Delhi Game : చంద్ర‌బాబుకు`ఇండియా`అండ‌! ఢిల్లీకి జ‌గ‌న్ అందుకేనా..!

Delhi Game : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు అరెస్ట్ ఢిల్లీకి చేరింది. జాతీయ నేత‌లు ఆయ‌న అరెస్ట్ మీద స్పందిన్నారు.

  • Written By:
  • Publish Date - September 12, 2023 / 03:03 PM IST

Delhi Game : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు అరెస్ట్ ఢిల్లీకి చేరింది. జాతీయ నేత‌లు ఆయ‌న అరెస్ట్ మీద స్పందిన్నారు. జాతీయ మీడియా కూడా ఆయ‌న అరెస్ట్ ను ఫోకస్ చేస్తోంది. మాజీ సీఎం, ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్న చంద్ర‌బాబును అరెస్ట్ చేసిన తీరును త‌ప్పుబ‌డుతున్నారు. బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ట్విట్ట‌ర్ వేదిక‌గా ఖండించారు. విప‌క్ష కూట‌మి ఇండియాలోని పార్టీల అధినేత‌లు ఏపీలోని రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ కుట్ర‌లో భాగంగా చంద్ర‌బాబు అరెస్ట్ జ‌రిగింద‌ని అనుమానిస్తున్నారు. అందుకే, ఆయ‌న‌కు మ‌ద్ధ‌తుగా నిల‌వ‌డానికి కూటమిలోని కొంద‌రు ముందుకొస్తున్నారు.

ఇండియా కూట‌మిలోని పార్టీల్లో చంద్ర‌బాబు గురించి చ‌ర్చ(Delhi Game) 

జాతీయ స్థాయిలో చంద్ర‌బాబుకు ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. ఆయ‌న ప‌దేళ్ల పాటు ఎన్డీయే ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌డంలో కీల‌క భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రించారు. లోక్ స‌భ‌లోనూ టీడీపీ ప్ర‌తిప‌క్షంగా ప‌నిచేసే స్థాయికి పార్టీని అప్ప‌ట్లో తీసుకెళ్లారు. జాతీయ రాజ‌కీయాల్లో యునైటెడ్ ఫ్రంట్‌, నేష‌నల్ ఫ్రంట్, ఎన్డీయే కూట‌ముల‌ను న‌డిపిన చాక‌చ‌క్యం ఆయ‌నకు ఉంది. అంతేకాదు, బెంగాల్ సీఎం మ‌మ‌త‌, బీహార్ సీఎం నితీష్‌, యూపీ మాజీ సీఎం అఖిలేష్ త‌దిత‌రుల‌తో స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన్ను అంద‌రూ గౌర‌విస్తారు. అందుకే, ఇండియా కూట‌మిలోని (Delhi Game) పార్టీల్లో చంద్ర‌బాబు గురించి చ‌ర్చ మొద‌ల‌యింది.

తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు ఆ కూట‌మికి  దూరం (Delhi Game)

ఇటీవ‌ల ప్ర‌శాంత్ కిషోర్ ఇచ్చిన స‌ల‌హా ప్ర‌కారం ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు అవ‌సరం. ప్ర‌త్యేకించి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది. అలాగే, తెలంగాణ‌లో బ‌లంగా ఉన్న‌ట్టు క‌నిపించినప్ప‌టికీ పార్టీని న‌డిపే నాయ‌క‌త్వం ప‌టిష్టంగా లేదు. ఆ విష‌యాన్ని పీకే ఇటీవ‌ల సోనియాకు ఇచ్చిన ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేషన్ సంద‌ర్భంగా వివ‌రించారు. ఆ త‌రువాత ఇండియా కూట‌మి ఏర్ప‌డింది. ప్రాంతీయ పార్టీలు ఆ కూట‌మిలో కీల‌కంగా ఉన్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు ఆ కూట‌మికి (Delhi Game) దూరంగా ఉన్నాయి. ప్ర‌ధాన పార్టీలు బీజేపీతో ప‌రోక్షంగా సంబంధాలు నెరుపుతున్నాయి. అందుకే, ఆ పార్టీల‌ను ఇండియా కూట‌మి స‌మావేశాల‌కు ఆహ్వానించ‌డంలేదు. కానీ, చంద్ర‌బాబు అరెస్ట్ త‌రువాత ప‌రిస్థితులు మారుతున్నాయ‌ని కూట‌మి గ్ర‌హించింది. చంద్ర‌బాబు మీద దృష్టి పెట్టింది.

ఏపీలో బీజేపీ, వైసీపీ ఒకేతానులో ముక్కులా

ఏపీలో బీజేపీ, వైసీపీ ఒకేతానులో ముక్కులా ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా తెలిసిందే. ఇచ్చిపుచ్చుకునే ధోర‌ణితో ఆ రెండు పార్టీలు ఉన్నాయ‌ని చెప్ప‌డానికి ప‌లు సంఘ‌ట‌న‌లు లేక‌పోలేదు. అదే స‌మ‌యంలో టీడీపీ కూడా బీజేపీతో క‌లిసి ప‌నిచేయడానికి ఇటీవ‌ల మంత‌నాలు సాగించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీతో పొత్తు దిశ‌గా వెళ్లాల‌ని కూడా అడుగులు వేసింది. కానీ, ఆ లోపే చంద్ర‌బాబు అరెస్ట్ జ‌రిగింది. ఇదంతా బీజేపీ, వైసీపీ క‌లిసిన ఆడిన నాట‌కంలా క్యాడ‌ర్ భావిస్తోంది. ఇండియా కూట‌మిలోని జాతీయ నేత‌లు కూడా అదే భావిస్తున్నారు. అందుకే, చంద్ర‌బాబును (Delhi Game) క‌లుపుకుని వెళ్ల‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాయ‌ని తెలుస్తోంది.

Also Read : TDP vs YCP : జ‌గ‌న్ జేబు సంస్థ సీఐడీ : టీడీపీ నేత క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌

ఒక వైపు బీజేపీతో అంట‌కాగుతూనే జ‌గ‌న్మోన్ రెడ్డి లండ‌న్ వేదిక‌గా ఇండియా కూట‌మితో క‌ల‌వ‌డానికి స‌న్నాహాలు చేశార‌ని తాజాగా వినిపిస్తోన్న ప్ర‌చారం. అంత‌ర్జాతీయ క్రిస్టియ‌న్ ప్ర‌ముఖులు ఈ స‌న్నాహాల వెనుక ఉన్నాయ‌ని వినిపిస్తోంది. కానీ, ఎన్నిక‌ల త‌రువాత మాత్రమే ఇండియా కూట‌మితో క‌లిసి న‌డిచేందుకు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్ధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. అందుకే, ఎన్నిక‌ల‌కు ముందుగా చంద్ర‌బాబును క‌లుపుకుని వెళ్ల‌డం మేల‌ని ఇండియా కూట‌మిలోని కీల‌క భాగ‌స్వాములు ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు  (Delhi Game) ఢిల్లీ వ‌ర్గాల్లోని వినికిడి. అంతేకాదు, చంద్ర‌బాబు అరెస్ట్ త‌రువాత టీడీపీ గ్రాఫ్ అమాంతం పెరిగింద‌ని కూడా అంచ‌నా వేస్తోంది. అందుకే, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు పిలిపించిన‌ట్టు తెలుస్తోంది.

Also Read : Jagan Case : జ‌గ‌న్ అరెస్ట్ పై టీడీపీ ఊహాగానం! బినామీల‌పై య‌న‌మ‌ల బాంబ్!!

ఎప్పుడూ రివ్యూ మీటింగ్ సీరియ‌స్ గా నిర్వ‌హించ‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ సారి లండ‌న్ నుంచి వ‌చ్చిన మ‌రుస‌టి రోజే కీల‌క మీటింగ్ పెట్టారు. ప్ర‌త్యేకించి చంద్ర‌బాబు అరెస్ట్, పరిణామాల మీద రివ్యూ చేసిన‌ట్టు తెలుస్తోంది. అంటే, ఢిల్లీ వెళ్ల‌డానికి ముందుగా అన్ని వివ‌రాల‌ను ఆయ‌న తెలుసుకుంటున్నారు. ఫ‌క్తు రాజ‌కీయ ల‌బ్ది దిశ‌గా అడుగులు వేసే బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు ఎప్పుడు ఏ నిర్ణ‌యం తీసుకుంటారో తెలియ‌దు. ఆ క్ర‌మంలో చంద్ర‌బాబు అరెస్ట్ కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను తెలుసుకుని ఢిల్లీ వెళుతున్నారు జ‌గ‌న్. మ‌రో వైపు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అక్ర‌మ సంపాద‌న కేసుల విచార‌ణ కూడా ట్ర‌య‌ల్స్ కు వ‌స్తున్నాయి. ఇంకో వైపు మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు కు సంబంధించిన విచార‌ణ కూడా జ‌రుగుతోంది. జ‌మిలి, ముందస్తు ఎన్నిక‌లపై చ‌ర్చ‌, పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం అవుతున్న త‌రుణంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నారు. ఈ ప‌ర్య‌ట‌న త‌రువాత ఊహించ‌ని మ‌లుపు ఏపీ రాజ‌కీయాల్లో జ‌రిగే అవ‌కాశం ఉంది.