Delhi Pawan: ఢిల్లీలో కూట‌మి కుత‌కుత‌!ప‌వ‌న్ తో బీజేపీ సంధి!

జ‌న‌సేనాని ప‌వ‌న్ ఢిల్లీ టూర్(Delhi Pawan) ఏపీ రాజ‌కీయాల‌ను మ‌లుపు తిప్ప‌నుంది.

  • Written By:
  • Updated On - April 5, 2023 / 01:28 PM IST

జ‌న‌సేనాని ప‌వ‌న్ ఢిల్లీ టూర్ (Delhi Pawan) ఏపీ రాజ‌కీయాల‌ను మ‌లుపు తిప్ప‌నుంది. రాబోవు రోజుల్లో బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన పొత్తు(Alliance) ఖాయం అయ్యే ప‌రిస్థితులు లేక‌పోలేదు. ఆ దిశ‌గా ప‌వ‌న్ పావులు క‌దుపుతున్న‌ట్టు తెలుస్తోంది. రెండు రోజులుగా ఢిల్లీలో ఉన్న ఆయ‌న బీజేపీ అగ్ర‌నేత ముర‌ళీధ‌ర‌న్ తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర‌ప్ర‌దాన్ ను క‌లిశారు. పోల‌వ‌రం అంశం గురించి మాట్లాడిన‌ట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రి అమిత్ షా, జాతీయ బీజేపీ అధ్య‌క్షుడు న‌డ్డాతో క‌లిసిన త‌రువాత మీడియా ముందుకు ప‌వ‌న్ రానున్నారు.

జ‌న‌సేనాని ప‌వ‌న్ ఢిల్లీ టూర్ (Delhi Pawan)

ఇటీవ‌ల ఏపీ బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింది. జ‌న‌సేన క‌లిసి రానందున ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గ‌లేక‌పోయామ‌ని బీజేపీ నేత మాధ‌వ్ వ్యాఖ్యానించారు. మ‌చిలీప‌ట్నం ఆవిర్భావ వేదిక మీద బీజేపీ క‌లిసి వ‌చ్చి ఉంటే ఇత‌ర పార్టీల‌తో పొత్తు (Alliance)లేకుండా 175 స్థానాల్లో పోటీ చేసి ఉండే వాళ్ల‌మ‌ని ప‌వ‌న్ అన్నారు. దీంతో ఇరు పార్టీల మ‌ధ్య రాజ‌కీయంగా అంత‌రం ఏర్ప‌డింది. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం చూస్తున్నాన‌ని ఏడాది క్రిత‌మే ప‌వ‌న్ చెప్పారు. త‌న ముందున్న ఆప్ష‌న్ల ను కూడా బ‌య‌ట పెట్టారు.

ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా ప్ర‌య‌త్నాలు

మొద‌టి ఆప్ష‌న్ గా బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన కూట‌మిగా(Alliance) ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డాన్ని తీసుకున్నారు. బీజేపీ, జ‌న‌సేన క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళ్ల‌డం రెండో ఆప్ష‌న్ కింద తెలిపారు. ఇక మూడో ఆప్ష‌న్ గా ఒంట‌రి పోరుకు సిద్ధ‌మ‌వ్వాల‌ని భావించారు. కానీ, ఒంట‌రిగా వెళ్లి రాజ‌కీయ వీర మ‌ర‌ణం పొంద‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఇటీవ‌ల చెప్పారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌కుండా ఉండేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తాన‌ని ప‌వ‌న్ గ‌తంలోనే చెప్పారు. ఆ దిశ‌గా ప్ర‌స్తుతం ఢిల్లీ ప‌ర్య‌ట‌న ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

మా పవనే సీఎం..!

బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన కూట‌మి (Delhi Pawan)

ఉత్తరాది రాష్ట్రాల్లో మారుతోన్న రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా ద‌క్షిణాది రాష్ట్రాల మీద బీజేపీ క‌న్నేసింది. విప‌క్షాలు ఏకం అవుతోన్న వేళ ఎన్డీయే కూడా బ‌లం పుంజుకోవ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తోంది. జేడీఎస్ వెళ్లిపోయిన త‌రువాత ఎన్డీయే కూట‌మి కొంత బ‌ల‌హీన‌ప‌డిన‌ట్టు జాతీయ స్థాయి రాజ‌కీయాల్లో క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో యూపీఏ  పుంజుకుంటోంది. ఇటీవ‌ల బీఆర్ఎస్, టీఎంసీ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీతో క‌లిసి నిర‌స‌న‌ల్లో పాల్గొన్నాయి. ఇలాంటి పరిణామాల న‌డుమ క‌లిసొచ్చే పార్టీల‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకునే ప్ర‌య‌త్నం బీజేపీ చేస్తోంది. ఆ క్ర‌మంలో ఏపీ, తెలంగాణల్లో టీడీపీ పొత్తు అవ‌స‌రంగా భావిస్తోంది. బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన కూట‌మి(Delhi Pawan) ఇరు రాష్ట్రాల్లోనూ పోటీ చేసేలా ప్లాన్ చేస్తున్నాయ‌ని తెలుస్తోంది.

ప‌వ‌న్ ను ప్ర‌చారంలోకి దింపాల‌ని..

ప‌వ‌ర్ స్టార్ గా పాపుల‌ర్ అయిన హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఆయ‌న‌కు ద‌క్షిణాది రాష్ట్రాల్లో బాగా గుర్తింపు ఉంది. ప్ర‌త్యేకించి త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో క్రౌడ్ పుల్ల‌ర్ గా ప‌వ‌న్ ఉంటారు. అందుకే, ఆయ‌న్ను క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌తో పాటు తెలంగాణాలోనూ వాడుకోవాల‌ని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఎలాగూ, ఏపీ మీద జ‌న‌సేన‌కు ప‌ట్టు కొంత మేర‌కు ఉంది. ఇలాంటి ఈక్వేష‌న్ల‌ను ప‌రిశీలించిన బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు కూట‌మి(Delhi Pawan) గురించి ఒక క్లారిటీ ఇవ్వ‌డం ద్వారా ప‌వ‌న్ ను ప్ర‌చారంలోకి దింపాల‌ని భావిస్తోంద‌ట‌. అందుకే, ఆయ‌న్ను ఢిల్లీకి ఆహ్వానించిన‌ట్టు తెలుస్తోంది.

Also Read : Pawan Kalyan: దసరాకు పవన్ మూవీ కష్టమే.. క్లైమాక్స్ దశలోనే ‘హరిహర వీరమల్లు’

తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ అనుకున్నంత‌గా బ‌ల‌ప‌డ‌లేదు. ఇత‌ర పార్టీల నుంచి చేరిక‌లు కూడా పెద్ద‌గా లేవు. ద‌క్షిణ తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల లీడ‌ర్లు లేరు. క్యాడ‌ర్ అంత‌కంటే లేదు. కానీ, టీడీపీకి బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది. అందుకే, టీడీపీ పొత్తును బీజేపీ కోరుకుంటోంది. అయితే, ఏపీ, తెలంగాణాల్లో పొత్తు వేర్వేరుగా ఉండేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. అందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ ను ప‌వ‌న్ కు(Delhi Pawan) తెలియ‌చేస్తార‌ని తెలుస్తోంది.అందుకే, ఆయ‌న్ను ఢిల్లీ పిలిచార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read : Janasena : `వారాహి`ప‌నైయిపోయింది! ఇక సీఎం అయితేనే..!