Delhi Jagan : జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ `కేస్` స్ట‌డీ ! వివేకా మ‌ర్డ‌ర్ విచార‌ణ మ‌ర్మం!!

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ(Delhi Jagan) వెళుతున్నారు. గ‌త వారం రోజులు ఢిల్లీ పెద్ద‌ల

  • Written By:
  • Updated On - January 30, 2023 / 12:27 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ(Delhi Jagan) వెళుతున్నారు. గ‌త వారం రోజులు ఢిల్లీ పెద్ద‌ల అపాయిట్మెంట్ కోసం ప్ర‌య‌త్నం చేస్తూ స‌క్సెస్ అయ్యారు. తొలుత ఈనెల 28న ఢిల్లీ వెళ్లాల‌ని షెడ్యూల్ చేశారు. కానీ, ఆయ‌న అనుకున్న విధంగా కుద‌ర‌లేదు. అంతేకాదు, ఈనెల 27న గుంటూరు జిల్లా పొన్నూరు, హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌ల‌ను(Tour) ర‌ద్దు చేసుకున్నారు. సోమ‌వారం రోజున గుంటూరు జిల్లా వినుకొండ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సాయంత్రం ఢిల్లీ వెళ్ల‌నున్నారు.

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ(Delhi Jagan)

క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చిన త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Delhi Jagan) రాష్ట్రంలోని ప‌లు కార్య‌క్ర‌మాల‌ను ర‌ద్దు చేసుకున్నారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు షెడ్యూల్(Tour) చేసుకున్నారు. గ‌త వారం నోటీసులు అవినాష్ రెడ్డికి సీబీఐ ఇచ్చింది. అయితే, ఐదు రోజులు గ‌డువు ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు. కానీ, సీబీఐ నిరాక‌రిస్తూ పులివెందుల‌కు వెళ్లిన విష‌యం విదిత‌మే. దీంతో శ‌నివారంనాడు హైద‌రాబాద్ లోని సీబీఐ అధికారుల ఎదుట అవినాష్ రెడ్డి హాజ‌ర‌య్యారు. అదే స‌మ‌యంలో అవినాష్ తో ద‌గ్గ‌ర సంబంధాలున్న మ‌రికొంద‌రికి సీబీఐ నోటీసులు ఇస్తూ ఫిబ్ర‌వ‌రి 10న హాజ‌రు కావాల‌ని స‌మ‌న్ల‌ను ఇష్యూ చేసింది. ఫ‌లితంగా తాడేప‌ల్లి వ‌ర్గాల్లో టెన్ష‌న్ మొద‌లయింద‌ని విప‌క్షాల అభిప్రాయం.

Also Read : Viveka Murder : CBI విచార‌ణ‌కు AP CM జ‌గ‌న్ బ్ర‌ద‌ర్, తాడేప‌ల్లి కోట‌లో క‌ల్లోలం

తొలి నుంచి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కుటుంబం, ఎంపీ అవినాష్ చుట్టూ తిరుగుతోంది. డ్రైవ‌ర్ ద‌స్త‌గిరి ఇచ్చిన వాగ్మూలం మేర‌కు హ‌త్య జరిగిన తీరుపై సీబీఐ ఒక నిర్థార‌ణ‌కు వ‌చ్చింది. వాటికి ఆధారాల‌ను సేక‌రించే ప‌నిలో దూకుడుగా వెళుతోంది. క‌డ‌ప నుంచి హైద‌రాబాద్ కు హ‌త్య కేసు విచార‌ణ బ‌దిలీ కావ‌డంతో కీల‌క మ‌లుపు తిరిగింది. సుప్రీం కోర్టులో వివేకా కుమార్తె సునీత పిటిష‌న్ వేయ‌డం, సీబీఐ రంగంలోకి దిగ‌డం త‌దిత‌రాలు అన్నీ తెలిసిన అంశాలే. హ‌త్య కేసు విచార‌ణ ఆల‌స్యం కావ‌డంపై ఇటీవ‌ల వైఎస్సార్ తెలంగాణ పార్టీ చీఫ్ ష‌ర్మిల కూడా తీవ్రంగా స్పందించారు. అదే స‌మ‌యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న పెట్టుకోవ‌డం విప‌క్షాల అనుమానాల‌కు బ‌లాన్ని ఇస్తోంది.

సొంత కేసులను విచార‌ణ ఆపుకోవ‌డానికి….

రాష్ట్ర అభివృద్ధి కోసం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎప్పుడూ ఢిల్లీ వెళ్ల‌ర‌ని విప‌క్షాలు చేసే ఆరోప‌ణ‌. ఆయ‌న సొంత కేసులను విచార‌ణ ఆపుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటార‌ని తొలి నుంచి వినిపించే మాట‌. అక్ర‌మాస్తుల కేసు చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. దాని కంటే బాబాయ్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని హైరానా పెడుతోంది. ఆయ‌న సోద‌రుడు, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచార‌ణ‌కు పిల‌వ‌డంతో సీరియ‌స్ ను గ్ర‌హించారు. దీంతో ఢిల్లీ పెద్ద‌ల ఆశీస్సుల కోసం వెళుతున్నార‌ని విప‌క్షాల చెప్పే అభిప్రాయానికి అనుగుణంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి షెడ్యూల్ మార్పులు క‌నిపిస్తున్నాయి. మొత్తం మీద సోమ‌వారం ఢిల్లీ వెళ్లే జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అక్క‌డ ఏమి చేస్తారు?ఎవ‌ర్ని క‌లుస్తారు? అనేది చూడాలి.

Also Read : YS Viveka Murder : వైఎస్ వివేకా హ‌త్య కేసులో కీల‌క ప‌రిణామం.. వైసీపీ ఎంపీకి సీబీఐ స‌మాన్లు