Site icon HashtagU Telugu

AP Polls : ముగిసిన నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు

Ap Elections

Ap Elections

ఏపీలో నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ గ‌డువు పూర్తయింది. మే 13 న ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు , 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వీటికి పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ ను దాఖలు చేసారు. టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి, వైసీపీ సహా రిజిస్టర్డ్‌, రికగ్నైజ్డ్‌ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు. అసెంబ్లీ స్థానాలకు మొత్తం 5,751 నామినేషన్లు, లోక్‌సభ స్థానాలకు మొత్తం 1,070 నామినేషన్లు దాఖలు చేసారు. శుక్రవారం నుండి నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం మొదలుపెట్టారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల వరకు సమయం ఇచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

కాగా 175 అసెంబ్లీ స్థానాలకు 2705 నామినేషన్లు , 25 పార్లమెంటు స్థానాలకు 503 నామినేషన్లకు ఎన్నికల సంఘం ఆమోదించింది. ఒకే కుటుంబం నుంచి ఇండిపెండెంట్‌గా నామినేష‌న్ వేసిన ప‌లువురు అభ్య‌ర్థులను ఈసీ ఉప‌సంహరించింది. అత్య‌ధికంగా నంద్యాల పార్లమెంటుకు 36 నామినేషన్లు రాగా, అత్యల్పంగా రాజమండ్రి పార్లమెంట్ స్థానానికి 12 నామినేషన్లను ఎన్నికల సంఘం అమోదించింది. తిరుపతి నుంచి అత్యధికంగా 48 నామినేషన్లు దాఖలు కాగా.. అత్యల్పంగా చోడవరం స్థానానికి 6 నామినేషన్లు ఆమోదించింది. కాసేప‌ట్లో నామినేష‌న్ల ఉపసంహ‌ర‌ణ‌పై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా అధికారిక ప్ర‌క‌ట‌న ఇవ్వనున్నారు. నామినేష‌న్ల ఉపసంహ‌ర‌ణ త‌ర్వాత ఇండిపెండెంట్ అభ్య‌ర్థుల‌కు ఆర్వోలు గుర్తులు కేటాయించ‌నున్నారు.

Read Also : Yogendranath Posani : పోసాని కి భారీ షాక్..