Site icon HashtagU Telugu

Daggubati Venkateswara Rao : గత ఎన్నికల్లో ఓడిపోవడమే మంచిదైంది – దగ్గుబాటి వెంకటేశ్వరరావు

Daggubati Venkateswara Rao

Daggubati Venkateswara Rao

గత ఎన్నికల్లో వైసీపీ నుండి గెలవకపోవడమే మంచిదైందన్నారు మాజీ వైసీపీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswara Rao). 2019 ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం వైసీపీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేశారు. ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి ఏలూరు సాంబశివరావుపై ఓడిపోయారు. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో వైసీపీకి రాజీనామా చేశారు. అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్నారు. ఇక ఇప్పుడు మరో మూడు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దగ్గుబాటు వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వైసీపీ నుంచి గెలవకపోవడం మంచిదైందని చెప్పుకొచ్చారు. ఎందుకంటే అభివృద్ధిపై ప్రజలను తాను సమాధానం చెప్పలేకపోయేవాడినని … గెలిచి ఉంటే ప్రజలు తనను నిలదీసేవాళ్లని పేర్కొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఈ దారుణమైన రోడ్లపై ఇంత స్వేచ్ఛగా తిరిగేవాడిని కాదని … దేవుడి దయ వల్ల పర్చూరులో తాను ఓడిపోవడం మంచిదైందని అన్నారు. వైసీపీ పాలనలో కారంచేడులో ఒక్క రోడ్డు కూడా వేయలేదని విమర్శించారు. తన వ్యక్తిత్వాన్ని కాపాడటానికే దేవుడు తనను ఓడించాడని అన్నారు. తాను ఓడిపోయిన రెండు నెలల తర్వాత తనను పిలిపించిన జగన్… తన కుమారుడిని ఎమ్మెల్సీ చేసి, మంత్రి పదవి ఇస్తానని చెప్పారని… అయితే ఆయన పెట్టిన నిబంధనలకు తలొగ్గలేక జగన్ ఆఫర్ ను తిరస్కరించామని తెలిపారు. మనకు వైసీపీ సరైన పార్టీ కాదని తన కుమారుడు తనకు చెప్పాడని తెలిపాడు.

Read Also : Friday Donation Tips : శుక్రవారం ఆ రంగు వస్తువులను దానం చేస్తున్నారా.. అయితే మీరు చిక్కుల్లో పడ్డట్టే?