Indecent Politics: నేత‌ల `బూతు` సంస్కారం

`నీ అమ్మ మొగుడు..నా కొడ‌కా..భూస‌డీకే..గ‌జ్జి కుక్క‌..పంది..ప‌ప్పు..పిచ్చి కుక్క‌..వెధ‌వ‌..వెధ‌వ‌న్న‌ర వెధ‌వ‌..ఒరే..` ఇవీ త‌ర‌చూ ఏపీ నేత‌ల నుంచి వినిపించే మాట‌లు.

  • Written By:
  • Updated On - November 11, 2021 / 04:39 PM IST

`నీ అమ్మ మొగుడు..నా కొడ‌కా..భూస‌డీకే..గ‌జ్జి కుక్క‌..పంది..ప‌ప్పు..పిచ్చి కుక్క‌..వెధ‌వ‌..వెధ‌వ‌న్న‌ర వెధ‌వ‌..ఒరే..` ఇవీ త‌ర‌చూ ఏపీ నేత‌ల నుంచి వినిపించే మాట‌లు. `స‌న్నాసి..లుచ్చా..బ‌ద్మాష్..ల‌‌ఫూట్‌..బ‌ట్టేబాజ్‌..కుక్క‌లు..తూ..మీబ‌త్కుచెడ‌..ఏరా..బోడిగుండ‌, అర‌గుండు, పొట్టోడు.` ఇలాంటి మాట‌లు తెలంగాణ నేత‌ల త‌ర‌చూ వాడేవి. సాధార‌ణంగా ఈ మాట‌లు చ‌ట్ట ప్ర‌కారం అభ్యంత‌ర‌క‌రం. అందుకే అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగే స‌మ‌యంలో నోరుజారితే..వెంట‌నే రికార్డ్ ల నుంచి స్పీక‌ర్ తొలిగిస్తాడు. సంబంధిత వ్య‌క్తి చేత క్ష‌మాప‌ణ చెప్పిస్తాడు.

అసెంబ్లీ బ‌య‌ట విచ్చ‌ల‌విడిగా మీడియా ముందు ఆ మాట‌ల‌ను ప్ర‌స్తుత లీడ‌ర్లు సునాయాసంగా వాడేస్తున్నారు. ఇప్పుడిప్పుడే అసెంబ్లీ లోప‌ల‌కు కూడా ప్ర‌వేశించాయి. ఈ ధోర‌ణి చూస్తుంటే..రాబోవు రోజుల్లో అన్ పార్ల‌మెంట్ వార్డ్స్ ఏమిటో కూడా తెలియ‌కుండా నేటి త‌రాన్ని మ‌న నేత‌లు తీర్చిదిద్దుతారేమో అనిపిస్తోంది.భూస‌డికే అనే ప‌దాన్ని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహన్ రెడ్డి మీద టీడీపీ అధికార ప్ర‌తినిధి ప‌ట్టాభి ఉప‌యోగించాడు. ఆ సంద‌ర్భంగా ఆ ప‌దం అర్థాన్ని తెలుచుకోవ‌డానికి గుగూల్ లో చాలా మంది అన్వేషించారు. దాని అర్థాన్ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి `ల‌…కొడ‌కా` అని వివ‌రించాడు. త‌న తల్లిని కూడా ఇలా తిట్ట‌డం ఏమిట‌ని ఆవేద‌న చెందాడు. అందుకు స్పందించిన వైసీపీ క్యాడ‌ర్ టీడీపీ ఆఫీస్ ల మీద దాడుల‌కు దిగారు. ఆ క్ర‌మంలో ప‌ర‌స్ప‌రం టీడీపీ, వైసీపీ కేసులు పెట్టుకున్నాయి. ప‌ట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ త‌రువాత బెయిల్ పై విడుద‌ల అయ్యాడు.
ఇక మంత్రులు కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు, పేర్ని నాని సునాయాసంగా బూతులు వాడుతుంటారు. చంద్ర‌బాబు, లోకేష్ ల‌పై వాళ్లు వాడే భాష విన‌డానికి ఎబ్బెట్టుగా ఉంటుంది. ప‌చ్చి బూతులు తిడుతూ ప్ర‌త్య‌ర్థుల‌ను టార్గెట్ చేయ‌డం అలవాటు చేసుకున్నారు. ప్ర‌తిగా లోకేష్ ఇటీవ‌ల అదే స్థాయిలో బూతులు వాడేందుకు వెనుకావ‌డ‌డంలేదు. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మీద అస‌భ్య‌క‌ర‌మైన ప‌దజాలాన్ని లోకేష్ వాడుతున్నాడు. తెలుగుదేశం పార్టీకి చెందిన ద్వితీయ‌శ్రేణి నాయ‌కుల చేత మంత్రుల‌ను టీడీపీ బూతులు తిట్టిస్తోంది.

ఉద్య‌మ స‌మ‌యం నుంచి కేసీఆర్ తిట్ట పురాణం వింటే, ఆయ‌న ఉప‌యోగించిన భాష అస‌భ్య‌క‌రం. అనే సంద‌ర్భాల్లోప్ర‌త్య‌ర్థుల‌ను బూతులు తిట్టారు. అదేమంటే ఉద్య‌మం ఉవ్వెత్తున లేవ‌డానికి ఈ మాత్రం ప‌ద‌జాలం ఉండాల‌ని స‌హ‌చ‌రుల‌తో ఆనేవాళ్ల‌ట‌. ఇక ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చిన తరువాత ప్ర‌త్య‌ర్థి పార్టీల లీడ‌ర్ల‌ను బూతుల‌తో ఏకిపారేస్తుంటాడు. అదే కోవ‌లోకి రేవంత్ ను తీసుకోవ‌చ్చు. వాడ‌రాని భాష‌ను వాడుతూ రాజ‌కీయాన్ని ర‌క్తించాల‌ని భావిస్తున్నాడు. తాజాగా బీజేపీ నేత‌లు బండి సంజ‌య్, ధ‌ర్మ‌పురి అర‌వింద్ లు అధికార పార్టీ నేత‌లపై బూత‌పురాణం వినిపిస్తున్నారు. ప్ర‌త్యేకించి సీఎం కేసీఆర్ మీద అస‌భ్య‌క‌ర‌మైన ప‌ద‌జాలం ఉప‌యోగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి బూతు సంస్కృతిని నేర్పిస్తోన్న రాజ‌కీయ నేత‌ల‌ను రాబోవు త‌రాలు ఆద‌ర్శంగా తీసుకుంటే స‌మాజం ఏమ‌వుతుందో ఊహించుకోచ్చు.