Delhi Alliance : పొత్తుకు చంద్ర‌బాబు సై! ముంద‌స్తు సంకేతాలు!!

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు చంద్ర‌బాబు సంకేతాలు ఇచ్చారు. ఆయ‌న ఢిల్లీ నుంచి వ‌చ్చిన త‌రువాత మీడియాతో (Delhi Alliance)చిట్ చాట్ చేశారు.

  • Written By:
  • Publish Date - August 29, 2023 / 04:43 PM IST

ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు చంద్ర‌బాబు సంకేతాలు ఇచ్చారు. ఆయ‌న ఢిల్లీ నుంచి వ‌చ్చిన త‌రువాత మీడియాతో (Delhi Alliance)చిట్ చాట్ చేశారు. ఆ సంద‌ర్భంగా పొత్తుల‌పై దాదాపుగా క్లారిటీ ఇచ్చేశారు. బీజేపీ, జ‌న‌సేన‌తో క‌లిసి కూట‌మిగా టీడీపీ వెళ్ల‌నుంద‌ని తెలుస్తోంది. పొత్తులు కొత్తేమీ కాదంటూ చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు రాబోవు ఎన్నిక‌ల్లో పొత్తును ఖ‌రారు చేస్తున్నాయి. అయితే, ఎవ‌రితో పొత్తు? అనేది మాత్రం దాచేస్తున్నారు. ఎన్నిక‌ల నాటికి చూస్తారుగా? అంటూ దాటేశారు.

బీజేపీ, జ‌న‌సేన‌తో క‌లిసి కూట‌మిగా టీడీపీ (Delhi Alliance)

రాష్ట్రం పున‌ర్నిర్మాణం కోసం చంద్ర‌బాబు పావులు క‌దిపారు. ప్ర‌త్యేక హోదా కోసం ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన టీడీపీ తిరిగి అదే కూట‌మిలోకి (Delhi Alliance) వెళ్ల‌నుంది. ఎన్నిక‌ల‌కు ముందుగానే ఎన్డీయేలో చేర‌డానికి రంగం సిద్ధ‌మ‌యింది. ప్ర‌త్యేక ప్యాకేజిని చ‌ట్ట‌బ‌ద్ధ‌త చేయ‌మ‌ని డిమాండ్ చేసిన చంద్ర‌బాబు ఆనాడు ఎన్డీయేను కాద‌నుకుని బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం విదిత‌మే. అయితే, ఇప్పుడు బీజేపీ అధిష్టానం నుంచి ఎలాంటి హామీ వ‌చ్చిందో తెల‌య‌దుగానీ ఎన్డీయేకి ద‌గ్గ‌ర‌వుతున్నారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం కేంద్రంతో క‌లిసి ప‌నిచేయాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్నారు. ఆ దిశ‌గా అడుగులు వేస్తున్న‌ట్టు తేల్చేశారు.

Also Read : CBN 100 : ఢిల్లీలో మ‌ళ్లీ చ‌క్రం! అల్లుడా మ‌జాకా!!

లోక్ స‌భ ఎన్నిక‌లు కూడా ముందస్తుగా వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని చంద్ర‌బాబు క్లూ (Delhi Alliance) ఇచ్చేశారు. ఢిల్లీలో బీజేపీ పెద్ద‌ల‌తో ఆయ‌న సోమ‌వారం మాట్లాడారు. జాతీయ బీజేపీ అధ్య‌క్షుడు న‌డ్డాతో ప్ర‌త్యేకంగా మాట్లాడుతోన్న ఫోటో సోమ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా వైర‌ల్ అయింది. ఆ ఫోటోలో చంద్ర‌బాబు, దగ్గుబాటి దంప‌తులు, వైసీపీ రెబ‌ల్ ర‌ఘురామ‌క్రిష్ణంరాజు, మాజీ ఎంపీ ర‌మేష్ ఉన్నారు. గ‌తంలోనూ 2009 ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఏర్ప‌డిన మ‌హాకూటమి వెనుక ర‌మేష్ క‌స‌రత్తు చేశారు. మ‌హాకూట‌మిని ఏర్పాటు చేయ‌డానికి ర‌మేష్ చేసిన ప్ర‌య‌త్నం ఆ ఎన్నిక‌ల్లో ఫ‌లించింది. కానీ, ఎన్నిక‌ల్లో మ‌హా కూట‌మి ఘోరంగా ఓడిన సంగ‌తి తెలిసిందే.

లోక్ స‌భ ఎన్నిక‌లు కూడా ముందస్తుగా వ‌చ్చే ఛాన్స్

ప్ర‌స్తుతం బీజేపీతో క‌లిసి న‌డిచేందుకు టీడీపీ సిద్ద‌మైయింది. ఇదే విష‌యం చాలా కాలంగా ర‌మేష్ చెబుతూ వ‌స్తున్నారు. ఆయ‌న‌తో పాటు త్రిబుల్ ఆర్ కూడా ప‌లు సంద‌ర్భాల్లో పొత్తు గురించి చెప్పారు. ఇప్పుడు అదే జ‌రుగుతుంద‌ని చంద్ర‌బాబు తాజా వ్యాఖ్య‌ల ద్వారా అర్థ‌మ‌వుతోంది. దక్షిణ భార‌త దేశంలో బ‌ల‌హీన‌ప‌డిన బీజేపీకి చంద్ర‌బాబు ఒక దిక్కుగా కనిపిస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లోనూ బోల్తాప‌డిన బీజేపీ ఇప్పుడు ఏపీ, తెలంగాణ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు అండ‌ను  (Delhi Alliance) కావాల‌నుకుంటోంది. ఆ దిశ‌గా ముందుకొచ్చిన చంద్ర‌బాబును వాడేసుకునేందుకు సిద్ధ‌మ‌యింది.

బీజేపీతో క‌లిసి న‌డిచేందుకు టీడీపీ

ఎన్డీయేలో భాగ‌స్వామ్యం కావాల‌ని ప‌లుమార్లు వైసీపీ శాశ్వ‌త చీఫ్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి బీజేపీ ఆఫ‌ర్ ఇచ్చింది. మంత్ర‌వ‌ర్గంలోనూ స్థానం క‌ల్పిస్తామ‌ని చెప్పింది. కానీ, మోడీ మాట‌ను కాద‌ని ఎన్డీయేకు దూరంగా ఉంటూ సాన్నిహిత్యాన్ని న‌డుపుతున్నారు. అందుకు ప్ర‌తిగా ఉభ‌య స‌భ‌ల్లో ప‌లు బిల్లుల‌కు మ‌ద్ధ‌తు పలుకుతూ ఎన్డీయేకు జై కొడుతున్నారు. కానీ, ప్రస్తుతం మారిన రాజ‌కీయ ప‌రిణామాల దృష్ట్యా చంద్ర‌బాబును ఎన్డీయేలో భాగస్వామిగా చేసుకుంటే దేశ వ్యాప్తంగా బీజేపీకి కొంత హైప్ క్రియేట్ అవుతోంది. ఆ కోణం నుంచి బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు చంద్ర‌బాబును ఆక‌ర్షించారు. ఎన్నిక‌లకు ముందే ఎన్డీయేలో భాగస్వామిగా చంద్ర‌బాబు పార్టీ (Delhi Alliance) మార‌బోతుంద‌న్న‌మాట‌.

Also Read : Delhi CEC : TDP, YCPప‌ర‌స్ప‌ర ఫిర్యాదు!YCP ర‌ద్దుకు CBN డిమాండ్!!

ప్ర‌స్తుత సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఓడించ‌డ‌మే ప్ర‌ధాన లక్ష్యంగా చంద్ర‌బాబు పెట్టుకున్నారు. ఏపీ 20ఏళ్లు వెన‌క్కు వెళ్ల‌డానికి కార‌ణం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వాల‌కం అంటూ విమ‌ర్శిస్తున్నారు. అంతేకాదు, తెలంగాణ‌తో పోటీప‌డేందుకు ఒక బ్లు ప్రింట్ ను త‌యారు చేస్తున్నాన‌ని వెల్ల‌డించారు. అందుకోసం ఒక క‌మిటీని కూడా ఏర్పాటు చేసిన‌ట్టు మీడియాకు లీకులు ఇచ్చారు. అంటే, రాబోవు ఎన్నిక‌ల్లో తెలంగాణ మోడ‌ల్ ను చూప‌డం ద్వారా ఏపీ ప్ర‌జ‌ల్ని ఆక‌ర్షించే అస్త్రాన్ని ఆయ‌న త‌యారు చేస్తున్నారు. ఒక వైపు ఎన్నిక‌ల‌కు రెడీ అవుతూనే మ‌రో వైపు పొత్తుల‌ను ఒక కొలిక్కి తీసుకొచ్చారు.

 Also Read : CBN Happy : చంద్ర‌బాబుకు మ‌మ‌త వ్యాఖ్య‌ల‌ జోష్

గ‌త ఏడాది కాలంగా పొత్తు గురించి ప‌లు ర‌కాల ఊహాగానాల‌కు తెర‌లేచింది. ఇప్ప‌టికి ఒక కొలిక్కి వ‌చ్చిన‌ట్టు అయింది. ఢిల్లీ వెళ్లొచ్చిన త‌రువాత చంద్ర‌బాబు ఇచ్చిన సంకేతాల ప్రకారం బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన కూట‌మి ఏపీలో ఏర్ప‌డ‌బోతుంది. కానీ, తెలంగాణ‌కు మాత్రం ఆ పొత్తు వ‌ర్తించేలా క‌నిపించ‌డంలేదు. కేవ‌లం ఏపీ వ‌ర‌కు మాత్రం ప‌రిమితం అయ్యేలా చంద్ర‌బాబు చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లొచ్చిన త‌రువాత ఉషారుగా క‌నిపిస్తోన్న చంద్ర‌బాబు ముంద‌స్తు ఎన్నిక‌లు ఉంటాయ‌ని వెల్ల‌డించారు. బెంగాల్ సీఎం మ‌మ‌త చేసిన వ్యాఖ్య‌ల‌కు బ‌లం చేకూరేలా ఆయ‌న ఇచ్చిన ముంద‌స్తు సంకేతాలు ఉన్నాయి. అంతేకాదు, తొలి విడ‌త 160 మంది ఎంపీ అభ్య‌ర్థుల‌తో బీజేపీ జాబితాను విడుద‌ల చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు ఢిల్లీ రాజ‌కీయాల్లోని టాక్‌. ఏపీ, తెలంగాణ అభ్య‌ర్థుల‌ను కూడా ముందుగానే విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తుంద‌ట‌. ఇవ‌న్నీ గ‌మ‌నిస్తే, మినీ జ‌మిలీతో కూడిన ముంద‌స్తు త‌థ్యంగా క‌నిపిస్తోంది.