గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్ అభిమానుల వర్సెస్ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ (Jr NTR Fans Vs Anantapur MLA Daggupati Venkateswara Prasad)మధ్య జరుగుతున్న వివాదం చర్చనీయాంశంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ మరియు ఆయన సినిమాలపై దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు చేపట్టారు. అయితే ఈ ఆందోళనల వెనుక వేరే కారణాలు ఉన్నాయని, కొందరు వ్యక్తులు ఈ అభిమానులను రెచ్చగొడుతున్నారని తెలుస్తోంది.
నిజానికి ఈ వివాదానికి ప్రధాన కారణం టీడీపీలోని అంతర్గత రాజకీయాలే అని సమాచారం. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్న దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు మాజీ ఎమ్మెల్యే వీ ప్రభాకర్ చౌదరి (V Prabhakar Chowdhury) మరియు పరిటాల శ్రీరామ్ (Paritala Sriram) ల మధ్య విభేదాలు ఉన్నాయని, వారే ఎన్టీఆర్ అభిమానులను రెచ్చగొడుతున్నారని ప్రచారం జరుగుతోంది. అంతే కాదు శ్రీరామ్ , ప్రభాకర్ లు దగ్గరి బంధువులు అని తెలుస్తుంది. 2024 ఎన్నికల్లో అనంతపురం అర్బన్ టికెట్ ప్రభాకర్ చౌదరికి కాకుండా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు దక్కడంతో అప్పటి నుంచి ప్రభాకర్ చౌదరి ఆయనపై కక్ష పెంచుకున్నారని ప్రచారం జరుగుతుంది.
Vijay Party Meeting: విజయ్ పార్టీ బహిరంగ సభలో అపశృతి.. 400 మందికి అస్వస్థత?!
ఈ పరిస్థితిని అదునుగా చేసుకుని ప్రభాకర్ చౌదరి మరియు లింగా నరేందర్ చౌదరి వంటి వారు, ఎన్టీఆర్ అభిమానులను ఉసిగొల్పి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌పై విమర్శలు చేయిస్తున్నారని తెలుస్తోంది. దగ్గుపాటి ఎన్టీఆర్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశారని చెబుతూ, అభిమానులను రెచ్చగొట్టి, వారిని ముందుండి నడిపిస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్ అభిమానులు రోడ్లమీదకు వచ్చి దగ్గుపాటిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని, ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రభస సృష్టిస్తున్నారు.
ఈ పరిణామాలన్నీ చూస్తుంటే.. దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ నిరసనలు కేవలం ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం మాత్రమే కాదని, దీని వెనుక టీడీపీలోని కొన్ని అంతర్గత శక్తుల కుట్ర ఉందని స్పష్టమవుతోంది. ఇది ఎన్టీఆర్ అభిమానుల పేరుతో దగ్గుపాటిని పదవి నుంచి తొలగించడానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోంది. ఈ మొత్తం వివాదంలో ఎన్టీఆర్ అభిమానులు కేవలం పావులుగా మారిపోయారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
ఈ వ్యవహారం రోజు రోజుకు మరింత ఎక్కువ అవుతుండడం, పార్టీ శ్రేణులు సైతం దీని గురించి లోతుగా మాట్లాడుకోవడం చేస్తుండడంతో రాబోయే రోజుల్లో ఈ వివాదం మరికొన్ని వివాదాలకు దారి తీసే అవకాశం ఉండడం తో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు పరిటాల శ్రీరామ్ , ప్రభాకర్ చౌదరి లకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి ఈ వార్నింగ్ తో ఈ రభస కు ఫుల్ స్టాప్ పడడం ఖాయంగా కనిపిస్తుంది.