Site icon HashtagU Telugu

AP Exit Polls 2024 : ఏపీలో ఈ మంత్రులకు ఓటమి తప్పదు – ‘ఆరా’

Aara Ap

Aara Ap

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలకు సంబదించిన ఎగ్జిట్ పోల్స్ వెల్లడవుతున్నాయి. కేంద్రంలో బిజెపి మరోసారి అధికారంలోకి రాబోతుందని తేల్చి చెపుతుండగా..ఏపీ విషయంలో మాత్రం కాస్త అయోమయానికి గురి చేస్తున్నాయి ఎగ్జిట్ పోల్ ఫలితాలు. మెజార్టీ పోల్స్ మాత్రం కూటమిదే విజయం అంటున్నప్పటికీ..కొన్ని సర్వేలు మాత్రం వైసీపీ పార్టీదే విజయం అంటున్నాయి. ఆలా అంటున్న సర్వే లలో అరా ఒకటి. గత ఎన్నికల్లో వైసీపీ పార్టీ గెలుస్తుందని అరా చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని తెలిపింది..అరా చెప్పినట్లే గెలవడం తో ఈసారి ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందో..? అరా సంస్థ ఏంచెపుతుందో అని అంత ఆసక్తిగా ఎదురుచూసారు. ఇక అరా సంస్థ మరోసారి వైసీపీ పార్టీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. కానీ వైసీపీ పార్టీలోని కీలక మంత్రులంతా ఓడిపోతారని అంచనా వేయడం కొసమెరుపు.

We’re now on WhatsApp. Click to Join.

జగన్ పార్టీకి 94-104 స్థానాలు రావచ్చని ఈ ఎగ్జిట్ పోల్ రిజల్ట్ వెల్లడించింది. టీడీపీ+జనసేన+బీజేపీ కూటమి 71-81 సీట్లతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితం కావచ్చని అంచనా వేస్తోంది. సంక్షేమ పథకాలతో జగన్ కు మరోసారి ఓటర్లు పట్టం కట్టినట్లు ఈ సర్వే పేర్కొంది. టీడీపీ కీలక నేత నారా లోకేశ్ గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి గెలుస్తారని , టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి, నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచి, పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ , పులివెందుల నుండి జగన్ భారీ మెజార్టీతో గెలుస్తారని ప్రకటించారు. మచిలీపట్నం, కాకినాడ ఎంపీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థులు కూడా గెలుస్తారని వెల్లడించారు. ఇక తెనాలిలో నాదెండ్ల మనోహర్ కూడా మంచి మెజార్టీతో విజయం సాధిస్తారని పేర్కొన్నారు.

ఉమ్మడి ఏపీ మాజీ CM కిరణ్ కుమార్రెడ్డి రాజంపేట లోక్సభ స్థానం నుంచి ఓడిపోతారని ఆరా మస్తాన్ వెల్లడించారు. నర్సాపురం, అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థులు మంచి మెజార్టీతో గెలుస్తారని ప్రకటించారు. రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్న పురందీశ్వరి గట్టి పోటీని ఎదుర్కొంటున్నారని తెలిపారు. విజయవాడ పశ్చిమ నుంచి పోటీ చేసిన BJP నేత సుజనా చౌదరి, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్(BJP) గెలుస్తారని అంచనా వేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రులు రోజా (నగరి), అప్పలరాజు (పలాస), గుడివాడ అమర్నాథ్ (గాజువాక), నాగేశ్వరరావు (తణుకు), చెల్లుబోయిన వేణు(రాజమండ్రి.R), ఆదిమూలపు సురేశ్ (కొండేపి) ఉషశ్రీ (పెనుకొండ), విడదల రజనీ (గుంటూరు పశ్చిమ), సత్య నారాయణ (తాడేపల్లిగూడెం) ఓడిపోతారని ఆరా మస్తాన్ అంచనా వేశారు. ధర్మాన ప్రసాద్ (శ్రీకాకుళం), జోగి రమేష్ (పెనుమలూరు), అంబటి రాంబాబు (సత్తెనపల్లి) గట్టి పోటీ ఎదుర్కొన్నారని ప్రకటించారు.

Read Also : Exit Polls 2024 : తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తున్నారు..?

Exit mobile version