AP BJP : ఏపీ బీజేపీ రాష్ట్ర నూతన కార్యవర్గం ప్రకటించిన దగ్గుబాటి పురంధేశ్వరి.. ఏపీ బీజేపీ కొత్త టీం ఇదే..

30 మందితో ఏపీ బీజేపీ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని దగ్గుబాటి పురంధేశ్వరి అధికారికంగా ప్రకటించారు. మరో 18 మందితో మోర్చాల అధ్యక్షులను ఆర్గనైజేషనల్ కమిటీగా ప్రకటించారు.

Published By: HashtagU Telugu Desk
Daggubati Purandeswari announced new AP BJP state organizational committee

ఇటీవల ఏపీ బీజేపీ(AP BJP) అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురంధేశ్వరిని(Daggubati Purandeswari) నియమించిన సంగతి తెలిసిందే. ఎలక్షన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక పురంధేశ్వరి ఆల్రెడీ పార్టీలో అందర్నీ కలుపుకుంటూ వెళ్తున్నారు. తాజాగా ఏపీ బీజేపీ రాష్ర నూతన కార్యవర్గాన్ని దగ్గుబాటి పురంధేశ్వరి ప్రకటించారు. రాబోయే ఎలక్షన్స్(Elections) ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త టీంని రెడీ చేసినట్టు తెలుస్తుంది.

30 మందితో ఏపీ బీజేపీ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని దగ్గుబాటి పురంధేశ్వరి అధికారికంగా ప్రకటించారు. మరో 18 మందితో మోర్చాల అధ్యక్షులను ఆర్గనైజేషనల్ కమిటీగా ప్రకటించారు.

#ప్రధాన కార్యదర్శులుగా కాశీ విశ్వనాధరాజు, బిట్ర శివన్నారాయణ, దయాకర్ రెడ్డి, గారపాటి తపనా చౌదరి
#వైఎస్ ప్రెసిడెంట్ లుగా మాధవ్, విష్ణు వర్ధన్ రెడ్డి, ఆది నారాయణ రెడ్డి, విష్ణు కుమార్ రాజుతో సహా మరో 11 మంది నియామకం
#సెక్రటరీలుగా‌ పది మందికి అవకాశం

రాష్ట్ర కమిటీతో పాటు పలు మోర్చాల అధ్యక్షులను కూడా ప్రకటించారు.

యువ మోర్చా అధ్యక్షుడిగా మిట్టా వంశీ
మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నిర్మలా కిషోర్
కిషాన్ మోర్చా అధ్యక్షుడిగా కుమార స్వామి
ఎస్ సి మోర్చా అధ్యక్షుడిగా గుడిసె దేవానంద్
ఓబిసి మోర్చా అధ్యక్షుడిగా గోపి శ్రీనివాస్
ఎస్ టి మోర్చా అధ్యక్షుడిగా ఉమా‌ మహేశ్వర రావు,
మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా షేక్ బాజి
మీడియా ఇన్‌చార్జిగా పాతూరి నాగభూషణం నిమాయకం, వీరితో పాటు అధికార ప్రతినిధులుగా మరో ఏడుగురికి అవకాశం కల్పించారు.

  Last Updated: 18 Aug 2023, 08:57 PM IST