Dark politics : ముక్కోణ‌పు ల‌వ్ గేమ్‌! చ‌తుర్ముఖ చ‌ద‌రంగం!

రాజ‌కీయాల‌ను విశ్లేషించే వాళ్లు బీఆర్ఎస్,బీజేపీ, వైసీపీ,జ‌న‌సేన పార్టీల‌ను(Dark politics)వేర్వేరుగా చూడ‌లేరు. చ‌తుర్మ‌ఖ గేమ్ అర్థం కాదు

  • Written By:
  • Updated On - January 5, 2023 / 12:04 PM IST

రాజ‌కీయాల‌ను సునిశితంగా విశ్లేషించే వాళ్లు బీఆర్ఎస్, బీజేపీ, వైసీపీ, జ‌న‌సేన పార్టీల‌ను(Dark politics) వేర్వేరుగా చూడ‌లేరు. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద విరుచుకుప‌డుతోన్న ప‌వ‌న్ బీజేపీతో క‌లిసి ఉన్నారు. వైసీపీతో తెర‌వెనుక బంధాన్ని బీజేపీ కొన‌సాగిస్తోంది. స‌హ‌జ మిత్రులుగా బీఆర్ఎస్, వైసీపీ ఉన్నాయి. ఆ నాలుగు పార్టీలు ఆడుతోన్న చ‌తుర్మ‌ఖ గేమ్(Dark politics) ఒక ప‌ట్టాన ఎవ‌రికీ అర్థం కాదు. కానీ, తెర వెనుక రాజ‌కీయాల‌ను నిశితంగా ప‌రిశీలించే వాళ్ల‌కు మాత్రం తెలంగాణ‌లో కాంగ్రెస్, ఏపీలో తెలుగుదేశం పార్టీని ఏదో ఒక ర‌కంగా న‌ష్ట‌ప‌రిచే కార్య‌క్ర‌మాల‌ను ఆ నాలుగు పార్టీలు (love game) చేస్తుంటాయ‌ని అర్థమ‌వుతోంది.

నాలుగు పార్టీల చ‌తుర్మ‌ఖ గేమ్(Dark politics)

తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి బీఆర్ఎస్ ఎత్తుగ‌డ వేస్తుంద‌ని బీజేపీ నేత క‌న్నా లక్ష్మీనారాయ‌ణ‌, జీవీఎల్ త‌దిత‌రులు చేస్తోన్న ఆరోప‌ణ‌. ఇటీవ‌ల హైద‌రాబాద్ కేంద్రంగా ఏపీ నేత‌లు కొంద‌రు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వాళ్ల రాజ‌కీయ నేప‌థ్యంపై వైసీపీ వ్యంగ్యాస్త్రాల‌ను సంధిస్తోంది. అదే, బీజేపీ మాత్రం జ‌న‌సేన పార్టీని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి బీఆర్ఎస్ ప్ర‌య‌త్నం చేస్తుంద‌ని ప్ర‌చారం మొద‌లు పెట్టింది. కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన తోట చంద్ర‌శేఖ‌ర్ బీఆర్ఎస్ అధ్య‌క్షుడు అయ్యారు. ఆయ‌న కార‌ణంగా జ‌న‌సేన న‌ష్ట‌పోతుంద‌ని క‌న్నా అభిప్రాయం. అంటే, కాపు సామాజిక‌వ‌ర్గం చీలిపోతుంద‌ని ఆయ‌న భావ‌న‌. ఇదే విష‌యాన్ని ఎంపీ జీవీఎల్ కూడా వ్య‌క్త‌ప‌రిచారు. జ‌న‌సేన న‌ష్ట‌పోవ‌డాన్ని ప్ర‌స్తావిస్తోన్న‌ బీజేపీ నేత‌లు సొంత పార్టీ ఈక్వేష‌న్ ఏమిటో ఇప్ప‌టి వ‌ర‌కు చెప్ప‌లేదు.

Also Read : T Congress : చంద్రులు టార్గెట్ గా రేవంత్ రెడ్డి! మీడియా మేనేజ్మెంట్ అస్త్రం!

ఏపీలో బీజేపీ, జ‌న‌సేన క‌లిసి ప‌నిచేస్తున్నాయ‌ని చెబుతుంటారు. ఢిల్లీ బీజేపీతో మాత్ర‌మే పొత్తు అంటూ ప‌వ‌న్ అంటారు. తెలుగుదేశం పార్టీ దూకుడుగా వెళుతోన్న స‌మ‌యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మీద విరుచుకుపడుతూ జ‌న‌సేనాని ష‌డ‌న్ ఎంట్రీ ఇస్తుంటారు. గ‌త రెండేళ్లుగా తెలుగుదేశం చేప‌ట్టిన ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక కార్య‌క్ర‌మాలు తారాస్థాయికి చేరిన‌ప్పుడ‌ల్లా జ‌న‌సేనాని అక‌స్మాత్తుగా తెర‌మీద‌కు వ‌స్తారు. ఆయ‌న సినిమా డైలాగుల మాదిరిగా ఏదో ఒక సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తారు. ఫ‌లితంగా ప్ర‌జా సంబంధ‌మైన ఇష్యూలు ప‌క్క‌దోవ ప‌ట్ట‌డం ప‌రిపాట‌యింది. బ‌హుశా ఆయ‌న‌కు బీజేపీ ఇచ్చిన రూట్ మ్యాప్ అదేనేమో.

బీజేపీ, టీఆర్ఎస్(బీఆర్ఎస్) బంధం 

ఏపీలో జ‌న‌సేన బ‌ల‌ప‌డింద‌ని బీజేపీ చెబుతోంది. ఆ విష‌యాన్ని బీఆర్ఎస్ పార్టీ చేరిక‌ల మీద‌ పెడుతూ బీజేపీ హైలెట్ చేస్తోంది. ఇక బండి సంజ‌య్ ను తెలంగాణాలో బీఆర్ఎస్ బ‌ల‌హీన‌ప‌రుస్తుంద‌ని ఏపీ బీజేపీ నేత‌లు చెప్పే మాట‌. ఇటీవ‌ల వ‌ర‌కు మోడీ, కేసీఆర్ ఒక‌టిగా తెర‌మీద క‌నిపించారు. ఇప్పుడూ తెర వెనుక వాళ్లు చేస్తోన్న వ్య‌వ‌హారంపై కాంగ్రెస్ ఎప్ప‌టిక‌ప్పుడు చెబుతోంది. ఢిల్లీ న‌డిబొడ్డులో ఖ‌రీదైస‌న స్థ‌లాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కు మోడీ స‌ర్కార్ ఎందుకు ఇచ్చింది? అనేది రేవంత్ రెడ్డి వేస్తోన్న సూటి ప్ర‌శ్న‌. ఆ రెండు పార్టీల‌కు ఉన్న చీక‌టి బంధానికి అదో ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు. ఎనిమిదేళ్లుగా బీజేపీ, టీఆర్ఎస్(బీఆర్ఎస్) బంధం ప‌టిష్టంగా ఉంది. ప‌లుమార్లు మోడీ ప్ర‌భుత్వాన్ని కేసీఆర్ ప్ర‌శంసించారు. నోట్ల ర‌ద్దు, జీఎస్టీ, సీఏఏ, వ్య‌వ‌సాయ బిల్లు, 370 ర‌ద్దు త‌దిత‌ర కీల‌క బిల్లుల ఆమోదం కోసం పార్లమెంట్ వేదిక‌గా ప్ర‌త్య‌క్షంగానూ ప‌రోక్షంగానూ కేసీఆర్ స‌హ‌కారం అందించారు.

Also Read : CBN Kuppam : కుప్పం ప‌ర్య‌ట‌న‌పై పోలీస్ జులుం! క‌ర్ణాట‌క‌, ఏపీ బోర్డ‌ర్లో హై టెన్ష‌న్‌!

క్షేత్ర‌స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బ‌ల‌హీన‌ప‌ర‌చ‌డానికి బీజేపీ, బీఆర్ఎస్ గేమాడుతున్నాయ‌ని కాంగ్రెస్ చెబుతోంది. వ‌రి ధాన్యం కొనుగోలు నుంచి ఇటీవ‌ల ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ వ‌ర‌కు జ‌రిగిన అంశాల‌ను తీసుకుంటే ఆ రెండు పార్టీలు ఆడుతోన్న నాట‌కంగా ప్ర‌త్య‌ర్థి పార్టీలు భావిస్తున్నాయి. అందుకు త‌గిన ఆధారాల‌ను కూడా చూపుతున్నాయి. ఇక‌, వైసీపీ పార్టీకి బీజేపీతో విడ‌దీయ‌రాని ఫెవికాల్ బంధం ఉంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కు తెలియ‌కుండా ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఒక అడుగు కూడా ముందుకు వేయ‌లేరు. అలాగే, న‌రేంద్ర మోడీ, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌ధ్య రాజ‌కీయాల‌కు అతీత‌మైన బంధం ఉంది. ఇలా కేసీఆర్, జ‌గ‌న్, న‌రేంద్ర మోడీ మ‌ధ్య ముక్కోణ‌పు ల‌వ్ గేమ్(love game) న‌డుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప‌వ‌న్, బండి సంజ‌య్ ను బ‌ల‌హీన‌ప‌రిచేలా బీఆర్ఎస్ ప‌నిచేస్తుంద‌ని చెప్ప‌డం హాస్యాస్ప‌దం.