Site icon HashtagU Telugu

Delhi Deals : తోడ‌ల్లుళ్ల పొలిటిక‌ల్ ఫ్రేమ్ అదిరింది.!

Delhi Deals

Delhi Deals

ఢిల్లీ వేదిక‌గా ఒకే ఫ్రేమ్ లో తోడల్లుళ్లు (Delhi Deals)మ‌ళ్లీ దొరికారు. అయితే, ఈసారి పురంధేశ్వ‌రి కూడా ఆ ప్రేమ్ లో ఉన్నారు. అందులోనూ బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డాతో మాట్లాడుతూ క‌నిపించారు. ఇంకేముంది, ఖ‌చ్చితంగా రాజ‌కీయాల గురించి చ‌ర్చ జ‌రిగి ఉంటుంద‌ని భావిండాన్ని త‌ప్పుబ‌ట్ట‌లేం. జాతీయ రాజ‌కీయాల నుంచి తెలుగు రాష్ట్రాల వ‌ర‌కు చ‌ర్చించి ఉంటార‌ని ఊహాగానాలు బ‌య‌లుదేరాయి. రాబోవు రోజుల్లో పొత్తు కుదిరే అవ‌కాశాలు ఉన్నాయా? అనే ప్ర‌శ్న‌కు సానుకూల స‌మాధానం వ‌చ్చేలా ఆ ఫ్రేమ్ ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఢిల్లీ వేదిక‌గా ఒకే ఫ్రేమ్ లో తోడల్లుళ్లు (Delhi Deals)

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి సంద‌ర్భంగా కేంద్రం రూ. 100ల నాణెం విడుద‌ల‌కు నంద‌మూరి కుటుంబం(Delhi Deals) ఢిల్లీ వెళ్లింది. సినీ, రాజ‌కీయాల‌తో ముడిప‌డి ఉన్న ఆ కుటుంబ స‌భ్యుల్లో చంద్ర‌బాబు, ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు ప్ర‌ముఖులు. వాళ్లిద్ద‌రూ తోడ‌ల్లుళ్లుగా క‌లసి రాజ‌కీయం కొంత కాలం మాత్ర‌మే చేయ‌గ‌లిగారు. ఆ త‌రువాత కొన్ని ద‌శాబ్దాల పాటు వేర్వేరుగా రాజ‌కీయం చేశారు.

కేంద్రం రూ. 100ల నాణెం విడుద‌ల‌కు నంద‌మూరి కుటుంబం ఢిల్లీ 

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ నుంచి ప్ర‌భుత్వాన్ని సొంతం చేసుకున్న తొలి రోజుల్లో ఇద్ద‌రూ ఐక్యంగా ఉన్నారు. ఆ ఎపిసోడ్ ముగిసిన త‌రువాత ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు తెలుగుదేశం పార్టీలో లేకుండా చంద్ర‌బాబు పావులు క‌దిపారు. ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత నారా, ద‌గ్గుబాటి కుటుంబీకుల మ‌ధ్య స‌ఖ్య‌త ఉండేదికాదు. ప్ర‌త్యేకించి పురంధ‌రేశ్వ‌రి, చంద్ర‌బాబు మ‌ధ్య రాజ‌కీయ వైరం ఎక్కువ‌గా ఉండేదట‌. ఇలా దాదాపు రెండున్న ద‌శాబ్దాల పాటు దూరంగా ఉన్న ఆ రెండు కుంటుంబాలు ఇటీవ‌ల స్వ‌ర్గీయ ఎన్టీఆర్ మ‌న‌వ‌రాలి వివాహం సంద‌ర్భంగా ఒకే ప్రేమ్ లో క‌నిపించారు. అంతేకాదు, తోడ‌ల్లుళ్లు (Delhi Deals) ఇద్ద‌రూ క‌లిసి మాట్లాడుకోవ‌డం క‌నిపించింది.

నారా, ద‌గ్గుబాటి కుటుంబీకుల మ‌ధ్య స‌ఖ్య‌త

అసెంబ్లీ వేదిక‌గా భువ‌నేశ్వ‌రి శీలాన్ని శంకిస్తూ వైసీపీ మాట్లాడిన‌ప్పుడు పురంధ‌రేశ్వ‌రి మ‌ద్ధ‌తుగా నిలిచారు. ఆ ఎపిసోడ్ పురంధ‌రేశ్వ‌రి, భువ‌నేశ్వ‌రి మ‌ధ్య మాట‌లు క‌లిపేసింది. ఇక తెలుగుదేశం పార్టీలోకి ద‌గ్గుబాటి కుటుంబం చేరువ కానుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, వెంక‌టేశ్వ‌ర‌రావు రాజ‌కీయాల‌కు దూరంగా ఉండాలని నిర్ణ‌యించుకున్నారు. కుమారుడు హితేష్ చెంచురామ్ కూడా రాజ‌కీయాల‌పై ఆస‌క్తిగా లేరు. దీంతో తోడ‌ల్లుళ్ల మ‌ధ్య రాజ‌కీయ స‌ఖ్య‌త కుద‌ర‌లేద‌ని చాలా మంది భావించారు. ఆ క్ర‌మంలోనే పురంధరేశ్వ‌రికి ఏపీ బీజేపీ ప‌గ్గాల‌ను అధిష్టానం అప్ప‌గించింది. ప్ర‌స్తుతం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని అటు చంద్ర‌బాబు ఇటు పురంధ‌రేశ్వ‌రి టార్గెట్ చేస్తూ వెళుతున్నారు. అంటే, రాబోవు రోజుల్లో టీడీపీ, బీజేపీ పొత్తు ఉంటుంద‌ని భావ‌న క‌లుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ వేదిక‌గా నారా, ద‌గ్గుబాటి కుటుంబీకులు (Delhi Deals)బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా స‌మ‌క్షంలో క‌నిపించ‌డం స‌రికొత్త ఊహాగానాల‌కు తావిస్తోంది.

Also Read : TDP Poll Management : కుటుంబ సార‌థులు వ‌చ్చేస్తున్నారు.!కాస్కోండిక‌!!

టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు ఇటీవ‌ల బీజేపీ అగ్ర‌నేత‌ల‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్నారు. ప్ర‌త్యేకించి న‌డ్డా, హోంమంత్రి అమిత్ షా తో సంప్ర‌దింపులు జరుపుతున్నారు. ఎన్డీయేలో భాగ‌స్వామిగా మారాల‌ని భావిస్తున్నారు. అందుకే, రాష్ట్ర‌ప‌తి, ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో టీడీపీ భేష‌ర‌తుగా బీజేపీకి మ‌ద్ధ‌తు ఇచ్చింది. ప్ర‌ధాని నరేంద్ర మోడీతోనూ ఇటీవ‌ల రెండు సార్లు చంద్ర‌బాబుకు మాట‌లు క‌లిపే అవ‌కాశం వ‌చ్చింది. ఇక ఇప్పుడు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ వేదిక‌గా జ‌రిగిన రూ. 100ల నాణెం విడుద‌ల సంద‌ర్భంగా న‌డ్డాతో మంత‌నాలు సాగించ‌డం కొత్త రాజ‌కీయ ప‌రిణామాల‌కు తావిస్తోంద‌ని తెలుస్తోంది.

Also Read : CBN-NTR : చంద్ర‌బాబు స‌మేత నంద‌మూరి ఫ్యామిలీ! రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్లో ఈనెల 28న సంద‌డి!!

తెలంగాణ‌లో కింగ్, ఏపీలో కింగ్ మేక‌ర్ కావాల‌ని బీజేపీ లక్ష్యంగా ఉంది. ఆ రెండు టార్గెట్ ల‌ను రీచ్ కావాలంటే టీడీపీ మ‌ద్ధ‌తు బీజేపీకి అవ‌స‌రం. ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బెనిఫిట్ ఉంటుంది. పైగా ఇటీవ‌ల వ‌చ్చిన స‌ర్వేల ప్ర‌కారం టీడీపీ ఏపీలో బ‌లంగా ఉంది. తెలంగాణ‌లోనూ ఓటు బ్యాంకు ఉంది. అందుకే, టీడీపీని ఉప‌యోగించుకోవ‌డం ద్వారా బ‌ల‌ప‌డాల‌ని బీజేపీ భావిస్తోంది. అందుకు, వేదిక‌గా స్వ‌ర్గీయ ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి సంద‌ర్భంగా విడుద‌ల చేసిన రూ. 100ల నాణెం వేడుక నిల‌చింది. సరికొత్త రాజ‌కీయ పరిణామాల‌కు ఈ వేడుక దారితీస్తుంద‌ని భావిస్తున్నారు. తోడ‌ల్లుళ్లు ఇద్ద‌రూ ఒకే ఫ్రేమ్ లో క‌నిపిస్తున్నారంటే, ఎదో అనూహ్య రాజ‌కీయ ప‌రిణామం ఏపీ, తెలంగాణాలో చోటుచేసుకుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డే వాళ్లు అనేకులు.

Delhi Deals 2