Pawan Kalyan : ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విశేష విజయాన్ని సాధించింది. 70 స్థానాలున్న ఈ ఎన్నికల్లో బీజేపీ 47 స్థానాల్లో గెలుపొందగా, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 23 స్థానాలకే పరిమితం అయింది. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎలాంటి విజయం సాధించలేదు.
ఈ సందర్భంగా బీజేపీ విజయంపై స్పందించిన జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని నరేంద్ర మోడీపై ప్రజల విశ్వాసం మరోసారి రుజువైందన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు మోడీ నిబద్ధతతో పరిపాలన సాగిస్తున్నారని ప్రశంసించారు. సంక్షేమాన్ని విస్మరించకుండా అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు.
Parvesh Verma : కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ ఎంత ఆస్తిపరుడో తెలుసా ?
ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించడం దేశాభివృద్ధికి శుభసూచకమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఢిల్లీలో సమగ్ర అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు చేరువవుతాయన్నారు. ‘వికసిత సంకల్ప పత్రం’ ద్వారా బీజేపీ ఇచ్చిన హామీలు ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్నాయని తెలిపారు. అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాల అమలు, పరిపాలన సాగుతుందని ఢిల్లీ ప్రజలు నమ్మకంతో ఓటు వేశారని వ్యాఖ్యానించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని చాతుర్యంతో ముందుకు నడిపించారని ప్రశంసించారు. అలాగే, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూటమిని విజయవంతంగా నడిపించారని కొనియాడారు.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయానికి ప్రధాన కారణమైన నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ నేతలు, మిత్రపక్ష నాయకులకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్లు పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
Suryakumar Yadav: 2,0,14,12, 0, 9.. గతన ఆరు ఇన్నింగ్స్‌ల్లో సూర్యకుమార్ చేసిన పరుగులివే!