపై బీజేపీ ఆరా తీస్తోంది. ఆయ‌న చేసిన బూతు ప్ర‌సంగంలోని ఆంత‌ర్యాన్ని బీజేపీ అంచ‌నా వేస్తోంది. మొత్తం మీద ఢిల్లీ వ‌ర‌కు చేరిన ప‌వ‌న్ ప్ర‌సంగం తాజాగా మాన‌వ‌హ‌క్కుల సంఘానికి కూడా వెళుతోంది.

వైజాగ్ గ‌ర్జ‌న సంద‌ర్భంగా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరుపై మాన‌వ‌హ‌క్కుల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేయ‌నుంది. అంతేకాదు, ఎమ్మెల్యేల‌ను బూతులు తిట్టిన విధానాన్ని కూడా హ‌క్కుల సంఘానికి పంప‌డానికి సిద్దం అయింది. మూడు రాజ‌ధానుల జేఏసీ లీడ‌ర్లు విశాఖ కేంద్రంగా ప‌వ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరుపై హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేయ‌డానికి సిద్ధం అయింది. ఉత్త‌రాంధ్ర మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా వ్య‌వ‌హరించార‌ని పొందుప‌రుస్తూ మాన‌వ హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేయ‌నున్నారు. మొత్తం మీద ప‌వ‌న్ మంగ‌ళ‌గిరి పార్టీ ఆఫీస్ లో క్యాడ‌ర్ ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగం స‌భ్య స‌మాజాన్ని త‌లదించుకునేలా చేసింది. దానిపై బీజేపీ పోస్ట్ మార్టం చేస్తుంటే, వైసీపీ హ‌క్కుల సంఘాల‌కు ఫిర్యాదు చేయ‌నుంది.