TDP : చీరాల టీడీపీ అభ్య‌ర్థిగా ద‌గ్గుబాటి కుమారుడు..?

  • Written By:
  • Publish Date - September 28, 2022 / 10:10 AM IST

మాజీ మంత్రి ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు కుమారుడు హితేష్ చెంచురామ్ టీడీపీలో చేర‌బోతున్నారా అంటే అవున‌నే సంకేతాలు టీడీపీ నుంచి వ‌స్తున్నాయి. వైసీపీకి రాజీనామా చేసినా హితేష్‌, ఆయ‌న తండ్రి వెంక‌టేశ్వ‌ర‌రావు ఆ పార్టీ నేత‌ల‌ను క‌ల‌వ‌డం లేదు. ఇటీవ‌ల ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు అనారోగ్యంతో ఆసుప‌త్రిలో చేరిన ఆయ‌న్ని వైసీపీ నేత‌లు ఒక్క‌రూ ప‌రామ‌ర్శించ‌లేదు. అదే స‌మ‌యంలో టీడీపీ అధినేత‌, ఆయ‌న తోడ‌ల్లుడు నారా చంద్రబాబు నాయుడు నేరుగా ఆసుప‌త్రికి వెళ్లి వెంక‌టేశ్వ‌ర‌రావు యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. దీంతో నారా ద‌గ్గుబాటి కుటుంబాలు ఒక్క‌టైయ్యాయ‌నే సంకేతాలు వెలువ‌డ్డాయి. అయితే ద‌గ్గుబాటి కుటుంబం వైసీపీకి రాజీనామా చేయ‌డంతో టీడీపీలో చేర‌తార‌నే టాక్ వినిపిస్తుంది.

రాజ‌కీయాలకు దూరంగా ఉన్న ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు ఆయ‌న కుమారుడిని మాత్రం ఎమ్మెల్యే చేయాల‌నే కోరిక‌తో ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి హితేష్ పోటీలో ఉంటార‌ని టీడీపీ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అయితే సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన ప‌ర్చూరులో సిట్టింగ్ ఎమ్మెల్యే సాంబ‌శివ‌రావుకి టికెట్ క‌న్ఫార్ అవ్వ‌డంతో హితేష్ ని చీరాల నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయించాల‌నే ఆలోచ‌న టీడీపీ చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఎందుకంటే చీరాల వైసీపీ నుంచి ఆమంచి కృష్ణ‌మోహ‌న్ కానీ ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాంలు పోటీలో ఉండే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో వారికి బ‌ల‌మైన అభ్య‌ర్థిగా హితేష్‌ని పోటీలో పెట్టాల‌ని టీడీపీ అధిష్టానం భావిస్తుందట‌. మ‌రి ద‌గ్గుబాటి కుటుంబం టీడీపీలో ఎప్పుడు చేరుతుందోన‌ని టీడీపీ క్యాడ‌ర్ వేచిస్తుంది. టికెట్ అయితే అధినేత క‌న్ఫార్ చేసార‌ని కాని ద‌గ్గుబాటి కుటుంబం టీడీపీలో చేర‌డం లేటు అంటూ క్యాడ‌ర్‌లో చ‌ర్చ న‌డుస్తుంది.