రిపబ్లిక్‌ డే ను కాస్త ఇండిపెండెన్స్ డే చేసిన తెలంగాణ మంత్రి.. ఆడేసుకుంటున్న బిఆర్ఎస్

  • Written By:
  • Publish Date - January 26, 2024 / 05:51 PM IST

చాలామంది రిపబ్లిక్‌ డే (Republic day), ఇండిపెండెన్స్ డే (Independence Day) విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు..రిపబ్లిక్‌ డే రోజు ఇండిపెండెన్స్ డే విషెష్ చెప్పడం..ఇండిపెండెన్స్ డే రోజు రిపబ్లిక్‌ డే విషెష్ చెప్పడం చేస్తుంటారు. తాజాగా ఈరోజు రిపబ్లిక్‌ డే (జనవరి 26) సందర్బంగా అలాగే కన్ఫ్యూజ్ అయ్యారు..ఎవరో బయటకు తెలియని వ్యక్తులు కన్ఫ్యూజ్ అయితే ఎవ్వరు పట్టించుకోరు..కానీ రాష్ట్రానికి మంత్రై..ప్రజల బాగోగులు చేసుకోవాల్సిన స్థాయిలో ఉండి కన్ఫ్యూజ్ అయితే ఎలా ఉంటుంది..ఏకంగా సోషల్ మీడియా వేదికగా ఈ తప్పు చేస్తే నెటిజన్లు ఊరుకుంటారా..? ముఖ్యంగా ప్రతిపక్షం ఊరుకుంటుందా..రచ్చ రచ్చ చేయదు..ఇప్పుడు కాంగ్రెస్ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Raja Narasimha) అలాగే తప్పు చేసాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు గణతంత్రి దినోత్సవ శుభాకాంక్షలు చెప్పబోయి ఇండిపెండెన్స్‌ డే శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. దీంతో నెటిజన్లు రెచ్చిపోయారు. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ అనుకూల వర్గీయులు దాన్ని తెగ ట్రోల్ చేస్తున్నారు. మంత్రి స్థాయి వ్యక్తికి ఇది కూడా తెలియదా అంటు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటె దేశ వ్యాప్తంగా గణతంత్రి దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండా ఎగరేశారు. ఆ త‌ర్వాత త్రివిద ద‌ళాల‌ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత శకటాల ప్రదర్శన ప్రారంభమైంది. ఈ సారి జాతీయ మహిళా శక్తితోపాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు. ఈ సారి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మ్యాక్రన్ విచ్చేశారు. దినోత్సవాల్లో భాగంగా కర్తవ్యపథ్‌లో పరేడ్‌లో శకటాల ప్రదర్శన జరిగింది. పలు రాష్ట్రాల నుంచి శకటాలు పరేడ్ చేశాయి. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన శకటం అందరినీ ఆకర్షించింది.

Read Also : AP : అప్పుడే టీడీపీ – జనసేన కూటమిలో ‘కుమ్ములాటలు’ మొదలయ్యాయా..?