Delhi CBN : చంద్ర‌బాబుపై NDA, UPA `హాట్ లైన్ `ఆప‌రేష‌న్‌

ఢిల్లీ పెద్ద‌లు టీడీపీ అధినేత (Delhi CBN) వైపు చూస్తున్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు జూలు విధిలించాలి?రేణుకాచౌద‌రి, కేవీపీ పిలుపునిచ్చారు

  • Written By:
  • Publish Date - May 18, 2023 / 01:23 PM IST

ఢిల్లీ పెద్ద‌లు టీడీపీ అధినేత చంద్ర‌బాబు(Delhi CBN) వైపు చూస్తున్నారు. ఇప్పుడు చంద్ర‌బాబు జూలు విధిలించాలి? అంటూ మాజీ కేంద్ర మంత్రి రేణుకాచౌద‌రి,(Renuka chowdary) కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్ కేవీపీ రామ‌చంద్రరావు(KVP) ఇటీవ‌ల పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా రాజ‌కీయాలు మారుతోన్న స‌మ‌యంలో సీనియ‌ర్ పొలిటిష‌య‌న్ గా చంద్ర‌బాబు యూపీఏ ప‌క్షాన నిల‌వాల‌ని కోరుతున్నారు. తాజాగా బెంగాల్ టైగ‌ర్ మ‌మ‌త కూడా ఆయా రాష్ట్రాల్లో బ‌లంగా ఉండే పార్టీల‌తో కాంగ్రెస్ క‌లిసి ప‌నిచేయాల‌ని సూచించారు. అదే బాట‌న యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా అడుగులు వేస్తున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా యూపీఏ ప‌క్షాన నిలుస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలో చంద్ర‌బాబు ఢిల్లీ వైపు చూడాల‌ని దేశంలోని సీనియ‌ర్ పొలిటీషియ‌న్లు కోరుకుంటున్నారు.

ఢిల్లీ పెద్ద‌లు టీడీపీ అధినేత చంద్ర‌బాబు  వైపు..(Delhi CBN)

దేశ రాజ‌కీయాల‌ను ఒంటిచేత్తో న‌డిపిన అనుభ‌వం చంద్ర‌బాబుకు(chandrababu) ఉంది. నేష‌న‌ల్ ప్రంట్‌, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీయే భాగస్వామిగా చంద్ర‌బాబు కీ రోల్ పోషించారు. కొన్ని ద‌శాబ్దాల పాటు జాతీయ రాజ‌కీయాల మీద ప్ర‌త్యేక ముద్ర‌ను వేశారు. అందుకే, ఆయ‌న కావాలంటూ ఇప్పుడు ఢిల్లీ పెద్ద‌లు(Delhi CBN) కోరుకుంటున్నారు. కానీ, ఏపీలోని ప‌రిస్థితుల దృష్ట్యా ఆయ‌న హ‌స్తిన వైపు క‌ద‌ల్లేక‌పోతున్నారు. అయిన‌ప్ప‌టికీ హాట్ లైన్స్ మాత్రం ఆయ‌న్న ప‌ల‌క‌రిస్తున్నాయ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోన్న మాట‌.

హాట్ లైన్స్ మాత్రం ఆయ‌న్న ప‌ల‌క‌రిస్తున్నాయ‌ని

బెంగాల్ టైగ‌ర్ మ‌మ‌త‌, బీహార్ సీఎం నితీష్ కుమార్(Nitish)రాజ‌కీయాల‌కు అతీతంగా చంద్ర‌బాబుకు స‌న్నిహితులు, శ్రేయోభిలాషులు. ఇక యూపీలోని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్(Akhilesh Yadav) తో స‌త్సంబంధాలు ఉన్నాయి. మూలాయం సింగ్ యాద‌వ్ యాక్టివ్ గా ఉన్న రోజుల్లో ఇచ్చిపుచ్చుకునేలా టీడీపీ, ఎస్పీ మ‌ధ్య సంబంధాలు న‌డిచేవి. అదే ఇప్పుడు కొన‌సాగుతోంది. ఇక బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి కూడా చంద్ర‌బాబు నాయ‌క‌త్వాన్ని స‌మ‌ర్థిస్తారు. ఇప్పుడు జాతీయ స్థాయికి ఎదిగిన కేజ్రీవాల్ మిన‌హా మిగిలిన జాతీయ నేత‌ల‌తో చంద్ర‌బాబుకు (Delhi CBN) స్నేహ‌పూర్వ‌క సంబంధాలు బ‌లంగా ఉన్నాయి. ప్ర‌త్యేకించి మ‌మ‌త‌, నితీష్ లతో ఆయ‌న‌కు హాట్ లైన్ ప‌ల‌క‌రింపులు త‌ర‌చూ ఉంటాయ‌ని బ‌లంగా వినిపించే మాట‌.

 మ‌మ‌త‌, నితీష్  చంద్ర‌బాబుకు స‌న్నిహితులు (Delhi CBN)

క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత కాంగ్రెస్ తో కూడిన కూట‌మి ఢిల్లీ పీఠం చేజిక్కించుకునే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వేల అంచ‌నా. ఆ దిశ‌గా అడుగులు వేగంగా ప‌డుతున్నాయి. అందుకే, ఎన్డీయేకు (NDA) ద‌గ్గ‌ర‌గా ఉండే ఒరిస్సా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్ కూడా ఇటీవ‌ల స‌మదూరం అంటున్నారు. అంటే, బీజేపీతో క‌లిసి పనిచేయ‌డానికి సిద్ధంగా లేమ‌ని సంకేతాలు ఇచ్చారు. కాంగ్రెసేత‌ర ప‌క్షాల‌ను ఏకం చేయ‌డానికి స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌కునిగా చంద్ర‌బాబును(Chandrababu)  భావిస్తున్నారు. జాతీయ రాజ‌కీయాల్లో ఆయ‌న యాక్టివ్ కావాల‌ని కోరుకుంటున్నారు. ఆ క్ర‌మంలోనే రేణుకా చౌద‌రి, కేవీపీ మాట్లాడుతూ చంద్ర‌బాబు జూలు విదించాల‌ని సూచిస్తున్నారు.

రేణుకా చౌద‌రి, కేవీపీ మాట్లాడుతూ చంద్ర‌బాబు జూలు విదించాల‌ని

జాతీయ రాజ‌కీయాల దిశ‌గా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌నతో క‌లిసి న‌డ‌వ‌డానికి ఎవ‌రూ ముందుకు రావ‌డంలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ ను దుష్మ‌న్ గా చూస్తోంది. న‌మ్మించి మోసం చేసిన లీడ‌ర్ గా  రాహుల్ భావిస్తున్నారు. ఆ మేర‌కు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కానీ, జాతీయ స్థాయి స‌మీక‌ర‌ణాలు మారుతోన్న దృష్ట్యా బీఆర్ఎస్ తో కూడా ఎన్నిక‌ల త‌రువాత ప‌నిచేయాల‌ని కాంగ్రెస్ భావిస్తుంద‌ని ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ వెల్ల‌డించారు. అంటే, న‌రేంద్ర మోడీని దింపేయ‌డానికి ఒక‌ప్పుడు చంద్ర‌బాబు స‌న్నిహితులు అంద‌రూ ఏకం అవుతున్నారు. కానీ, ఏపీ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా చంద్ర‌బాబు(Delhi CBN) మాత్రం ఆచితూచి అడుగు వేస్తున్నారు.

Also Read : CBN: పబ్లిక్ పాలసితోనే ప్రగతి: చంద్రబాబు

ఇటీవ‌ల న‌రేంద్ర మోడీ విజ‌న్ గురించి చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. భార‌త్ ను అభివృద్ధి ప‌థానా తీసుకెళ్ల‌డంలో మోడీ నాయ‌క‌త్వం బాగుంద‌ని కితాబు ఇచ్చారు. ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కానీ, చంద్ర‌బాబు పాత స్నేహితులు మాత్రం మోడీకి వ్య‌తిరేకంగా కూట‌మి క‌ట్ట‌డానికి రావాల‌ని కోరుకుంటున్నారు. ఆయ‌నొక్క‌డే స‌మ‌ర్థుడు అంటూ పాత జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటున్నార‌ట‌. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబును ఢిల్లీ రాజ‌కీయాల్లో(Delhi CBN) యాక్టివ్ చేయాల‌ని మ‌మ‌త‌, నితీష్ సీరియ‌స్ గా ఆలోస్తున్నార‌ని టాక్. అందుకే హాట్ లైన్లో వాళ్లిద్ద‌ర‌రూ చంద్ర‌బాబుకు ట‌చ్ లో ఉన్నార‌ని హ‌స్తిన వ‌ర్గాల్లోని వినికిడి.

Also Read : TDP Janasena: బీజేపీలేని కూటమి దిశగా టీడీపీ, జనసేన

క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌రువాత బీజేపీ అధిష్టానం కూడా చంద్ర‌బాబుకు సానుకూలంగా మారింద‌ట‌. ఎన్డీయేలో భాగ‌స్వామిగా చేసుకోవాల‌ని ప్ర‌య‌త్నం మొద‌లుపెట్టింద‌ని తెలుస్తోంది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో బీజేపీ బ‌తికిబ‌ట్ట‌క‌ట్టాలంటే టీడీపీ స‌హ‌కారం అవ‌స‌ర‌మ‌ని భావిస్తోంద‌ని తెలుస్తోంది. ఒక వేళ టీడీపీని క‌లుపుకుని వెళ్ల‌లేక‌పోతే సౌత్ మొత్తం బీజేపీకి భ‌విష్య‌త్ ఎండ‌మావిగా క‌నిపిస్తోంద‌ని ఆ పార్టీ వ‌ర్గాల్లోని అంచ‌నా. అందుకే, చంద్ర‌బాబును యూపీఏ (UPA) ప‌క్షాలు లాగేసుకునే వ‌ర‌కు వేచిచూడ‌కుండా ఎన్డీయేలో (NDA) భాగ‌స్వామ్యం చేసుకోవాల‌ని మోడీ, షా ద్వ‌యం నిర్ణ‌యించుకుంద‌ని తెలుస్తోంది. మొత్తం మీద ఎన్డీయే, యూపీఏ ప‌క్షాలు క‌ర్ణాట‌క ఫ‌లితాల తరువాత చంద్ర‌బాబు అవ‌స‌రాన్ని గుర్తించాయ‌న్న‌మాట‌.