Free Gas Cylinders : దీపం-2 పథకం..పెట్రోలియం సంస్థలకు నిధులు విడుదల చేసిన ప్రభుత్వం

Free Gas Cylinders : ఏడాదికి నాలుగు నెలలకు ఒకటికి చొప్పున మూడు సిలిండర్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత సిలిండర్లకు ఏడాదికి మొత్తం రూ.2,684 కోట్లకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రభుత్వం మొదటి సిలిండర్ కు ఖర్చు అయ్యే రూ.894 కోట్లు పెట్రోలియం సంస్థలకు చెక్కు రూపంలో అందజేసింది.

Published By: HashtagU Telugu Desk
Deepam-2 scheme..Government released funds to petroleum companies

Deepam-2 scheme..Government released funds to petroleum companies

CM Chandrababu : ఏపీలో సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పథకానికి ఖర్చయ్యే నిధులను గ్యాస్ సరఫరా చేసే పెట్రోలియం సంస్థలకు అందజేశారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకు ఉచిత గ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని అందించారు.

కాగా, ఏడాదికి నాలుగు నెలలకు ఒకటికి చొప్పున మూడు సిలిండర్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉచిత సిలిండర్లకు ఏడాదికి మొత్తం రూ.2,684 కోట్లకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా ప్రభుత్వం మొదటి సిలిండర్ కు ఖర్చు అయ్యే రూ.894 కోట్లు పెట్రోలియం సంస్థలకు చెక్కు రూపంలో అందజేసింది. దీపం-2 పథకంలో భాగంగా 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున రాష్ట్రంలోని పేద ప్రజలకు అందించనున్నారు. గ్యాస్ సిలిండర్లకు అయ్యే ఖర్చు సొమ్మును ప్రభుత్వం విడుదల చేయనుంది.

ఇకపోతే..అక్టోబర్ 29 నుంచి ఏపీ ప్రభుత్వం ఫ్రీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో లబ్ధిదారులకు సిలిండర్ సొమ్ము వారి ఖాతాలో జమ చేస్తుంది ప్రభుత్వం. కేంద్రం ఇచ్చే రూ.25ల రాయితీ పోను మిగిలిన రూ.876లను చంద్రబాబు ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వంపై రూ.2,684 కోట్లు ప్రతి ఏడాది ఆర్థిక భారం పడనుంది. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తో సివిల్ సప్లై శాఖ అధికారులు, పెట్రోలియం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Read Also: Triumph Tiger 1200 : దీపావళి వేళ ‘ట్రయంఫ్’ కొత్త బైక్.. ‘2025 టైగర్ 1200’ ఫీచర్లు ఇవీ

 

  Last Updated: 30 Oct 2024, 04:13 PM IST