Site icon HashtagU Telugu

Davos: దావోస్ వ‌యా లండ‌న్ `లొల్లి`

Ktr, Jagan

Ktr, Jagan

ఏపీ సీఎం జ‌గ‌న్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇద్ద‌రూ దావోస్ స‌ద‌స్సుకు వెళ్లారు. అయితే, వాళ్లిద్ద‌రూ లండ‌న్ ను ఎందుకు ట‌చ్ చేశారు? అనేది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌. మూడు రోజుల క్రిత‌మే కేటీఆర్ లండ‌న్ వెళ్లారు. అక్క‌డ ఉండే ఎన్నారైల‌తో మీటింగ్ అయిన‌ట్టు కొన్ని ఫోటోలు వ‌చ్చాయి. కానీ, మూడు రోజుల పాటు ఆయ‌న లండ‌ర్ టూర్ షెడ్యూల్ అంతా సీక్రెట్‌. లండ‌న్ నుంచి దావోస్ చేరుకున్నారు. ఇక జ‌గ‌న్ కుటుంబ స‌మేతంగా లండ‌న్ వెళ్లారు. అక్క‌డ ఎవ‌ర్ని క‌ల‌వ‌బోతున్నారు? ఎందుకు లండ‌న్ వెళ్లారు అనేది ర‌హ‌స్యం.

దావోస్ స‌ద‌స్సు షెడ్యూల్ మాత్ర‌మే మినిట్ టూ మినిట్ ఏపీ సీఎం జ‌గ‌న్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్ల‌డించారు. ఆ సద‌స్సులో ఎవ‌రి ఎజెండా ఏమిటి అనేది కూడా కొంత మేర‌కు స్ప‌ష్టం అవుతోంది. పారిశ్రామిక వేత్త‌ల‌ను ఆకర్షించ‌డం వాళ్ల స‌మ‌ర్థ‌త‌కు స‌వాల్‌. గ‌త మూడేళ్లుగా తెలంగాణ పారిశ్రామిక ప్ర‌గ‌తి ప‌రుగులు పెట్టింది. సీఎంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత కంపెనీలు ఎక్కువ‌గా తెలంగాణ‌కు వ‌చ్చేశాయి. పైగా భౌగోళికంగా, రాజ‌కీయంగా తెలంగాణ రాష్ట్రం వ్యాపార‌, వాణిజ్యాల‌కు అనువైన ప్రాంతంగా గ్లోబ‌ల్ ప్ర‌చారం జ‌రిగింది. ఆ క్ర‌మంలో వ‌ర‌ల్డ్ టాప్ కంపెనీలు కూడా బ్రాంచ్ ల‌ను హైద‌రాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నారు. త‌ద‌నుగుణంగా రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వ్యూహాత్మ‌కంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌మోట్ చేశారు. ఫ‌లితంగా ఏపీ కంటే కొన్ని రెట్ల వేగంతో అభివృద్ధి బాట‌న తెలంగాణ న‌డుస్తోంది. ఆ విష‌యాన్ని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదిక‌గా వెల్ల‌డించిన విష‌యం విదిత‌మే.

వ‌న‌రుల ప‌రంగా తెలంగాణ కంటే ఏపీకి ఎక్కువ‌. భౌగోళికంగా , రాజ‌కీయంగా ఏపీలోని ప‌రిస్థితులు ప్ర‌తి కూలంగా ఉన్నాయ‌ని పారిశ్రామివేత్త‌లు ఎక్కువ‌గా భావిస్తున్నారు. అయితే, దేశ వ్యాప్తంగా ఓడ‌రేవులు, విమానాశ్ర‌యాల ఏర్పాటుకు భార‌త ప్ర‌భుత్వం ప్రోత్సాహ‌కాల‌ను ఇస్తోంది. వాటిని అందిపుచ్చుకోవ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం చేయాలి. కోవిడ్ త‌రువాత వైద్య , ఫార్మా రంగానికి ప్ర‌పంచ దేశాల్లో ప్రాధాన్యం పెరిగింది. ఆ రెండు రంగాల‌కు అవ‌స‌ర‌మైన వ‌న‌రులు తెలంగాణ కంటే ఏపీలో మెరుగ్గా ఉన్నాయ‌ని ఆయా రంగాల‌కు చెందిన నిపుణుల అభిప్రాయం. ఇలాంటి ప‌రిస్థితుల్లో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దావోస్ వేదిక‌గా ఇచ్చే ప్రజెంటేష‌న్ ఆధారంగా పెట్టుబ‌డులు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విష‌యంలో తెలంగాణ ఇప్ప‌టి వ‌ర‌కు పైచేయిగా నిలిచింది. ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వేసే వ్యూహాల‌కు అనుగుణంగా పారిశ్రామిక ప్ర‌గ‌తి ఏపీలో ఆధార‌ప‌డి ఉంది.

ఒక‌ప్పుడు చంద్ర‌బాబు దావోస్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ప్పుడ‌ల్లా అవినీతి సొమ్మును దాచుకోవ‌డానికి వెళ్లార‌ని వైసీపీ నేత‌లు ఆరోప‌ణ‌లు చేసే వాళ్లు. అలాంటి ఆరోప‌ణ‌ల‌ను టీఆర్ఎస్ నేత‌లు కూడా ఒక‌ప్పుడు బాబుపై చేసిన దాఖ‌లాలు లేకపోలేదు. బ్లాక్ మ‌నీకి స్వ‌ర్గ‌ధామంగా ఉండే స్విడ్జ‌ర్లాండ్ లో దావోస్ న‌గ‌రం ఉంది. ప్ర‌త్యేక విమానాల్లో రాజ‌కీయ నాయ‌కులు అక్క‌డికి వెళుతుంటారు. ఈసారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కూడా ప్ర‌త్యేక విమానంలో కుటుంబ స‌మేతంగా దావోస్ వెళ్లారు. ప్ర‌త్యేక విమానాల్లో ఇటీవ‌ల మంత్రి కేటీఆర్ ప‌లు దేశాల‌కు ప్ర‌యాణం చేశారు. ఆనాడు చంద్ర‌బాబు ప్ర‌త్యేక విమానాల్లో దావోస్ కు వెళ్లిన‌ప్పుడు చేసిన ఆరోప‌ణ‌లు నిజం అయితే, ఇప్పుడు జ‌గ‌న్‌, కేటీఆర్ దావోస్ వెళ్లిన సంద‌ర్భంగా ప‌లు అనుమానాలు రావ‌డం స‌హ‌జం. వాళ్ల ప‌ర్య‌ట‌న‌ల్లోని తెర‌వెనుక భాగోతాల‌ నిజం ఎవ‌రికి ఎరుక‌!